"భారత జాతీయపతాకం" కూర్పుల మధ్య తేడాలు

2405:204:6124:CB2C:308C:42AC:6F24:B87A (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2486605 ను రద్దు చేసారు ?
ట్యాగు: చరవాణి సవరింపు
(2405:204:6124:CB2C:308C:42AC:6F24:B87A (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2486605 ను రద్దు చేసారు ?)
ట్యాగు: రద్దుచెయ్యి
స్వాతంత్ర్యం పొందడానికి ముందు భారతదేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న [[భారత జాతీయ కాంగ్రెసు]] [[1921]]లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకొంది. ఎరుపు [[హిందూ మతం|హిందూమతాని]]కి, ఆకుపచ్చ [[ఇస్లాం]] మతానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు. కాంగ్రెసు [[1931]]లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నము బొమ్మగల పతాకాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలూ లేవు.
 
[[1947]] [[ఆగస్టు]]లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్నిరోజుల ముందు ఏర్పాటైన garuరాజ్యాంగసభ, andకాంగ్రెస్ homeపార్టీ withపతాకాన్నే youఅన్ని aboutపార్టీలకు, thisఅన్ని butమతాలవారికి notఆమోదయోగ్యమైన asమార్పులు badచేసి జాతీయపతాకంగా స్వీకరించడానికి నిర్ణయించింది. అన్నిటికంటే ము8ఖ్యమైనముఖ్యమైన మార్పు రాట్నము స్థానంలో అశోకచక్రాన్ని చేర్చడం.
 
అంతకు ముందున్న [[జెండా]]<nowiki/>లోని రంగులకు మతపరమైన అన్వయాలున్నందున స్వతంత్ర భారత తొలి [[ఉపరాష్ట్రపతి]] [[సర్వేపల్లి రాధాకృష్ణన్]], జాతీయపతాకానికి ఎటువంటి మతపరమైన అన్వయాలూ లేవని స్పష్టం చేస్తూ పతాకప్రాధాన్యతను ఇలా వివరించాడు: "కాషాయరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చరంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతరజీవులన్నీ ఏ వృక్షసంపదమీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. [[అశోకచక్రం]] ధర్మపాలనకు గుర్తు. [[సత్యం]], ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం."
36

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2486796" నుండి వెలికితీశారు