"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

ఫ్రెంచ్ విప్లవం వరకు ఫ్రాన్సు రాచరికపు పాలనలో ఉండేది. 1789 జూలై 14న బాసిల్లేను పేల్చివేసిన వెంటనే ఇది అంతరించి పోకుండా 1792 సెప్టెంబరులో మొదటి గణతంత్రం ఏర్పడేవరకు కొనసాగింది. భీకరపాలనలో అనేక వేలమంది ఫ్రెంచ్ పౌరులతో పాటు " లూయిస్ XVI " అతని భార్య " మేరీ అంటోనిటీ " కూడా ఉరితీయబడ్డారు (1793).<ref>[http://www.nytimes.com/1989/07/09/travel/vive-la-contre-revolution.html?sec=travel వివే లా కాంట్రే-రివల్యూషన్!]. ది న్యూ యార్క్ టైమ్స్ జూలై 9, 1989.</ref> అనేక స్వల్ప-కాలిక ప్రభుత్వాల తరువాత " నెపోలియన్ బొనపార్టే " 1799లో గణతంత్రాన్ని వశపరచుకొని తనకు తాను " మొదటి కాన్సుల్ " గా ప్రకటించుకొన్నాడు. ఇప్పుడు మొదటి సామ్రాజ్యం (1804–1814)గా పిలువబడుతున్న దానికి [[చక్రవర్తి]] అయ్యారు. అనేక యుద్ధాల తరువాత అతని సైన్యం ఖండాంతర ఐరోపాలో చాల భాగం ఆక్రమించుకుంది, కొత్తరాజ్యాలకు బోనపార్టే కుటుంబసభ్యులు నియంతలుగా నియమించబడ్డారు. నెపోలియన్ యుద్ధాలలో సుమారు ఒక మిలియన్ ఫ్రెంచ్ పౌరులు మరణించారు.<ref>[http://www.questia.com/googleScholar.qst?docId=5001329960 నెపోలియన్ అండ్ జర్మన్ ఐడెన్టిటీ]. టిం బ్లాన్నింగ్ చే పత్రికా శీర్షిక; హిస్టరీ టుడే, వాల్యూం. 48, ఏప్రిల్ 1998.</ref>
 
1815లో [[వాటర్లూ యుద్ధంలోయుద్ధం]]లో నెపోలియన్ అంతిమ ఓటమి తర్వాత నూతన రాజ్యాంగ పరిమితులతో సమైఖ్య ఫ్రెంచి పాలన తిరిగి స్థాపించబడింది. 1830లో జరిగిన ఒక ప్రజా తిరుగుబాటు తరువాత రాజ్యాంగబద్ధంగా జూలైలో స్థాపించబడిన సమైఖ్యపాలన 1848 వరకు కొనసాగింది. స్వల్పకాల రెండవ గణతంత్రం 1852లో " లూయిస్-నెపోలియన్ బొనపార్టే " రెండవ సామ్రాజ్య ప్రకటనతో ముగిసింది. 1870లో జరిగిన " ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో " లూయిస్-నెపోలియన్ ఓటమితో అతను తొలగింపబడి మూడవ గణతంత్రం స్థాపించబడింది.
 
17వ శతాబ్ద ప్రారంభం నుండి 1960ల వరకు ఫ్రాన్స్ ఆధీనంలో అనేక రూపాలలో వలస ప్రాంతాలు ఉండేవి. 19 - 20 శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా సముద్రానికి ఆవలివైపు ఉన్న ఫ్రాన్స్ వలస సామ్రాజ్యం " బ్రిటిష్ సామ్రాజ్యం " తరువాత ప్రపంచంలోని రెండవ పెద్ద సామ్రాజ్యంగా ఉంది. 1919 - 1939 మధ్య ఉచ్ఛస్థితిలో రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం 1,23,47,000 చదరపు కిలోమీటర్ల (47,67,000&nbsp;చదరపు మైళ్ళు) వైశాల్యంలో విస్తరించి ఉంది. 1920లు - 1930ల మధ్యలో ఫ్రాన్స్ ప్రధానభూభాగంతో కలిపి ఫ్రెంచ్ సార్వభౌమాధికారంలో ఉన్న మొత్తం భూమి 1,28,98,000 చదరపు కిలోమీటర్లకు (49,80,000&nbsp;చదరపు మైళ్ళు) చేరుకుంది. ఇది ప్రపంచం మొత్తం భూభాగంలో 8.6%.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2489034" నుండి వెలికితీశారు