తిరువళ్ళూర్: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషాలు సవరణ
ట్యాగు: 2017 source edit
→‎స్థలపురాణం: మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 34:
 
==స్థలపురాణం==
స్థలపురాణం అనుసరించి తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమ్మావాస్య రోజున మహర్షి తపసుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలి వాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రమును ధరించి ఆరోజు రాత్రి ఆయన గృహములో నివసించడానికి చోటు చూపమని అడిగాడు. ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు. మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ముసలి వాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశైనంలో పవళించి లక్ష్మీ దేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీరరాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైన తొలగించి అరోగ్యాన్ని ఐశ్వైర్యాన్ని అందించాలని కోరుకున్నాడు.<ref>{{Cite web|url=http://svdtiruvallur.com/|title=Thiruvallur Veeraraghava Perumal Temple}}</ref>
 
అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. శని-ఆదివారం కూడా ఆలయం ఆలయం భక్తులతో రద్దీ బాగానే ఉంటుంది. ఈ ఆలయంలో లక్ష్మి దేవికి ప్రత్యేక సన్నిధి కలదు. రాముల వారికి, శ్రీ కృష్ణుడికి కూడా ప్రత్యేక సన్నిధి ఉన్నాయి. ఆలయంలో శిల్పకళ ఆకట్టుకుంటుంది
 
== వైష్ణవ దివ్యదేశం ==
<poem>
"https://te.wikipedia.org/wiki/తిరువళ్ళూర్" నుండి వెలికితీశారు