చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
 
== జిల్లా చరిత్ర==
{{main article|చిత్తూరు జిల్లా చరిత్ర}}
చిత్తూరు జిల్లా [[1911]] [[ఏప్రిల్]] [[1]] సంవత్సరంలో ఏర్పాటైంది. [[అప్పటి ఉత్తర ఆర్కాట్]]లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, [[కడప జిల్లా]] నుంచి మరి కొన్ని తాలూకాలు, [[నెల్లూరు]] జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు [[తమిళనాడు]]కు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన [[చోళులు]], [[పల్లవులు]], పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. [[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో [[చంద్రగిరి]] కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, [[చంద్రగిరి]] ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు [[హైదర్ అలీ]] మరియు [[టిప్పు సుల్తాన్]] చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ [[గుర్రంకొండ]] నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్. [[రెండవ మైసూరు యుద్ధం]] జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని [[నరసింగరాయనిపేట]] దగ్గర హైదరాలీ [[డిసెంబరు 6]], [[1782]]లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద్ అలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడు.
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు_జిల్లా" నుండి వెలికితీశారు