కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
== జీవితము ==
కొకు [[గుంటూరు|గుంటూరు జిల్లా]], [[తెనాలి]] లోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు [[1925]] వరకు సాగింది. చిన్నవయసులోనే [[1914]]లో తండ్రీ, [[1920]]లో తల్లీ మరణించడంతో [[మేనమామ]] వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేత వయసులోనే కొన్ని [[పద్యాలు]], ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసాడు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసాడు. [[1925]]లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన [[పెళ్ళి]] జరిగింది.[[1925]] నుండి [[1927]] వరకు గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]]లో ఇంటర్మీడియేటు చదివాక, [[1927]]-29 కాలంలో [[మహారాజా కళాశాల]], విజయనగరంలో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన [[నాస్తికత్వం|నాస్తికుని]]గా మారిపోయాడు.
 
 
 
[[1929]]లో [[కాశీ]] [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|హిందూ విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. [[1930]]లో కొకు తొలిరచన ''సినిమా '' ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటి కథ ''ప్రాణాధికం '' [[గృహలక్ష్మి మాసపత్రిక]]లో అగ్రస్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. [[1931]]లో కొంతకాలం పాటు [[వరంగల్లు]]లో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. [[చక్రపాణి]], పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి ''[[యువ]]'' పత్రికను ప్రారంభించాడు.