హిందూపురం: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హిందూపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]లో ఓ ప్రముఖమైన పట్టణం మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 515201.
 
==చరిత్ర, విశేషాలు==
హిందూపురం మొదటి నుంచి ఓ ప్రముఖ వర్తక కేంద్రం, మరియు రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం. స్థానిక స్థలచరిత్ర ప్రకారం మరాఠా యోధుడు [[మురారి రావు]] ఈ గ్రామాన్ని కట్టించి తన తండ్రి బిరుదమైన హిందూరావు పేరుమీద హిందూపురం అని పేరు పెట్టినట్టు తెలుస్తున్నది.
ఇక్కడ వర్తకులు ఎక్కువగా వున్నారు సుప్రసిద్ధి గాంచిన [[లేపాక్షి]] హిందూపురం తాలూకా లోనిది. [[కల్లూరు సుబ్బారావు|కల్లూరి సుబ్బారావు]] హిందూపురానికి చెందిన వాడే. కళాశాల స్థాపించి ఎందరికో విద్యా దానం చేసిన దాసా గోవిందయ్య చిరస్మరణీయుడు.
ఇచ్చట యల్.జి.బాలకృష్ణన్ గారు సూపర్ స్పిన్నింగ్ మిల్లులు స్థాపించి అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. పట్టణ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ మిల్లుల వల్ల జీవనోపాధి పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు.
 
==పాలనా విభాగాలు==
ఇది [[లోక్ సభ నియోజక వర్గం]] కేంద్ర స్థానమే కానీ [[రెవిన్యూ డివిజన్]] కేంద్ర స్థానం కాదు. అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ [[రెవిన్యూ డివిజినల్ అధికారి]] ఉండడు. ఇది పెనుగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
 
==రవాణా సౌకర్యాలు==
==ప్రత్యేక ఆర్థిక మండళ్ళు==
Line 19 ⟶ 16:
* [[లేపాక్షి]] నాలెడ్జి హబ్‌ చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో సెజ్‌ కోసం 9,428ఎకరాలు సేకరించారు.
* సైన్స్‌ సిటీ... ఓడీసీ, అమడగూరు మండలాల్లో 640ఎకరాలను సేకరించారు.
 
== రాజకీయాలు ==
* [[2014]] శాసనసభ ఎన్నికలలో [[నందమూరి తారక రామారావు]] కుమారుడు చలనచిత్ర నటుడు అయిన [[నందమూరి బాలకృష్ణ]] శాసనసభ సభ్యుడుగా ఎన్నిక చెయ్యబడ్డాడు.
Line 33 ⟶ 29:
===వ్యవసాయంపై ప్రభావం===
హిందూపురం పట్టణంలో నెలకొన్న నీటి సమస్య కారణంగా ఈ ప్రాంతంలో [[వ్యవసాయం]] పక్కన పెట్టేశారు. వ్యవసాయ బోర్ల నుంచి పట్టణానికి నీటిని సరఫరా చేస్తున్నారు. దాదాపు 100 బోర్ల నుంచి పట్టణానికి నీటిని ప్రైవేటు ట్యాంకర్లతో తీసుకొస్తున్నారు. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని పల్లెల నుంచి నీటిని తీసుకురావాల్సిన వస్తోంది. లేపాక్షి మండలం చోళసముద్రం, పరిగి మండలం కొడిగినహళ్లి, శాసనకోట, హిందూపురం గ్రామీణ మండలం పూలకుంట, బీరేపల్లి, కొటిపి, మణేసముద్రం, కిరికెర తదితర పంచాయతీల్లోని గ్రామాల నుంచి పట్టణానికి నీటిని తీసుకువస్తున్నారు. ఫలితంగా [[సడ్లపల్లి]], [[కొట్నూరు]], [[శ్రీకంఠాపురం (గ్రామీణ)|శ్రీకంఠాపురం]], [[ముదిరెడ్డిపల్లి]], [[సుగూరు]] తదితర గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయాన్ని పక్కన పెట్టి, పట్టణానికి నీటిని అందిస్తున్నారు<ref name="కన్నీటి.. ‘పురం’! "/>.
 
===భూగర్భ జలాలు===
హిందూపురం ప్రాంతంలో కొత్తగా బోర్లు వేసినా ప్రయోజనం లేదని అధికారులు తేల్చేశారు. 1000 అడుగుల లోతు తవ్వినా నీరు పడని పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపాల్టీ తరపున 2015లో దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి 40 బోర్లు తవ్వించగా మొదట్లో కొంత నీరు వచ్చినా, 2016 నాటికి అన్ని ఎండిపోయాయి. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో మణేసముద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫీజో మీటర్‌లోనే భూగర్భ జలమట్టం 38 మీటర్లు కనిపిస్తోంది. భూగర్భ జలమట్టం జిల్లాలో 19 మీటర్లు ఉండగా హిందూపురంలో 38 మీటర్లకు చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో లాతూరులా మారనుంది<ref name="కన్నీటి.. ‘పురం’! "/>.
===నీటి ఖర్చు===
పురంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పట్టణంలోనే కేవలం నీటి కోసం చేస్తున్న ఖర్చు ఏడాదికి రూ.50 కోట్లు. అక్షరాలా ఇది నిజం. ఏడాదికి మున్సిపాల్టీ వారు నీటి సరఫరా కోసం రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వారు ఇచ్చే నీరు ఏ మూలకు సరిపోక పోవడంతో ప్రజలు పేద, ధనికులు అని తేడా లేకుండా నిత్యం కొనుగోలు చేస్తున్నారు. నిత్యం 1,000కి పైగా ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. ట్యాంకరు నీరు సగటున రూ.400. ఇలా రోజుకు రూ.4 లక్షలకు పైగానే ప్రైవేటు వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇక తాగడానికి తప్పనిసరిగా శుద్ధి చేసిన నీటిని క్యాన్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఖర్చు దాదాపు రూ.6-7 లక్షలు. ఏడాదికి శుద్ధజలం కోసం పట్టణవాసులు రూ.20-25 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇలా అంతా కలిపి ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చవుతోంది<ref name="కన్నీటి.. ‘పురం’! "/>.
 
*
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,03,538 - పురుషులు 1,02,664 - స్త్రీలు 1,00,874
;
 
==మూలాలు==
{{Reflist}}
 
{{commons category|Hindupur}}
 
==బయటి లింకులు==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/హిందూపురం" నుండి వెలికితీశారు