"ముఖలింగం" కూర్పుల మధ్య తేడాలు

18 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
}}
'''శ్రీ ముఖలింగం''' లేదా '''ముఖలింగం''' ([[ఆంగ్లం]]: '''Mukhalingam''') [[శ్రీకాకుళం]] జిల్లా, [[జలుమూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇది మండల కేంద్రమైన జలుమూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[ఆమదాలవలస]] నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 837 ఇళ్లతో, 3022 జనాభాతో 175 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1504, ఆడవారి సంఖ్య 1518. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 202 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581094<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 532428. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.
 
==గ్రామ జనాభా==
2001 జనాభా లెక్కల ప్రకారం వివరాలు <ref>[http://ourvillageindia.org/Place.aspx?PID=14228 Mukhalingam at Our Village India.org]</ref>
 
శ్రీ ముఖలింగేశ్వరస్వామి [[దేవాలయము]] గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.
 
ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు [[రాజధాని]]<nowiki/>కి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ [[బౌద్ధ]], [[జైన]], [[హిందూ]] మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన [[సరస్వతి]] విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.
ఇక్కడ అనేక [[శాసనాలు]] కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న [[రాజు]] కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ [[కళింగులు|కళింగరాజులు]]. కామార్ణవుడు తన [[రాజధాని]]ని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది.
ఇక్కడ ముఖలింగాలయాన్ని '''మధుకేశ్వరాలయం''' అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. [[ఇప్ప]]చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ [[గుడి]]<nowiki/>కి మధుకేశ్వరస్వామి [[ఆలయం]]గా పేరొచ్చిందని అంటారు.
ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, [[సప్త మాతృకలు|సప్త మాతృకలలో]] ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు [[పార్వతి|పార్వతీదేవి]] అవతారాలు. ఇక్కడి శిల్పాలలో [[వరాహావతారం]], [[వామనావతారం]], [[సూర్యుడు|సూర్య]] విగ్రహం వుండటం విశేషం.
భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ [[కుమారస్వామి]], [[దక్షిణామూర్తి]] నాలుగు ముఖాలతో [[బ్రహ్మ]], [[గణపతి]] విగ్రహాలున్నాయి.
 
సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన [[శిఖరం]]పై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే, మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి [[విశ్వబ్రాహ్మణ]] శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
ఇక్కడ ఏడు నాలికల [[అగ్ని]] విగ్రహం, [[వినాయకుడు]], [[కాశీ]] [[అన్నపూర్ణ]], నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ [[ఆలయం]] శిథిలావస్థలో ఉంది.
[[File:Designed reliefs on a dome at Sri Mukhalingam Temple complex.jpg|thumb|శ్రీముఖలింగేశ్వర ఆలయంలోని శిల్పకళ]]
ఆంధ్రప్రాంతమును ఏలిన తూర్పు గాంగవంశరాజులకు 6 శతాబ్దములకు పైగా రాజధానియై ఈ ప్రాంతము భాసిల్లినది. తూర్పు గాంగరాజులలో ప్రాముఖ్యుడైన అనంతవర్మ చోడగంగదేవుడు ఉత్కళమును జయించి, తన రాజధానిని క్రీ.శ.1135 లో [[ఒరిస్సా]] లోని కటక్ నగరమునకు మార్చిన పిదప ముఖలింగపు ప్రాముఖ్యత క్రమముగా తగ్గిపోయింది. ఆనాటి వైభవుమునకు తాత్కారణముగ ముఖలింగంలో మూడు శైవ దేవాలయములున్నవి.ముఖలింగం లోని పాశుపత శైవమత ప్రాబల్యమునకు నిదర్శనముగ అచ్చటి ఆలయములలో లకుశీలుడు విగ్రహములు పెక్కు ఉన్నాయి.
 
లకుశీలుడు [https://en.wikipedia.org/wiki/Lakulisha|లకుశీలుడు] తను మత స్థాపకుడనియు, అతడు శివుని అవతారమనియు పాశుపత శైవమతస్థులు నమ్ముదురు.శైవమత గ్రంథములలో కూడా లకులీశుడు శివుని అవతారమనియు పేర్కొనబడెను.లింగ పురాణములో లకులీశుడు శివునియొక్క 28వ అవతారముగ చెప్పబడెను.కాని లకులీశుడు మానవుడనియు, అతడు గుజరాత్ రాష్త్రములోని కాయారోహణము (కార్వాన్) పట్టణమున క్రీ.శ. 2 వ శతాబ్దములో జనించెననియు మనకు శాసనముల ఆధారముగ తెలియుచున్నది.
 
లకులీశుడు ఎల్లప్పుడు లకుటమును ధరించుటచే ఆతనికి ఆపేరు వచ్చెను. అతడు [[పాశుపతాస్త్రం|పాశుపత]] శైవమత సిద్ధాంతములకు ఒక రూపము తెచ్చి, ఆ మతప్రచారము చేసెను. లకులీశుని శిష్యులలో ముఖ్యులు కుశినుడు, [[మిత్రుడు]], గార్గుడు, కౌరుస్యుడు అనువారు. లకులీశుని నిరంతర కృషివలన ఆతని శిష్యులును, పాశుపత శైవ మతస్థుల సంఖ్యయు నానటికి పెరిగెను. మధ్యయుగము నాటికి పాశుపత శైవమతమునకు బహుళ ప్రాచుర్యము లభించి, ఆ మతస్థులలో లకులీశుడు దైవసంభూతుడే అను నమ్మకము గాఢముగ ఏర్పడెను.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
 
సమీప బాలబడి [[నరసన్నపేట|నరసన్నపేటలో]] ఉంది.
 
సమీప జూనియర్ కళాశాల జలుమూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల శ్రీకాకుళంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ [[శ్రీకాకుళం|శ్రీకాకుళంలో]] ఉన్నాయి.
 
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నరసన్నపేటలోను, అనియత విద్యా కేంద్రం మర్రివలసలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[శ్రీకాకుళం]] లోనూ ఉన్నాయి.
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
ముఖలింగంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలోదూరం ఉంది.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
1,90,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2498487" నుండి వెలికితీశారు