నిత్య కళ్యాణం పచ్చ తోరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==కథ==
డాక్టర్ ప్రకాశ్‌రావు(గుమ్మడి) అగ్రకులస్తుడు. మరో డాక్టరు సుశీల (సంధ్య)ను మతాంతర వివాహం చేసుకుంటాడు. అతని బావ శేషాద్రిశాస్త్రి (సిఎస్‌ఆర్) శుద్ధశోత్రియుడు. చెల్లెలు శాంత (హేమలత) పేరుకు తగిన ఇల్లాలు. బావమరిదిని ఇంటికి రానీయని శేషాద్రికి జడిసిన శాంత, తాను 7వ నెల గర్భిణియని, అంతకుముందు కాన్పులు పోవటంచేత అన్నగారివద్ద మందులు వాడతానని ఉత్తరం వ్రాస్తుంది. దానికి జవాబుగా మందులతో శాంత ఇంటికి వచ్చిన ప్రకాశరావును, భార్య సంధ్యను శేషాద్రి ఇంటినుంచి పంపివేసి, మరో ఊరిలోవున్న తన చెల్లెలు గంగారత్నం (సూర్యకాంతం), బావ సోమయాజులు (రమణారెడ్డి)ని ఇంటికి రప్పిస్తాడు. శాంతమ్మకు మగ పిల్లవాడు పుట్టడం, అదే సమయానికి హరిజనుడు నాగన్న (వైవి రాజు) భార్య ఒక పిల్లవాడిని కని మరణించగా, ప్రకాశరావు ఆ బాబును ఇంటికి తెచ్చి శాంత బిడ్డతోపాటు ఆ బాబుకు పాలిచ్చి పెంచమంటాడు. మంచిమనసుతో శాంతమ్మ అందుకు అంగీకరిస్తుంది. మగపిల్లవాడు కలిగాడని ఆనందంతో శేషాద్రి వచ్చి శాంత ప్రక్కనగల బిడ్డడిని తన కొడుకేనని తమ ఊరు తీసుకొస్తాడు. ఆ బాబుకు జ్వరం రావటంతో శాంతమ్మను పిలిపించటం, శాంతమ్మ తానక్కడ ఉండాలంటే మరో అనాధ బాలుడు ఇక్కడ పెరగాలని భర్తను కోరటంతో, శేషాద్రి కొడుకుని వాడు రంగాగా, నాగన్న కొడుకు రామూగా ఆ ఇంటిలో పెరిగి పెద్దవారవుతారు. ప్రకాశరావు దంపతులకు ఓ ఆడపిల్ల షీలా పుట్టడం, శేషాద్రి బంధువు శంకరం (అల్లు రామలింగయ్య) ఓ వర్ణాంతర వివాహం చేసికొని, ఓ ఆడపిల్లను కని మరణించటంతో పిచ్చివాడుగా తిరుగుతుంటాడు. ఆ పిల్ల చాంద్ పేరుతో ఓ దాదా (కెవిఎస్ శర్మ) వద్ద పెరుగుతుంది. అందరూ యుక్త వయస్కులయ్యాక షీలా (రాజశ్రీ), రామూ (రామకృష్ణ); రంగా (చలం), చాంద్ (కృష్ణకుమారి) పరస్పరం ప్రేమించుకోవటం, తన కొడుకు అని శేషాద్రి భావిస్తున్న రామూ, షీలాల వివాహం ఆపాలని శేషాద్రి పట్నం ప్రకాశరావు ఇంటికి వెళ్లటం, చాంద్ ముస్లిం యువతి రంగాతో వివాహం జరగరాదని పేకేటి బృందం అడ్డుపడడం, చివరికి శేషాద్రికి నిజం తెలిసి, రామూ, రంగా ఇద్దరూ తన బిడ్డలేనని అంగీకరించి వారి వివాహాలు ప్రకాశరావు నిర్మించిన నిత్యకల్యాణం పచ్చతోరణం కల్యాణ మండపంలో జరగటంతో చిత్రం ముగుస్తుంది<ref>{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 నిత్య కల్యాణం -పచ్చతోరణం |url=http://www.andhrabhoomi.net/content/flashback50-34 |accessdate=29 November 2018 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=24 November 2018}}</ref>.
 
==పాటలు==