బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
సినిమాలకి వచ్చిన తర్వాత కూడా రాజరత్నం పది, పన్నెండు ప్రయివేట్‌ గీతాలు గ్రామ్‌ఫోన్‌కి పాడింది. సినిమాలకి నిదానంగా ప్లేబాక్‌ విధానం వస్తోంది. [[వందేమాతరం (1939 సినిమా)|వందేమాతరం(1939)]]లో నాగయ్య, కాంచనమాల పాడిన పాటలు ముందే రికార్డు చేసి, ప్లేబాక్‌ పద్ధతిలో చిత్రీకరించారు. ప్లేబాక్‌ కాకపోయినా, కృష్ణ అనే అబ్బాయికి సాబూ పాడాడు. ఒకరికి ఇంకొకరు పాడడం ఇలా మొదలైనా, ఈ పాట ముందుగా రికార్డు చెయ్యలేదు. వేరొకరిచేత ముందుగా పాడించి, రికార్డు చేసి ప్లేబాక్‌ చేసి చిత్రీకరించినది- [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్లీ పెళ్లి]]లో హీరో వై.వి.రావుకి ఆ చిత్రం సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు పాడారు. ఆ లెక్కలో ఓగిరాల మొదటి నేపథ్య గాయకుడు.
 
1942లో1943లో వాహిని వారి [[భక్త పోతన (1942 సినిమా)|భక్తపోతన]] విడుదలైంది. ఈ సినిమాలో రాజనర్తకి సామ్రాజ్యానికి 'ప్లే బాక్‌' పాడినది - బెజవాడ రాజరత్నం. ఈ విధంగా తెలుగు సినిమాల్లోని మొదటి [[నేపథ్య గాయని]]గా రాజరత్నం చరిత్రకెక్కింది. 1943లో వచ్చిన [[భాగ్యలక్ష్మి (1943 సినిమా)|భాగ్యలక్ష్మి]]లో [[రావు బాలసరస్వతీ దేవి]] 'తిన్నెమీద సిన్నోడ' పాడారు- [[కమలా కోట్నీస్‌]]కి. '[[భక్తపోతన]]' రికార్డు మీద రాజరత్నం పేరుంది. [[ఇది మంచి సమయము రారా (పాట)|ఇది మంచి సమయము రారా]] అన్నది ఆ పాట. అదేకాదు- పోతన సినిమాలో నాగయ్య, మాలతి, నాళం వనజాగుప్త- 'మానవసేవే- మాధవసేవా' పాట పాడారు; కాని, గ్రామ్‌ఫోన్‌ రికార్డులో బెజవాడ రాజరత్నం - [[మాలతి]] పాడిన చరణాలు పాడింది. నాగయ్య, వనజాగుప్తలు మళ్లీ పాడారు. ఇదొక విశేషం.
 
రాజరత్నం [[తమిళం]]లో కూడా నటించి, పాటలు పాడింది. '[[మోహిని]]' అనే చిత్రంలో నాయిక మాధురికి ప్లేబాక్‌ పాడిందామె. [[జెమిని]] వారి [[జీవన్ముక్తి]] (1942)లో రాజరత్నం నటించి, పాడింది. ఆమె, సూరిబాబు కలిసి పాడిన 'జోడుకొంటారా బాబూ, జోడుకొంటారా' పాట అప్పట్లో ప్రజల నోట వినిపించేది. ఘంటసాల బలరామయ్య తీసిన [[ముగ్గురు మరాఠీలు]] (1946) రాజరత్నం చిన్నపాత్ర ధరించి రెండు పాటలు పాడింది. అయితే ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించలేదు; ఎక్కువ నేపథ్య గీతాలూ పాడలేదు. మంచి కంఠంతో, హాయిగా పాటలు పాడేది గనక, పాటలున్న పాత్రలుంటే ఆమె చేత నటింపజేసి పాడించేవారు. ఆమె పాడిన పాటలన్నీ పాపులర్‌ అయినాయి.
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_రాజారత్నం" నుండి వెలికితీశారు