తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 177:
<big>'''రోడ్డు రవాణా'''</big>: దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా ఉత్తర-దక్షిణంగా వెళ్ళుచున్నది. పూనా-విజయవాడలను కలిపే 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాల మీదుగా పోతుంది. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళే జాతీయ రహదారి 16వ (కొత్త నంబరు 63) నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాల మీదుగా వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి భూపాలపట్నం వెళ్ళు జాతీయ రహదారి హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వెళ్తుంది.
 
== తెలంగాణ రాజకీయాలు ==
''[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)]]'' ''చూడండి''[[బొమ్మ:K chandrashekar rao.jpg‎|right|thumb|150px|<center>తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు మరియు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు</center>]]
[[1948]] వరకు ఈ ప్రాంతం హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉండుటచే ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేకుండేది. [[తెలంగాణ విమోచనోద్యమం|హైదరాబాదు రాజ్య విమోచనం]] అనంతరం 1952లో తొలిసారిగా ఈ ప్రాంతంలో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు మరియు తొలి లోకసభకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేవి. తొలి లోకసభ ఎన్నికలలో కమ్యూనిస్టు నాయకుడు [[రావి నారాయణరెడ్డి]] దేశంలోనే అత్యధిక మెజారిటితో విజయం సాధించారు. [[హైదరాబాదు]] శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లభించడంతో [[బూర్గుల రామకృష్ణారావు]] ముఖ్యమంత్రి పదవి పొందినారు. [[1956]] [[నవంబరు]]లో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. 1969లో [[తెలంగాణ ఉద్యమం]] తలెత్తింది. 1971 లోకసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ 11 స్థానాలకు గాను పదింటిలో విజయం సాధించింది.<ref>{{cite web|author=S. Nagesh Kumar |url=http://www.thehindu.com/opinion/op-ed/article1018827.ece |title=One people, many aspirations |publisher=The Hindu |date=2010-12-30 |accessdate=2013-07-20}}</ref> 1971-73 కాలంలో [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన [[పి.వి.నరసింహారావు]] ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందినారు. 11 నెలల రాష్ట్రపతి పాలన అనంతరం 1973 డిసెంబరు నుంచి 1978 మార్చి వరకు ఖమ్మం జిల్లాకు చెందిన [[జలగం వెంగళరావు]] ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. [[రంగారెడ్డి జిల్లా]]కు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజాసమితి పార్టీ నాయకుడైన [[మర్రి చెన్నారెడ్డి]] కాంగ్రెస్ పార్టీలో చేరి [[1978]] మార్చి నుంచి [[1980]] అక్టోబరు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. ఆ తర్వాత [[1980]] [[అక్టోబరు]] నుంచి [[మెదక్ జిల్లా]]కు చెందిన [[టంగుటూరి అంజయ్య]] ముఖ్యమంత్రి పదవి పొంది [[1982]] ఫిబ్రవరి వరకు పనిచేశారు. 1982లో [[ఎన్టీ రామారావు]] [[తెలుగుదేశం పార్టీ]] స్థాపించడంతో [[1983]] ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లభించింది. 1989 డిసెంబరు నుంచి 1990 డిసెంబరు వరకు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందినవారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందలేరు. 2011లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన పిదప [[దామోదర రాజనర్సింహ]]కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. 2001 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటు చేసిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ వల్ల తెలంగాణ రాజకీయంగా చాలా మార్పులను లోనైంది. 2004 లోకసభ ఎన్నికలలో [[తెరాస]] కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 26 శాసనసభ స్థానాలు, 5 లోకసభ స్థానాలలో విజయం సాధించింది. 2009 లోకసభ ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]] 12, [[తెలుగుదేశం పార్టీ]] 2, [[తెరాస]] 2, ఎంఐఎం 1 స్థానాలలో విజయం సాధించాయి. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ ప్రాంతంలోని 119 స్థానాలలో [[కాంగ్రెస్ పార్టీ]] మెజారిటీ స్థానాలు పొందినది. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే [[తెలంగాణ ఎన్నికలల్లో మహిళలు]] కూడా పోటిచేసి, విజం సాధించారు.<ref>https://www.bbc.com/telugu/india-46107080</ref> 2014 శాసనసభ ఎన్నికలలో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] మెజారిటీ స్థానాలు సాధించి తెలంగాణ రాష్ట్రపు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. [[తెరాస]] అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు [[2014]] [[జూన్ 2]]న [[తెలంగాణ]] తొలి [[ముఖ్యమంత్రి]]గా పదవి చేపట్టారు.
 
==తెలంగాణ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు