ఖిలావరంగల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 109:
 
== స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం ==
ఓరుగల్లు కోటలోని మహత్తర కట్టడాలలో స్వయంభూదేవాలయం ఒకటి. క్రీ.శ. 1162లో గణపతిదేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. భూభాగం నుంచి పుష్పాకారం, పైకప్పు నక్షత్ర ఆకారం పోలినట్లు రాతితో నిర్మించబడింది ఈ ఆలయం. గర్భగుడిలోని శివలింగం ఇతర దేవాలయాల్లోని శివలింగాల కన్నాకన్న భిన్నంగా ఉంటుంది. ఖండములై పడివున్న చతుర్ముఖలింగము ఈ ఆలయములో మూలవిరాట్. ఇది భూమికి అతితక్కువ ఎత్తులో ఉండి పాణమట్టం గుడ్రంగా ఉంటుంది.
దక్షణ ద్వారం వద్ద గల వీరభద్రస్వామి విగ్రహం ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయంలో ఓ పక్క శ్రీ సీతారామలక్ష్మణ మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఏటా శివరాత్రి మహోత్సవం సందర్భంగా నగరం నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి ప్రత్యేక పూజులు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం, అర్చనలు, కర్పూరహరతులు జరుగుతాయి. శ్రీ రామనవమి రోజు సీతారాముల కల్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఖిలావరంగల్" నుండి వెలికితీశారు