పెంటపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
}}
{{ఇతరప్రాంతాలు}}
'''పెంటపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము. '''పెంటపాడు''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[తాడేపల్లిగూడెం]] నుండి 2 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3631 ఇళ్లతో, 12889 జనాభాతో 363 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6377, ఆడవారి సంఖ్య 6512. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1944 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 53. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588496<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534166. పిన్ కోడ్ నం. 534 166., యస్.టీ.డ్.కోడ్ = 08818.
*ఈ గ్రామానికి చెందిన, రాష్ట్ర ఉత్తమ రైతు పురస్కార గ్రహీత శ్రీ నల్లమిల్లి రాఘవరెడ్డి పెరట్లో 45 కిలోల బూడిద గుమ్మడి కాయ కాసింది. ఈ గుమ్మడి పాదును ఈయన సేంద్రియ ఎరువులతోనే సంరక్షించారు.
ఈయన సేంద్రియ ఎరువులతోనే సంరక్షించారు. [1]
== చరిత్ర ==
=== క్విట్ ఇండియా ఉద్యమం ===
1942 ఆగస్టు నెలలో [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో భాగంగా పెంటపాడు గ్రామంలోని పోస్టాఫీసు మీద, టెలిగ్రాఫ్ స్తంభాల మీద ఆంగ్ల వలస పాలనకు నిరసనగా దాడిచేసి స్థానిక స్వాతంత్ర సమర యోధులు జాతీయ స్థాయి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. గాంధీజీ అరెస్టు వార్త తెలిసినాకా ఆగస్టు 15 నుంచి ఎస్‌టివిఎన్ హిందూ పాఠశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు, కొద్దిరోజుల్లోనే సమీపంలోని భీమవరంలో ఉద్యమకారులపై కాల్పుల దుర్ఘటన జరిగిందని తెలిసిన విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్థానిక [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] నాయకుడు సత్యనారాయణరెడ్డి విద్యార్థులను సమావేశపరిచి ప్రసంగిస్తూ [[ముంబై|బొంబాయి]]లో జాతీయ నాయకులను అరెస్టుచేయడం, [[భీమవరం]]లో ప్రజలపై కాల్పులు జరపడం వంటివి చెప్పి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసి వారికి గుణపాఠం నేర్పాలని సూచించాడు. సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో 300 మంది విద్యార్థులు ఊరేగింపుగా వెళ్ళి ముందు పీడబ్ల్యుడి ఆఫీసు మీద, పోస్టాఫీసు మీద దాడిచేశారు. తాళం వేసివున్న పోస్టాఫీసును బద్దలుకొట్టి లోపలి వస్తువులు నాశనం చేసి, రికార్డులు తగలబెట్టారు. పిడబ్ల్యుడి అధికారి, పోస్టు మాస్టరుల ఫిర్యాదుమేరకు బి.సత్యనారాయణరెడ్డి, ఎం.దుర్గాప్రసాద్, సారంగపాణి, పాషా సాహెబ్, వరదా బ్రహ్మానందం, [[ప్రత్తి శేషయ్య]], తాడేపల్లి ముసలయ్య వంటి 12 మంది యువకులను అరెస్టు చేశారు.<ref name="QUIT INDIA MOVEMENT IN COASTAL ANDHRA">{{cite book|last1=సిహెచ్. ఎం.|first1=నాయుడు|title=MAHATMA GANDHI'S LEADERSHIP AND QUIT INDIA MOVEMENT IN COASTAL ANDHRA|date=1996|publisher=ఆంధ్ర విశ్వవిద్యాలయం|location=విశాఖపట్టణం|url=https://archive.org/stream/in.ernet.dli.2015.220104/2015.220104.Mahatma-Gandhis_djvu.txt|accessdate=17 April 2018}}</ref> కొవ్వూరు మేజిస్ట్రేటు ముందు కోర్టులో సత్యనారాయణరెడ్డి ప్రసంగిస్తూ, "ఈ ఘటనకు తనదే పూర్తి బాధ్యత అనీ, విద్యార్థులను రెచ్చగొట్టింది తానేననీ వారిని విడిచిపెట్టి తనకు ఏ శిక్ష అర్హమని తోస్తే దానిని విధించమనీ" పేర్కొన్నారు "ఇలా చేయడంపై తానేమీ విచారం వ్యక్తం చేయట్లేదని, ఇది తన విధిగా భావిస్తున్నానీ" అన్నాడు.<ref name="గాదం గోపాలస్వామి">{{cite book|author=గాదం గోపాలస్వామి|authorlink=గాదం గోపాలస్వామి|title=భారత స్వాతంత్ర్యోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు|date=30 August 2016|publisher=శ్రీ సత్య పబ్లికేషన్స్|location=అత్తిలి|edition=మొదటి|language=తెలుగు}}</ref> 11 మంది విద్యార్థులకు కొరడా దెబ్బల శిక్షను విధిస్తూ, సత్యనారాయణరెడ్డికి 25 కొరడా దెబ్బలతో పాటుగా రెండేళ్ళ కారాగార శిక్ష కూడా విధించారు. దాడిలో పోస్టాఫీసు వద్ద జరిగిన ఆస్తినష్టం రూ.1030 కాగా పెంటపాడు గ్రామంపైన జడ్జి రూ.3 వేలు సామూహిక జరిమానా విధించాడు, ఇందులోంచి ముస్లిములను బలహీనవర్గాలుగా పేర్కొంటూ విడిచిపెట్టాడు.<ref name="QUIT INDIA MOVEMENT IN COASTAL ANDHRA" />
 
 
'''పెంటపాడు''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[తాడేపల్లిగూడెం]] నుండి 2 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3631 ఇళ్లతో, 12889 జనాభాతో 363 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6377, ఆడవారి సంఖ్య 6512. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1944 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 53. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588496<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534166.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల [[ప్రత్తిపాడు]]లో ఉంది. మేనేజిమెంటు కళాశాల ప్రత్తిపాడులోనూ ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/పెంటపాడు" నుండి వెలికితీశారు