"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

[[2004]] ఎన్నికలలో [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి గెలుపొందాడు.<ref name="autogenerated2">http://164.100.47.134/newls/Biography.aspx?mpsno=4083</ref>. ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. ఈ సందర్భంగా తెరాస నాయకులుగా కేసీఆర్, [[ఆలె నరేంద్ర]] కేంద్ర మంత్రులయ్యారు.<ref>{{cite web|title=Politics of separation|url=http://www.frontline.in/static/html/fl2215/stories/20050729003303700.htm|work=Frontline|accessdate=24 February 2014}}</ref> [[2004]] నుండి [[2006]] వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేసి, యూపీఏ నుంచి బయటకు వచ్చాడు.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/Telangana-isn-t-scary/H1-Article1-485141.aspx|title=Telangana isn’t scary|work=hindustantimes.com|publisher=Hindustan Times|date=10 December 2009|accessdate=2011-06-30}}</ref> ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన [[టి.జీవన్ రెడ్డి]]పై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. [[2008]]లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /> ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.
 
==== నిరాహార దీక్ష, పోరాటం, రాష్ట్ర సాధన ====
2009 నవంబరు 29న కేసీఆర్ ఖమ్మం పట్టణంలో తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు. <ref name="దీక్ష గురించి ఆంధ్రజ్యోతిలో">{{cite news |title=ఆ దీక్షకు ఎనిమిదేళ్లు.. |url=http://www.andhrajyothy.com/artical?SID=498868 |accessdate=6 December 2018 |work=www.andhrajyothy.com |date=29 November 2017 |language=te}}</ref>
 
=== తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం (2014-2018) ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2506964" నుండి వెలికితీశారు