గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే '''"గ్రామ పంచాయితీ"'''. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. పంచాయితీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(బి) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలన సంస్థ. పంచాయితీ ఏరియా అంటే ఒక పంచాయితీ ప్రాదేశిక ప్రాంతం. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ వుంటుంది. స్థానిక స్వపరిపాలన విధానములో ఇదే మొదటి మెట్టు.
 
 
=='''గ్రామ పంచాయితీ చరిత్ర'''==
 
గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు. ఆయన దృష్టిలో ప్రతి గ్రామ పంచాయితీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామ పంచాయితీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, 1959 నవంబరు 1న, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా మహబూబ్ నగర్ జిల్లా, షాద్‌నగర్ లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ గా ఏర్పడింది.
 
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలు 1964లో రూపొందించిన చట్టాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి. చట్టరీత్యా కమీషనర్ అనే అధికారి (జిల్లా కలెక్టర్) ఒక రెవెన్యూ గ్రామం లేదా దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయితీగా సృష్టించవచ్చు. [[పంచాయతీ|పంచాయితీ రాజ్]] లో గ్రామ స్థాయి పరిపాలనా వ్యవస్థ '''గ్రామ పంచాయితీ''' <ref>[http://www.apard.gov.in/grampanchayat-handbook.pdf గ్రామ పంచాయతి కరదీపిక]</ref><ref>[http://www.apard.gov.in/finalgramapanchayat.pdf గ్రామ పంచాయతి సమాచార దర్శిని]</ref>.పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పరిపాలన సాగించే విభాగమే గ్రామ పంచాయితీ. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ వుంటుంది. నూతన పంచాయతీ వ్యవస్థ చట్టం ప్రకారం మూడంచెల విధానం అమల్లో ఉంది.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు