పరిటాల శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అనంతపురం జిల్లా రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
== బాల్యం ==
పరిటాల శ్రీరాములు 1935, ఏప్రిల్ 2 న అనంతపురం జిల్లా, వెంకటాపురం గ్రామంలో జన్మించాడు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామమిది. తండ్రి పరిటాల ముత్యాలప్ప ఆ గ్రామంలోకెల్లా పెద్ద భూస్వామి. స్వగ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కలిపి ఆయనకు 150 ఎకరాలకిపైగా భూమి ఉండేది. ఈయన భూస్వామి అయినా పెద్ద దర్పాలకు పోకుండా సాధారణ జీవితం గడిపేవాడు. రామాయణ, మహాభారతాలను నిత్యం పారాయణం చేసేవాడు. ముత్యాలప్ప మొదటి భార్యకు సంతానం లేదు. రెండవ భార్య ఒక కుమార్తెను కని చనిపోయింది. ఈమె పేరు అశ్వత్థమ్మ. మూడవ భార్య చినవెంకటమ్మ. ఈమెకు ఆరుగురు సంతానం. పెద్ద కుమారుడు శ్రీరాములు, రెండో కొడుకు పి. ఎం. నారాయణ, మూడోది గజ్జెలప్ప, నాలుగో వాడు సుబ్బయ్య, అయిదోవాడు చిననారాయణ, ఆఖరున కుమార్తె నారాయణమ్మ. శ్రీరామ నవమి రోజు పుట్టిన తమ పెద్దకొడుకుకి శ్రీరాములు అని పేరు పెట్టుకున్నారా దంపతులు.
 
శ్రీరాములు చదువుకుంటూనే వ్యవసాయం చేసేవాడు. విద్యార్థి దశ నుంచీ సాహిత్యం మీద, రాజకీయాల ముఖ్యంగా వాటిలోని ప్రగతిశీల భావజాలం మీద ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాచీన సాహిత్యంలోనూ ఆసక్తి ఉండేది. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పరిటాల_శ్రీరాములు" నుండి వెలికితీశారు