శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, రేకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
'''రేకుర్తి [[లక్ష్మీనరసింహస్వామి]] ఆలయం''' [[కరీంనగర్ జిల్లా]], [[కొత్తపల్లి (హవేలి)]] మండలం [[రేకుర్తి]] గ్రామంలోని పురాతన గుట్టలపై ఉన్న ఆలయం. నాలుగువందల ఏళ్ళ చరిత్ర కలిగివున్న ఈ ఆలయానికి [[భారతదేశం]]లోనే [[సుదర్శన చక్రం]] స్వయంభువుగా వెలసిన ఏకైక ఆలయంగా పేరుంది.<ref name="స్వయంభువు సుదర్శన చక్రధారి..రేకుర్తి లక్ష్మీ నరసింహుడు!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ (ఆదివారం సంచిక)|title=స్వయంభువు సుదర్శన చక్రధారి..రేకుర్తి లక్ష్మీ నరసింహుడు!|url=https://www.ntnews.com/Sunday/స్వయంభువు-సుదర్శన-చక్రధారి-రేకుర్తి-లక్ష్మీ-నరసింహుడు-10-9-478815.aspx|accessdate=24 February 2018|publisher=గుర్రం నితిన్ గౌడ్|date=7 January 2018}}</ref> ప్రపంచంలో స్వయంభువుగా సుదర్శన చక్రంతో వెలిసిన లక్ష్మీనృసింహస్వామి ఆలయాలు రెండు ఉండగా, అందులో ఒకటి ఈ రేకుర్తి ఆలయం.
[[దస్త్రం:Rekurti Lakshmi Narasimha Swamy.jpg|thumb|right|రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి]]
 
== స్థల విశిష్టత ==
400 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామం అప్పట్లో రేణుగా పట్టణంగా పిలువబడేది. ఈ సంస్థానాన్ని అల్లం రాజు పాలించేవాడు. అల్లం రాజు ఈ గుట్టపై ప్రత్యేకంగా స్థావరం ఏర్పాటు చేసుకోవడమేకాకుండా సైన్యం కోసం ప్రత్యేక స్థావరాలు ఏర్పాటుచేయించాడు. తర్వాతి కాలంలో రేణుగా పట్టణం కాస్త దేవకుర్తిగా, తదనంతరం రేకుర్తిగా మారిందని చరిత్రకారులు చెప్తున్నారు. అప్పట్లో ఈ ప్రాంతం రేణుగా సంస్థానంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడున్న గుహల్లో పూర్వకాలంలో మునులు ధ్యానం చేసేవారని తెలుస్తుంది. ఆ కాలంలోనే ఇక్కడ స్వయంభువుగా లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి వెలిశాడు. ఈ గుట్ట సమీపంలోవున్న బొమ్మలమ్మ గుట్ట దగ్గర కురిక్యాల శాసనం ఇక్కడే లిఖించబడింది. కురిక్యాల శాసనాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకులు రేకుర్తి నరసింహుడిని దర్శించుకోవడం సాంప్రదాయంగా మారింది. దీంతోపాటు మునులు అభిషేకం చేసుకునేందుకు కోనేరు నీటిని కింద ఒక బావిలో ఉన్న నీటిని వాడేవారట. గుట్టపై లక్ష్మీ నరసింహుడు వెలసిన నాటి నుంచి నేటివరకు గుట్టపై ఉన్న కోనేరులో నీరు ఎండిపోలేదు. ఇది ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.