"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (+{{Authority control}})
'''ప్రణబ్ కుమార్ ముఖర్జీ''' (జ. 1935 డిసెంబరు 11) [[భారత దేశము|భారతదేశ]] రాజకీయ నాయకుడు. అతను [[భారత దేశము|భారతదేశానికి]] 2012 నుండి 2017 వరకు [[భారత రాష్ట్రపతులు - జాబితా|13వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]<nowiki/>గా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను [[భారత జాతీయ కాంగ్రెస్]]లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/india/in-coalition-govts-its-difficult-to-reconcile-regional-with-national-interests-pranab-mukherjee/articleshow/61139336.cms|title=In coalition govts, it's difficult to reconcile regional with national interests: Pranab Mukherjee}}</ref> రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటూంటాయి.
 
1969లో జరిగిన [[కాంగ్రెసు|కాంగ్రెస్]] సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున [[రాజ్యసభ సభ్యులు|రాజ్యసభ సభ్యుడ]]<nowiki/>య్యే అవకాశం కల్పించింది. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]]<nowiki/>కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలో స్థానం పొందాడు. 1976 -77–77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితిలో జరిగిన దురాగతాల విషయంలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]]<nowiki/>లోను మిగతా కాంగ్రెసు నాయకుల వలెనే అతను కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అనేక మంత్రి స్థాయి పదవులు నిర్వర్తించిన ముఖర్జీ సేవలు 1982-841982–84 లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పనిచెయ్యడంతోముగిసాయి. 1980-851980–85 లో రాజ్యసభ నాయకునిగా పనిచేసాడు.
 
 
 
1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్‌ [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినా [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌ గాంధీ]] హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో [[ఇందిరా గాంధీ హత్య]] తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌గాంధీ]]<nowiki/>తో రాజీ కుదరడంతో తన పార్టీని [[కాంగ్రెసు|కాంగ్రెస్‌]]<nowiki/>లో విలీనం చేశాడు. 1991లో [[రాజీవ్ గాంధీ హత్య]] జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రణబ్‌ను నియమించిన [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ అప్పటి నుంచీ కేబినెట్‌లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. [[సోనియా గాంధీ|సోనియా]] రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు.
 
== జీవిత విశేషాలు ==
ప్రణబ్ ముఖర్జీ [[డిసెంబర్ 11|డిసెంబరు 11]], [[1935]]<nowiki/>న [[పశ్చిమ బెంగాల్]] లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.<ref>{{cite news|url=http://www.hindustantimes.com/india-news/protocol-to-keep-president-pranab-off-puja-customs/article1-943150.aspx|title=Protocol to keep President Pranab off Puja customs|date=11 October 2011|work=Hindustan Times|accessdate=12 July 2012}}</ref> అతని తండ్రి కమద కింకర ముఖర్జీ [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్యోద్యమం]]<nowiki/>లో క్రియాశీల సభ్యుడు. అతని తండ్రి 1952 నుండి 1964 వరకు [[పశ్చిమ బెంగాల్]] లెజిస్లేటివ్ కౌన్సిల్ లో [[భారత జాతీయ కాంగ్రెస్]] తరపున సభ్యునిగా, ఎ. ఐ. సి. సి సభ్యునిగా ఉన్నాడు. అతని తల్లి రాజ్యలక్ష్మీ ముఖర్జీ .<ref name="NDTV">{{cite web|url=http://www.ndtv.com/article/people/who-is-pranab-mukherjee-231318|title=Who is Pranab Mukherjee?|date=15 June 2012|accessdate=11 July 2012|publisher=NDTV}}</ref><ref name="PMI">{{cite web|url=http://www.pranabmukherjee.in/|title=Biography|accessdate=11 July 2012|publisher=Pranab Mukherjee|archiveurl=https://web.archive.org/web/20100904170154/http://www.pranabmukherjee.in/|archivedate=4 September 2010}}</ref><ref name="europe.eu">{{cite web|url=http://www.feps-europe.eu/assets/5351e32e-1422-4ba2-b339-2dea6d38ddb1/2012%2007%2025%20pranab%20mukherjee%20-%2013th%20president%20of%20india%20-%20kv.pdf|title=About Pranab Mukherjee|date=22 June 2012|accessdate=11 July 2012|publisher=Europe.eu}}</ref>
 
 
 
అప్పటి కాలంలో [[కలకత్తా విశ్వవిద్యాలయం|కలకత్తా విశ్వవిద్యాలయా]]<nowiki/>నికి అనుబంధంగా ఉన్న సూరి (బిర్భుమ్) లోని సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివాడు. <ref name="GOVT">{{cite web|url=http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4195|title=Shri Pranab Mukherjee|accessdate=11 July 2012|publisher=Government of India|archiveurl=https://web.archive.org/web/20110514145924/http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4195|archivedate=2011-05-14}}</ref> తరువాత [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]], చరిత్రలో ఎం.ఎ. చేసాడు. [[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందాడు.<ref name="PMI" />
 
అతను 1963 లో కలకత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (తపాలా, టెలిగ్రాఫ్) కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యు. డి. సి) ఉద్యోగంలో చేరాడు. తరువాత విద్యానగర్ కళాశాలలో [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]] బోధించే అధ్యాపకునిగా విధులను నిర్వర్తించాడు.<ref name="No_surprises">{{cite web|url=http://www.tehelka.co/story_main53.asp?filename=Ws260612Presidential_polls.asp|title=Tehelka - India's Independent Weekly News Magazine|accessdate=29 June 2015|publisher=}}</ref> అతను రాజకీయాలలోనికి రాక పూర్వం దేషెర్ దక్ పత్రికకు [[విలేఖరి|జర్నలిస్టు]]<nowiki/>గా ఉండేవాడు.<ref name="IE2">{{cite web|url=http://www.indianexpress.com/news/fm-pranabs-first-priority-presenting-budget-0910/464858/0|title=FM Pranab's first priority: Presenting budget 09-10|date=23 May 2009|accessdate=23 May 2009|work=The Indian Express}}</ref>
 
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
1969 లో మిడ్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి [[వి. కె. కృష్ణ మేనన్]]కు ప్రచార బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం ప్రారంభమయింది. అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ]] అతని ప్రతిభను గుర్తించి [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీలో స్థానం కల్పించింది. <ref name="Footsteps of Pranab">{{cite web|url=http://www.mathrubhumi.com/english/story.php?id=125466|title=Footsteps of Pranab|date=29 June 2012|accessdate=11 July 2012|publisher=Mathrubhumi|archiveurl=https://web.archive.org/web/20120711090242/http://www.mathrubhumi.com/english/story.php?id=125466|archivedate=11 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> అతను 1969 లో [[భారత పార్లమెంటు|భారత పార్లెమెంటు]]<nowiki/>లో [[రాజ్యసభ]]<nowiki/>కు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చాడు.<ref name="GOVT" /> గాంధీ కుటుంబ విధేయునిగా అతను తనకు తాను "అన్ని ఋతువులలో మనిషి"గా అభివర్ణించుకున్నాడు. <ref name="Pranab Mukherjee's USP for President: sheer experience">{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-mukherjee-and-the-wealth-of-experience/254613-3.html|title=Pranab Mukherjee's USP for President: sheer experience|date=4 May 2012|accessdate=11 July 2012|work=ibnlive}}</ref> 1973లో తొలిసారిగా [[ఇందిరా గాంధీ]] కేబినెట్ లో పరిశ్రమల అభివృద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం వేగంగా ఎదిగింది. 1975-771975–77 లలో వివాదాస్పద అంతర్గత అత్యవసర పరిస్థితి వచ్చినపుడు అతను కేబినెట్ లో క్రియాశీలకంగా ఉన్నాడు.
 
 
 
"సాంప్రదాయిక పరిపాలన నియమాలు, నిబంధనలను ఉల్లంఘించినందున" అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయనాయకులతో పాటు ముఖర్జీ కూడా అరోపణలు ఎదుర్కొన్నాడు. తరువాత జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కొత్తగా ఏర్పడిన జనతా ప్రభుత్వం ముఖర్జీపై నేరారోపణ చేస్తూ షా కమిషన్ ను నియమించింది. అయితే, 1979లో ఆ కమిషనే తన "అధికార పరిధిని అతిక్రమించిందని" ఆరోపణలు ఎదుర్కొంది. తనపై వచ్చిన ఆరోపణల నుంచి ముఖర్జీ సురక్షితంగా బయటపడ్డాడు. తరువాత 1982 నుండి 1984 మధ్య ఆర్థిక మంత్రిగా తన సేవలనంచించాడు.<ref name="Mitra">{{cite web|url=http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|title=The tallest short man|accessdate=27 February 2010|work=Sumit Mitra|publisher=The Hindustan Times, 26 February 2010|archiveurl=https://web.archive.org/web/20100305062958/http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|archivedate=5 March 2010|deadurl=yes|df=dmy-all}}</ref><ref>[http://www.expressindia.com/ie/daily/20000704/ina04002.html How they buried Shah Commission report, even without an epitaph] Indian Express – 4 July 2000</ref>
[[ఇందిరా గాంధీ హత్య]] తరువాత ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడు. ఇందిర కుమారుడు [[రాజీవ్ గాంధీ]] కంటే రాజకీయాల్లో ముఖర్జీ ఎక్కువ అనుభవం కలిగి ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ పార్టీపై పట్టు సాధించాడు. ముఖర్జీ క్యాబినెట్లో తన స్థానాన్ని కోల్పోయాడు. [[పశ్చిమ బెంగాల్]] ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని నిర్వహించడానికి పంపబడ్డాడు. తనను తాను ఇందిరాగాంధీ వారసుడిగా భావించాడు. పార్టీ లోని రాజీవ్ గాంధీ వ్యతిరేకులతో జట్టు కట్టినందున ముఖర్జీ పార్టీ నుండి బహిష్కృతుడయ్యాడు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /><ref name="zee news">{{cite web|url=http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|title=Pranab Mukherjee – The 13th President of India|date=22 July 2012|accessdate=22 July 2012|publisher=Zee News|archive-url=https://archive.is/20130103112035/http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|dead-url=yes|archive-date=3 January 2013}}</ref>
 
1986లో ముఖర్జీ రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్. ఎస్. సి) ను పశ్చిమ బెంగాల్ లో స్థాపించాడు. మూడు సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీతో జరిపిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరినందున ఆర్.ఎస్.సి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసాడు. ఆర్. ఎస్. సి పార్టీ 1987 ఎన్నికలలో [[పశ్చిమ బెంగాల్|పశ్చిమబెంగాల్]] లో తీవ్ర రూపంలో అవతరించింది.
 
అనేకమంది విశ్లేషకులు, ముఖర్జీకి జనాకర్షణ లేదని అందువలన అతను గొప్ప నాయకుడిగా రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చలేరని ఆరోపించారు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /> తరువాత అతను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు అతను "7 రేస్ కోర్సు రోడ్ ఎప్పుడూ తన గమ్యం కాదు" అని సమాధానమిచ్చాడు<ref name="zee news2">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/i-won-t-be-a-unique-president-pranab-mukherjee_788923.html|title=I won't be a unique President: Pranab Mukherjee|date=24 July 2012|accessdate=9 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20130523125957/http://zeenews.india.com/news/zee-exclusive/i-won-t-be-a-unique-president-pranab-mukherjee_788923.html|archivedate=23 May 2013|deadurl=yes|df=dmy-all}}</ref>.
 
1991లో [[రాజీవ్ గాంధీ హత్య]] తరువాత అతని రాజకీయ జీవితం పునరుద్ధరించబడింది. అప్పటి ప్రధానమంత్రి [[పి.వి.నరసింహరావు|పి.వి.నరసింహారావు]] అతనిని భారత ప్లానింగ్ కమిషన్ కు డిప్యూటీ చైర్మన్ పదవినిచ్చాడు. తరువాత మొదటి సారి [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి. వి. నరసింహారావు]] కేబినెట్ లో 1995 నుండి 1996 వరకు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.<ref name="GOVT" />
 
గాంధీ విధేయుడిగా ముఖర్జీ [[సోనియా గాంధీ]] రాజకీయ ప్రవేశానికి ప్రధాన పాత్ర పోషించాడు. ఆమెకు రాజకీయ గురువుగా బాధ్యతలను చేపట్టాడు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /> అతను 1998-991998–99 లో ఎ.ఐ.సి.సికి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. తరువాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. అతను 2010లో రాజీనామా చేసే వరకు పశ్చిమ బెంగాల్ కు అధ్యక్షునిగా ఉన్నాడు. అతను 1985 లో కూడా ఇదే పదవిని నిర్వహించాడు.<ref name="PMI" />
 
ముఖర్జీ 2004లో లోక్‌సభ నాయకునిగా ఉన్నాడు. <ref name="GOVT" /> అతను [[పశ్చిమ బెంగాల్]] లోని జంగిపూర్ పార్లెమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి 2009 వరకు పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. 2004 లో సోనియా గాంధీ అనూహ్యంగా ప్రధానమంత్రి స్థాయిని తిరస్కరించిన తర్వాత ముఖర్జీని భారతదేశ ప్రధానమంత్రిగా చేస్తారని ఊహాగానాలు జరిగాయి.<ref name="red">{{cite web|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr Singh Sonia's choice?|date=19 May 2004|accessdate=10 August 2012|publisher=Rediff}}</ref> అయితే, సోనియా గాంధీ చివరికి [[మన్మోహన్ సింగ్]]ను ప్రధానమంత్రిగా నియమించింది.<ref name="zee news" />
 
=== రాజకీయ పార్టీలో పాత్ర ===
ప్రణబ్ ముఖర్జీని పార్టీ సామాజిక వర్గాల్లో బాగా గౌరవించారు.<ref>{{cite news|url=http://servihoo.com/Aujourdhui/kinews/afp_details.php?id=140225&CategoryID=74|title=India's new foreign minister Mukherjee: a respected party veteran|date=24 October 2006|accessdate=9 April 2007|agency=Agence France-Presse}}</ref> అతను 1978 జనవరి 27 న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. అదే సంవత్సరం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎ. ఐ. సి. సి) సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో సభ్యునిగా చేరాడు. 1978 లో ఎ.ఐ.సి.సి, కాంగ్రెస్ లలో కోశాధికారిగా పనిచేసాడు.<ref name="PMI" />
 
1984, 1996, 1998 జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో ఎ. ఐ. సి. సి ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమింపబడ్డాడు. [[1999]] [[జూన్ 28]] నుండి 2012 వరకు ఎ. ఐ. సి. సి సెంట్రల్ కోఆర్డినెషన్ కమిటీకి చైర్మన్ బాధ్యతలను నిర్వహించాడు. 2001 డిసెంబరు 12 న అతను సెంట్రల్ ఎన్నికలు కమిటీకి నియమింపబడ్డాడు. 1998 లో అతను ఎ.ఐ.సి.సి జనరల్ సెక్రటరీగా నియమితులయ్యాడు.<ref name="PMI" /> 1997 లో ముఖర్జీ భారత పార్లమెంటరీ సమూహం చే "అత్యుత్తమ పార్లమెంటేరియన్"గా గుర్తింపబడ్డాడు.
 
సోనియా గాంధీ రాజకీయాల్లో చేరడానికి అయిష్టంగా అంగీకరించిన తరువాత, ముఖర్జీ ఆమె సలహాదారులలో ఒకరిగా మారాడు. ఇందిరాగాంధీ ఏయే సమస్యను ఎలా పరిష్కరించేవారో, .ఏ సంక్షోభంలో ఎలా వ్యవహరించేవారో ప్రణబే సోనియాకు చెప్పాడు. అలా సోనియాకు మొట్టమొదటి రాజకీయ గురువుగా వ్యవహరించాడు. అదే సమయంలో పార్టీకీ, సోనియాకూ విధేయంగానూ ఉంటూ వచ్చాడు. <ref>{{cite news|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr. Singh Sonia's choice?|author=GK Gokhale|date=19 April 2004|publisher=[[rediff.com]]|accessdate=9 April 2007}}</ref>కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. 2005 ప్రారంభంలో పేటెంట్ సవరణ బిల్లు కోసం జరిగిన చర్చల సమయంలో అతని ప్రతిభను ప్రదర్శించాడు.
కాంగ్రెస్ పార్టీ IP బిల్లును ఆమోదించడానికి కట్టుబడి ఉంది, కానీ వారి కూటమి [[యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్]] మిత్ర పక్షమైన వామపక్షాలు మేధో సంపద గుత్తాధిపత్య అంశాలను వ్యతిరేకించాయి. ఒక రక్షణ మంత్రిగా ప్రణబ్, ఈ వ్యవహారంలో అధికారికంగా పాల్గొనలేదు కానీ అతని సంధి నైపుణ్యాల ఫలితంగా ఆ బిల్ కదిలించడానికి కృషి చేసాడు. అతను సిపిఐ-ఎం నాయకుడైన [[జ్యోతిబసు]] వంటి వారితో సహా పలు పాత మిత్రపక్షాలతో పొత్తులు కొనసాగించి కొత్త మధ్యవర్తిత్వాన్ని ఏర్పరచాడు. తన సహచరుడైన కమల నాథ్ కు " చట్టం పూర్తిగా లేని దాని కంటే అసంపూర్ణ చట్టం మెరుగైనది" అని చెప్పి ఒప్పించగలిగాడు. <ref>{{cite news|url=http://www.rediff.com/money/2005/mar/29patents.htm|title=Pranab: The master manager|author=[[Aditi Phadnis]]|date=29 March 2005|publisher=rediff.com|accessdate=9 April 2007}}</ref> చివరకు 2005 మార్చి 23 న ఆ బిల్లు ఆమోదించబడింది.
 
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం (123 ఒప్పందం) పై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేసారు. ఈ ఒప్పందం వల్ల దేశానికి ఇంధన భద్రత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విపక్షాలు మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని యూపీఏ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని, దీనివల్ల భవిష్యత్‌లో అణు పరీక్షలు నిర్వహించే హక్కును దేశం కోల్పోతుందని మండిపడ్డాయి. 2008లో మన్మోహన్‌సింగ్‌ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి విశ్వాస తీర్మానంలో విజయం సాధించి యు. పి. ఎ II ప్రభుత్వం రక్షింపబడటానికి ఈ ఒప్పందం దోహదపడింది.<ref name="IT">{{cite web|url=http://indiatoday.intoday.in/story/the-man-indira-trusted/1/116544.html|title=The Man Indira Trusted|date=16 October 2010|accessdate=9 August 2012|publisher=India Today}}</ref>
 
2008-09 లో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బై-పాస్ సర్జరీకి వెళ్లినపుడు ముఖర్జీ లోక్‌సభ ఎన్నికలకు ముందు క్యాబినెట్ ను నడిపించే కీలక పాత్రను పోషించాడు. ఈ సమయంలో అతను రాజకీయ వ్యవహారాలు కేబినెట్ కమిటీకి చైర్మన్ గాను, ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్రమంత్రిగా అదనపు బాధ్యతలను స్వీకరించాడు.
 
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టాడు. అతడు ప్లానింగ్ కమిషనుకు డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడ్డాడు. భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి, డిప్యూటీ చైర్ పర్సన్ స్థానం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 1991-96 మధ్య అతని పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలను లైసెన్సు రాజ్ వ్యవస్థ ముగిసే వరకు చేసాడు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగపరచడానికి దోహదపడింది.<ref name="BBC1">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3725357.stm|title=India's architect of reforms|last=Biswas|first=Soutik|date=14 October 2005|publisher=BBC News|accessdate=11 December 2008}}</ref>[[దస్త్రం:Pranab_Mukherjee_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009.jpg|thumb|2009లో న్యూఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సమ్మేళన్ లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ i]]
2009లో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. అతను 2009. 2010,2011 ల వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టాడు. 2008-09లో 6.5% నుండి 2010-112010–11 బడ్జెట్లో GDP అనుపాతంగా ప్రజా రుణాన్ని తగ్గించటానికి దేశ మొట్టమొదటి స్పష్టమైన లక్ష్యాన్ని చేర్చాడు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో బడ్జెట్ లోటు 4.1 శాతానికి తగ్గించాలని ముఖర్జీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.<ref name="TB" />
 
ముఖర్జీ అనేక పన్ను సంస్కరణలను అమలుచేశాడు. అతను ఫ్రింజ్ బెనిఫిట్స్ టాక్స్, కమోడిటీస్ ట్రాన్సాక్షన్ టాక్సులను రద్దు చేశాడు. అతను తన పదవీకాలంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ పన్నును అమలు చేశాడు. ఈ సంస్కరణలు ప్రధాన కార్పొరేట్ అధికారులు, ఆర్థికవేత్తలచే ప్రసంశలు పొందాయి. ముఖర్జీచే పునరావృత్త పన్నుల పరిచయం జరిగింది అయితే కొందరు ఆర్థికవేత్తలు దీనిని విమర్శించారు.<ref name="DM">{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2165096/Pranab-Mukherjees-stint-Foreign-Minister-clearly-wasnt-best.html?ito=feeds-newsxml|title=Pranab Mukherjee's stint as Finance Minister clearly wasn't his best|last=Bamzai|first=Sandeep|date=26 June 2012|work=Daily Mail|accessdate=13 July 2012|location=London}}</ref>
 
== భారత రాష్ట్రపతి ==
2012 జూన్ 15న ముఖర్జీ అనేక రాజకీయ ఎత్తుగడల తరువాత యు.పి.ఎ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయబడ్డాడు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-nominated-after-mulayamsonia-secret-meet/266362-37-64.html|title=Pranab nominated after Mulayam-Sonia secret meet|accessdate=4 July 2012|last=Prabhu|first=Chawla}}</ref><ref>{{cite web|url=http://in.news.yahoo.com/hunt-begins-for-head-of-state.html|title=Hunt begins for head of state|date=3 January 2012|accessdate=29 June 2015|work=Yahoo News India|archiveurl=https://web.archive.org/web/20141025031731/https://in.news.yahoo.com/hunt-begins-for-head-of-state.html|archivedate=25 October 2014|deadurl=yes|df=dmy-all}}</ref> ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక 2012 జూలై 19 న జరగాలని, ఫలితాలను 2012 జూలై 22 న ప్రకటించాలని ఉంది. 81 మంది ఇతర సభ్యులు ఎన్నికలలో పోటీచేస్తూ నామినేషన్లు వేసారు. కానీ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్. డి. ఎ) ప్రతిపాదిత అభ్యర్థి [[పి.ఎ.సంగ్మా]] నామినేషన్ తప్ప మిగిలినవన్నీ తిరస్కరించబడ్డాయి. <ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report_pranab-mukherjee-sangma-final-candidates-for-prez-polls_1710719|title=Pranab Mukherjee, Sangma final candidates for Prez polls|date=4 July 2012|newspaper=Daily News and Analysis|accessdate=4 July 2012}}</ref> అతను జూన్ 28 న నామినేషన్ వేయడం కోసం జూన్ 2012 జూన్ 26 న తన మంత్రి పదవికి రాజీనామా చేసాడు. <ref name="NDTV2">{{cite web|url=http://www.ndtv.com/article/india/pranab-mukherjee-resigns-as-finance-minister-pm-to-take-additional-charge-say-sources-236331|title=Pranab Mukherjee resigns as Finance Minister; PM to take additional charge, say sources|date=26 June 2012|accessdate=13 July 2012|publisher=NDTV}}</ref> ఎన్నికలలో అతను 713,763 ఓట్లను సాధించగా, సంగ్మాకు 315,987 ఓట్లు వచ్చాయి. <ref>{{cite web|url=http://ibnlive.in.com/news/live-counting-of-votes-begins-for-president-poll/272800-37-64.html|title=CNNIBN Blog|date=22 July 2012|accessdate=22 July 2012}}</ref> ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే అతను తన నివాసం బయట విజయం ప్రసంగం చేసాడు. ఆ ప్రసంగంలో:
 
{{వ్యాఖ్య|వేచి ఉన్న మీ అందరికీ నా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలని అనుకుంటున్నాను. నా ఓట్ల సంఖ్య 7 లక్షలకు దాటింది. ఇంకా ఒక్క రాష్ట్రం మిగిలి ఉంది. తుది ఫలితం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి వెలువడవలసి ఉంది. ఈ అత్యున్నత పదవికి నన్ను ఎన్నుకొన్నందుకు భారత ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల ఉత్సుకత, స్నేహపూర్వక ప్రవర్తన గొప్పవి. నేను పార్లమెంటు నుండి, ఈ దేశ ప్రజల నుండి నేను ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ ఫలితాన్ని పొందాను. దేశ అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని కాపాడటం మరియు రక్షించడం నా బాధ్యత. ప్రజల నమ్మకాన్ని సమర్థించడానికి నేను కృషి చేస్తాను. <ref>{{cite web|url=http://www.ndtv.com/blog/show/pranab-mukherjee-all-set-to-become-the-president-of-india-231924?pfrom=home-otherstories|title=NDTV Blog|accessdate=22 July 2012|date=22 July 2012}}</ref>}}
 
ముఖర్జీ 2012 జూలై 25న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తిచే భారత 13వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసాడు.<ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/article3681618.ece?homepage=true|title=Pranab Mukherjee sworn-in 13th President|last=Gupta|first=Smita|date=25 July 2012|work=The Hindu|location=Chennai, India}}</ref> అతను ఈ పదవి నిర్వహించిన వారిలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి. <ref name="zee news2" />
కాంగ్రెస్ అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]], అప్పటి ప్రధాన మంత్రి [[మన్మోహన్ సింగ్|మన్ మోహన్ సింగ్]]లు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.<ref name="Zee News 3">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|title=PM, Sonia congratulate India's new President Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170043/http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> పూర్వపు కమ్యూనిస్టు నాయకుడు [[సోమనాథ్ ఛటర్జీ]] ముఖర్జీని "భారతదేశ ఉత్తమ పార్లమెంటేరియన్, రాజనీతిజ్ఞుడు"గా కొనియాడి "ఉన్నత పదవిలో అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తి వచ్చాడు" అని తెలిపాడు. <ref name="Zee News 4">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|title=India has got a very able president: Somnath|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170012/http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> ప్రతిపక్ష నేత [[శరద్ యాదవ్]] "దేశానికి ప్రణబ్ ముఖర్జీ లాంటి అధ్యక్షుడు అవసరం." అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 5">{{cite web|url=http://zeenews.india.com/news/nation/india-needs-pranab-as-president-sharad-yadav_789014.html|title=India needs Pranab as president: Sharad Yadav|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> ఢిల్లీ ముఖ్యమంత్రి [[షీలా దీక్షిత్]] ముఖర్జీ "తెలివైన అధ్యక్షుల్లో ఒకరు" అని వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష శ్రేణులలోని పార్టీలు ముఖర్జీకి మద్దతు ఇచ్చాయని ఆమె మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో "ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడిగా ఓటు వేయాలని కోరుకున్నందుకు ఎన్.డి.ఎ విడిపోయింది." <ref name="Zee News 6">{{cite web|url=http://zeenews.india.com/news/nation/pranab-mukherjee-will-be-a-wise-president-dikshit_789008.html|title=Pranab Mukherjee will be a wise president: Dikshit|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>. [[భారతీయ జనతా పార్టీ]] తమ లెజిస్లేటివ్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడాన్ని చూసి షాక్ కు గురైంది<ref name="Zee News 7">{{cite web|url=http://zeenews.india.com/news/nation/prez-poll-bjp-miffed-over-cross-voting_789108.html|title=Prez poll: BJP miffed over cross-voting|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>. అయినప్పటికీ బి.జె.పి అధ్యక్షుడు [[నితిన్ గడ్కరి]] ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపాడు. నితిన్ "భారతదేశపు కొత్త రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రకటించాడు. గట్కారీ "ఈ దేశం మరింత అభివృద్ధి, పురోగతి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను అతనికి విజయం, ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 8">{{cite web|url=http://zeenews.india.com/news/nation/nitin-gadkari-congratulates-pranab-mukherjee_789087.html|title=Nitin Gadkari congratulates Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>
 
జీ న్యూస్ ఈ విధంగా వ్యాఖ్యానించింది: "ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిన తరువాత, అధ్యక్షుడిగా ప్రణబ్ ముఖర్జీని యుపిఎ ఎంపిక చేసి ప్రకటించిన తరువాత ప్రతిపక్షానికి అతనికి వ్యతిరేకించేందుకు ఏ వాదనలూ లేవు". అయినప్పటికీ కొన్ని అవినీతి కేసుల్లో అతను ఉన్నట్లు అన్నా బృందం కోలాహలం చేసింది. ఒకసారి సోనియా గాంధీ అతని పేరును ప్రతిపాదించిన తరువాత, అనేక మిత్ర పక్షాలు, ప్రతిపక్షం ఒక వేదికపైకి వచ్చాయి. ఇక వామపక్షాల్లో కూడా రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. వామపక్షాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనే భావనలో ఉండే సిపిఎంకు సిపిఐ షాకిచ్చింది. ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగా సిపిఐ ససేమిరా అనడంతోపాటు తటస్థంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఎస్‌పి కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎ భాగస్వామిగా వున్నా జె.డి. (యు), శివసేనలు సంగ్మాను కాదని ప్రణబ్‌కే మద్దతు ప్రకటించాయి.<ref name="zee news" />
=== జాతీయ పురస్కారాలు ===
 
* [[దస్త్రం:IND_Padma_Vibhushan_BAR.png|60x60px]]: 2008లో [[పద్మ విభూషణ్ పురస్కారం]] .<ref name="padmavib">{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=30|title=Padma Vibhushan Awardees for year 2008|accessdate=3 April 2012|publisher=india.gov.in}}</ref>
 
=== విదేశీ పురస్కారాలు ===
 
* [[దస్త్రం:Noribbon.svg|60x60px]] : బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ హానర్ ''(బంగ్లాదేశ్ ముక్తిజుద్దో సన్మానోన)'', (5 మార్చి 2013; {{Flag|Bangladesh}})<ref>[http://www.ndtv.com/article/india/pranab-mukherjee-receives-bangladesh-s-second-highest-award-338250 Pranab Mukherjee receives Bangladesh's second highest award]. NDTV.com (2013-03-05). Retrieved on 2014-05-21.</ref>.
* [[దస్త్రం:Cote_d'Ivoire_Ordre_national_GC_ribbon.svg|60x60px]] : గ్రాండ్ క్రాస్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద ఐవరీ కోస్ట్ (జూన్ 2016; {{Flag|Ivory Coast}})<ref name="ivory_coast">{{cite news|url=http://www.dnaindia.com/india/report-president-mukherjee-accorded-with-grand-cross-national-order-of-the-republic-of-cote-d-ivoirie-2224069|title=President Mukherjee accorded with Grand Cross National Order of the Republic of Cote D'Ivoire|date=15 June 2016|publisher=PTI|accessdate=15 June 2016}}</ref>.
 
=== విద్యా గౌరవాలు ===
 
* 2011 లో యునైటెడ్ కింగ్ డం లోని వోల్వర్‌థాంప్టన్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీ .<ref name="Honorary degree Doctorate">{{cite web|url=http://www.thehindubusinessline.com/industry-and-economy/government-and-policy/article2054913.ece|title=Honorary doctorate for Pranab from UK university|date=27 May 2011|accessdate=13 June 2011|work=The Hindu}}</ref>
* 2012 మార్చిలో విశ్వేశ్వరాయ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, అస్సాం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి. లిట్. <ref name="telegraph2">{{cite news|url=http://www.telegraphindia.com/1120716/jsp/frontpage/story_15733694.jsp|title=Small price for big prize|date=15 July 2012|publisher=Telegraph India|accessdate=22 July 2012|location=Calcutta, India}}</ref><ref name="telegraph3">{{cite news|url=http://www.telegraphindia.com/1131002/jsp/frontpage/story_17415409.jsp#.UkwPo6xi2So|title=What doctor ordered but can’t get at home|date=1 October 2013|publisher=Telegraph India|accessdate=2 October 2013|location=Calcutta, India}}</ref>
* 2013 మార్చి 4 న ఢాకా విశ్వవిద్యాలయం వద్ద బంగ్లాదేశ్ అక్ష్యక్షుడు, ఛాన్సలర్ మొహమద్ జిల్లూర్ రహ్మాన్ చే గౌరవ ఎల్. ఎల్. డి. <ref>[http://bdnews24.com/bangladesh/2013/03/04/du-honours-pranab-mukherjee DU honours Pranab Mukherjee]. bdnews24.com (2013-03-04). Retrieved on 2014-05-21.</ref>
* 2013 మార్చి 13 న మారిషస్ విశ్వవిద్యాలయం చే డాక్టర్ ఆఫ్ సివిల్ లా .<ref name="UOM">{{cite web|url=http://www.lemauricien.com/article/uom-%E2%80%94-honneur-president-l%E2%80%99inde-fait-doctor-civil-law-honoris-causa|title=UOM&nbsp;— HONNEUR: Le Président de l’Inde fait Doctor of Civil Law Honoris Causa|date=13 March 2013|accessdate=10 April 2013|publisher=Le Matinal|language=fr|archiveurl=https://web.archive.org/web/20130318031403/http://www.lemauricien.com/article/uom-%E2%80%94-honneur-president-l%E2%80%99inde-fait-doctor-civil-law-honoris-causa|archivedate=18 March 2013|deadurl=yes|df=dmy-all}}</ref>
* 2013 అక్టోబరు 5 న ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ .<ref>{{cite web|url=http://www.sarkaritel.com/the-president-pranab-mukherjee-being-conferred-the-honorary-doctorate-by-the-dean-of-the-faculty-of-political-science-of-istanbul-university/|title=The President, Pranab Mukherjee being conferred the Honorary Doctorate by the Dean of the Faculty of Political Science of Istanbul|accessdate=22 August 2017|website=www.sarkaritel.com|archiveurl=https://web.archive.org/web/20131016024928/http://www.sarkaritel.com/the-president-pranab-mukherjee-being-conferred-the-honorary-doctorate-by-the-dean-of-the-faculty-of-political-science-of-istanbul-university/|archivedate=16 October 2013|deadurl=yes|df=dmy-all}}</ref>
* 2014 నవంబరు 28 న కలకత్తా విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్. <ref>{{cite web|url=http://www.dnaindia.com/india/report-take-forward-government-s-model-village-scheme-president-pranab-mukherjee-tells-universities-2039217|title=Take forward government's model village scheme, President Pranab Mukherjee tells universities - Latest News & Updates at Daily News & Analysis|date=28 November 2014|accessdate=29 June 2017|publisher=}}</ref>
* 2015 అక్టోబరు 11 న జోర్డాన్ విశ్వవిద్యాలయం చే రాజనీతి శాస్త్రంలో గౌరవ డాక్టరేట్. <ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/president-pranab-mukherjee-conferred-honorary-doctorate-by-jordanian-university/articleshow/49314132.cms|title=President Pranab Mukherjee conferred honorary doctorate by Jordanian university|date=11 October 2015|accessdate=29 June 2017|publisher=|last=PTI|first=|via=The Economic Times}}</ref>
* 2015 అక్టోబరు 13న రమల్లా, ఆలెస్తినా లోని ఆల్-క్విడ్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ .<ref>{{cite web|url=http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=128673|title=Al-Quds University confers Hon. Doctorate on President.India's Solidarity with Palestinian people and it's principled support to Palestinian cause is rooted in our own freedom struggle,says President|accessdate=29 June 2017|website=pib.nic.in}}</ref>
* 2015 అక్టొబరు 15 న ఇజ్రాయిల్ లోని జెరుసెలం నకు చెందిన హిబ్రూ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ .<ref>[http://news.niticentral.com/2015/10/16/hebrew-university-confers-honorary-doctorate-on-president-pranab-mukherjee/ NitiCentral] {{webarchive|url=https://web.archive.org/web/20151020014320/http://news.niticentral.com/2015/10/16/hebrew-university-confers-honorary-doctorate-on-president-pranab-mukherjee/|date=20 October 2015}}</ref>
* 2016 నవంబరు 3 న నేపాల్ లోని ఖాట్మాండు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ .<ref>{{cite web|url=http://www.hindustantimes.com/world-news/kathmandu-university-awards-dlitt-to-president-mukherjee/story-d7z8H1lXmCEyZTdC9RkJON.html|title=Kathmandu University awards DLitt to President Mukherjee|date=3 November 2016|accessdate=29 June 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=153240|title=Accept Honorary Doctorate from Kathmandu University in Name of People of India, Writes President|accessdate=29 June 2017|website=pib.nic.in}}</ref>
* 2017 ఏప్రిల్ 25న గోవా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ .<ref>{{cite web|url=https://www.heraldgoa.in/Goa/Prez-worthy-Girls-doing-better-than-boys-in-GU-says-Pranab/114457.html|title=Prez worthy: Girls doing better than boys in GU, says Pranab|accessdate=29 June 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://www.business-standard.com/article/pti-stories/goa-varsity-confers-d-litt-on-president-117042501114_1.html|title=Goa varsity confers D Litt on President|date=25 April 2017|accessdate=29 June 2017|publisher=|last=India|first=Press Trust of|via=Business Standard}}</ref>
* 2017 డిసెంబరు 24 న జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి డి,లిట్ (ఆనర్స్ కాసా) .<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/pranab-advocates-free-thinking-among-students/article22272868.ece</ref><ref>http://www.newindianexpress.com/nation/2017/dec/24/pranab-mukherjee-advocates-free-thinking-among-students-at-jadavpur-university-1736057.html</ref>
* 2018 జనవరి 16న చిట్టగాంగ్ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్. .<ref>http://www.thedailystar.net/country/chittagong-university-cu-confers-d-litt-degree-former-indian-president-pranab-mukherjee-1520728</ref>
 
=== ఇతర గుర్తింపులు ===
 
* ప్రపంచ ఉత్తమ ఆర్థిక మంత్రి (1984; యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వే ఆధారంగా ).<ref name="Baru">{{cite web|url=http://www.business-standard.com/india/storypage.php?autono=386396|title=The Pranab Mukherjee Budget|date=22 February 2010|accessdate=8 August 2010|publisher=Business Standard}}</ref><ref name="CYP">{{cite web|url=http://www.calcuttayellowpages.com/pranadmu.html|title=Shri Pranab Mukherjee|date=22 January 2001|accessdate=23 July 2012|publisher=Calcutta Yellow Pages}}</ref>
* ఫైనాన్స్ మినిష్టర్ ఆఫ్ యియర్ ఆసియా ; ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల మార్కెట్ దిన పత్రిక చే) .<ref name="Asia Award Finance">{{cite news|url=http://www.thehindu.com/business/Economy/article825403.ece|title=Finance Minister of Asia award for Pranab|date=11 October 2010|work=The Hindu|accessdate=13 June 2011|location=Chennai, India}}</ref>
* ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్ (డిసెంబరు 2010; ద బ్యాంకర్ ద్వారా)<ref name="TB">{{cite news|url=http://www.thebanker.com/Awards/Finance-Minister-of-the-Year/Finance-Minister-of-the-Year-2011|title=Finance Minister of the Year 2011|date=23 December 2010|publisher=The Banker|accessdate=23 July 2012}}</ref>.
* 2016, జూన్ 15న అబిడ్జన్, రిపబ్లిక్ ఆఫ్ కోటే డి ' ల్వోరీ దేశ గౌరవ పౌరసత్వం .<ref>{{cite web|url=http://www.hindustantimes.com/india-news/president-pranab-mukherjee-accorded-honorary-citizenship-of-abidjan/story-dcj863ylimfiBsQbunOBUP.html|title=President Pranab Mukherjee accorded honorary citizenship of Abidjan|date=15 June 2016|accessdate=29 June 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://presidentofindia.nic.in/press-release-detail.htm?2267|title=Press Releases Detail - The President of India|website=presidentofindia.nic.in}}</ref>
 
== నిర్వహించిన పదవులు ==
 
* పరిశ్రమల అభివృద్ధి - కేంద్ర మంత్రిగా 1973–1974
* షిప్పింగ్, రవాణా - కేంద్ర మంత్రిగా 1974
* ఆర్థిక శాఖ: రాష్ట్ర మంత్రి 1974–1975
* రెవెన్యూ, బ్యాంకిగ్ : కేంద్ర మంత్రిగా 1975–1977
* కాంగ్రెస్ పార్టీ కోశాదికారి 1978–79
* ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి 1978–79
* రాజ్యసభ నాయకుడు 1980–85
* వాణిజ్య, ఉక్కు, గనుల శాఖ - కేంద్రమంత్రిగా 1980–1982
* ఆర్థిక శాఖ - కేంద్ర మంత్రిగా - 1982–1984
* అంతర్జాతీయ ద్రవ్య నిధి గవర్నర్ల బోర్డు - 1982–1985
* ప్రపంచ బ్యాంకు గవర్నర్ల బోర్డు - 1982–1985
* ఆసియన్ డెవలప్‌మెంటు బ్యాంకు గవర్నర్ల బోర్డు -1982–1984–1982–1984
* ఆఫ్రికన్ డెవలప్‌మెంటు బ్యాంకు గవర్నర్ల బోర్డు - 1982–1985
* వాణిజ్య, సప్లయ్ - కేంద్ర మంత్రిగా 1984
* చైర్మన్: కాంగ్రెస్ ఐ ప్రచార కమిటీ - 1984, 1991,1996, 1998 లలో పార్లమెంటు జాతీయ ఎన్నికలకు.
* గ్రూపు ఆఫ్ 24 కు చైర్మన్ ( ఐ. ఎం. ఎఫ్, ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన మంత్రుల వర్గం) 1984, 2009–2012
* కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగానికి అద్యక్షుడు. 1985,2000–10
* ఎ.ఐ.సి.సి. ఎకానమీ అడ్వయిజరీ సెల్ కు చైర్మన్ 1987–1989
* డిప్యూటీ చైర్మన్ - ప్లానింగ్ కమిషన్ 1991–1996
* వాణిజ్య శాఖ - కేంద్రమంత్రిగా 1993–1995
* విదేశీ వ్యవహారాల శాఖ _ కేంద్ర మంత్రిగా 1995–1996
* సార్క్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కు అధ్యక్షుడు 1995
* ఎ. ఐ. సి. సి జనరల్ సెక్రటరీ 1998–1999
* సెంట్రల్ ఎన్నికలు కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్ - 1999–2012
* లోక్ సభ నాయకునిగా - 2004–2012
* రక్షణ శాఖ - కేంద్రమంత్రిగా 2004–2006
* విదేశీ వ్యవహారాల శాఖ _ కేంద్ర మంత్రిగా 2006–2009
* ఆర్థిక శాఖ: కేంద్ర మంత్రిగా 2009–2012
* భారత రాష్ట్రపతిగా - 2012 జూలై 25 - 2017 జూలై 25.
 
== రచనలు ==
 
* ''మిడ్ టెర్మ్‌ పోల్'' .
* ''బియాండ్ సర్వైవల్ : ఎమర్జింగ్ డైమన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ - 1984''.
* ''ఆఫ్ ద ట్రాక్ - 1987''.
* ''సగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్ - 1992''.
* ''ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ - 1992'' <ref name="IE2" />.
* "ఎ సెంటనరీ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ - వాల్యూం V: 1964-19841964–1984" - 2011.
* "కాంగ్రెస్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషన్ " -2 2011011.
* "థాట్స్ అండ్ రిప్లక్షన్స్ " - 2014.
* ''ద డ్రామాటిక్ డికేడ్: ద ఇందిరా గాంధీ యియర్స్'' - 2014.
* "సెలెక్టెడ్ స్పీచెస్ - ప్రణబ్ ముఖర్జీ " - 2015.
* ''"ద టర్బులెంట్ యియర్స్ : 1980 - 19961980–1996" - 2016''.
* "ద కోలీషన్ యియర్స్ ".
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2513893" నుండి వెలికితీశారు