ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 74:
 
'''ప్రణబ్ కుమార్ ముఖర్జీ''' (జ. 1935 డిసెంబరు 11) [[భారత దేశము|భారతదేశ]] రాజకీయ నాయకుడు. అతను [[భారత దేశము|భారతదేశానికి]] 2012 నుండి 2017 వరకు [[భారత రాష్ట్రపతులు - జాబితా|13వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]<nowiki/>గా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను [[భారత జాతీయ కాంగ్రెస్]]లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/india/in-coalition-govts-its-difficult-to-reconcile-regional-with-national-interests-pranab-mukherjee/articleshow/61139336.cms|title=In coalition govts, it's difficult to reconcile regional with national interests: Pranab Mukherjee}}</ref> రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటూంటాయి.
 
 
 
1969లో జరిగిన [[కాంగ్రెసు|కాంగ్రెస్]] సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున [[రాజ్యసభ సభ్యులు|రాజ్యసభ సభ్యుడ]]<nowiki/>య్యే అవకాశం కల్పించింది. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]]<nowiki/>కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలో స్థానం పొందాడు. 1976 –77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితిలో జరిగిన దురాగతాల విషయంలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]]<nowiki/>లోను మిగతా కాంగ్రెసు నాయకుల వలెనే అతను కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అనేక మంత్రి స్థాయి పదవులు నిర్వర్తించిన ముఖర్జీ సేవలు 1982–84 లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పనిచెయ్యడంతోముగిసాయి. 1980–85 లో రాజ్యసభ నాయకునిగా పనిచేసాడు.
Line 83 ⟶ 85:
అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖకు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో తాను రాజీనామా చేసేవరకు [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్నాడు.
 
అతను అనేక కీలకమైన కేబినెట్ మత్రిత్వ పదవులను చేపట్టాడు. రక్షణ శాఖా మంత్రి (2004–06), విదేశీ వ్యవహారాల మంత్రి (2006–09), ఆర్థిక మంత్రి (2009–12) గా తన సేవలనంచించాడు. అతను లోక్‌సభకు నాయకునిగా కూడా పనిచేసాడు. జూలై [[2012]] న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యు. పి. ఎ) అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అతను రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి వోట్లను పొంది ప్రత్యర్థి [[పి.ఎ.సంగ్మా]]ను ఓడించాడు.
2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మరలా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పైబడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం [[2017]] [[జూలై 25]] న ముగిసింది.<ref>{{cite web|url=http://english.manoramaonline.com/news/columns/national-scrutiny/sharad-pawar-president-candidate-pranab-mukherjee-ncp.html|title=And the next President is...|date=December 27, 2015|website=english.manoramaonline.com/home.html|publisher=Manorama Online|author=Sachidananda Murthy|access-date=28 April 2016}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/politics/presidential-election-2017-pranab-mukherjee-retires-in-july-this-is-how-india-elects-its-president-3418668.html|title=Presidential Election 2017: Pranab Mukherjee retires in July, this is how India elects its president|date=2 May 2017|accessdate=22 August 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/india/presidential-election-2017-not-in-race-for-another-term-says-pranab-mukherjee-3480729.html|title=Presidential Election 2017: Not in race for another term, says Pranab Mukherjee|date=25 May 2017|accessdate=22 August 2017|publisher=}}</ref> అతని తరువాత రాష్ట్రపతిగా [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] ఎన్నికయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు