జ్ఞానపీఠ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Official website
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
}}
 
[[భారత దేశం|భారతదేశపు]] సాహితీ పురస్కారాల్లో '''జ్ఞానపీఠ పురస్కారం''' అత్యున్నతమైనది. దీన్ని [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన [[భారతీయ జ్ఞానపీఠం]] వారు ప్రదానం చేస్తారు. [[వాగ్దేవి]] [[కాంస్య]] ప్రతిమ, పురస్కార పత్రం, ఐదుపదకొండు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. [[1961]]లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా [[1965]]లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. ఐతే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్ళపాటు ఆ భాషాసాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు.
 
[[1982]]కు ముందు, ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. అప్పటినుండి, భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు [[కన్నడ]] రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ రచయితలు ఆరుసార్లు అందుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/జ్ఞానపీఠ_పురస్కారం" నుండి వెలికితీశారు