కల్వకుంట్ల చంద్రశేఖరరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 37:
==== విద్యార్థి నేత, తొలినాళ్ళ రాజకీయాలు ====
[[File:KCR cutout1.JPG|thumb|హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చిత్రం]]
విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది.<ref group="నోట్స్">చంద్రేఖర్ రావు చదువు పూర్తవుతూండగానే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ సూచిస్తే "నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను" అన్నారని కాలేజీ సహాధ్యాయి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి గుర్తుచేసుకున్నాడు.</ref> అప్పటి కాంగ్రెస్ నాయకుడు [[అనంతుల మదన్ మోహన్]] ఇతనికి రాజకీయ గురువు. డిగ్రీ పూర్తిచేసిన కేసీఆర్ 1975లో దేశంలో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర స్థితి]] విధించగానే డిగ్రీ పూర్తిచేసిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి [[సంజయ్ విచార్ మంచ్|సంజయ్ విచార్ మంచ్‌]]<nowiki/>లో చేరాడు. 1980లో [[సంజయ్ గాంధీ]] మరణించాకా సిద్ధిపేట తిరిగిచ్చాడు. 1982లో తాను ఎంతగానో అభిమానించే [[నందమూరి తారక రామారావు]] పార్టీ పెట్టడంతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, [[తెలుగుదేశం పార్టీ]]లో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
 
==== వరుస విజయాలు, మంత్రి పదవులు ====
[[1985]]లో తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.<ref name="ibnlive.in.com">{{cite news|title=KCR to enter Congress via Telangana?|url=http://ibnlive.in.com/news/kcr-to-enter-congress-via-telangana/454446-37-64.html|accessdate=26 February 2014|newspaper=IBN Live|date=26 February 2014}}</ref> ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో వరుసగా గెలుపొందాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /> [[1987]]-[[1988|88]] కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. [[1992]]-[[1993|93]]లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. [[1997]]-[[1998|98]]లో కేసీఆర్‌కు తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది. [[1999]]-[[2001]] కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్‌ను అసంతృప్తుణ్ణి చేసింది.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />