అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
[[Andhravijnanasarvasvamupart2.pdf/10]] అను గ్రందములోని 4 వ పుటలో అనంతపురము చరిత్ర ఈ విధముగా నున్నది.
</ref> అనంతపురము -
1. మైసూరురాజ్యము లోని యొక పల్లె. [[శివమొగ్గ|షిమోగాజిల్లా]]లోని [[సాగర్ తాలూకా]] లోనిది. షిమోగాకు 29 మైళ్ళమీద నుండును. అంధాసురు డన్న రాజుచే నెనిమిదవ శతాబ్దియం దీగ్రామము కట్టింపబడియె. పదకొండవ శతాబ్దియందిది చాళుక్యుల యాధీనమునం దుండెను. ఇది 'సహస్రవిషయము ' (మండలము) లోనిది. 1042లొ నిది 1200 బ్రాహ్మణుల కగ్రహారముగ నీయబడెను. 1079 లో నిది రాజధానిగ జెప్పబడెను. పదినేడవ శతాబ్దియందు, కేలడిరాజయిన వేంకటప్పనాయకు డీగ్రామమునందు శివాచారమఠమును స్థాపించెను. చంపకసరసు అను చెరువు త్రవ్వించెను. గ్రామము పేరు 'ఆనందపుర ' మని మార్చెను. అదియే తరువాత అనంతపురముగ మాఱెను. హైదరు, టిప్పులు ఈ గ్రామముపై పెక్కుసార్లు దాడివెడలిరి. 1830లో తిరుగుబాటు కాలమున నీ గ్రామము దోపిడికి లోనయ్యెను.
2. అనంతపురము జిల్లాకు ముఖ్యపట్టణము. ఇది [[చెన్నై|చెన్నపట్టణము]]నకు వాయువ్యమూలగ 216 మైళ్ల మీద నున్నది. ఇది చెన్నపురి దక్షిణ మహారాష్ట్రపు ఇనుపదారి యొక్క గుంతకల్లు - బెంగుళూరుశాఖమీద నొకస్టేషను.
ఈ గ్రామము చిక్కప్ప ఒడయార్ అనునతడు కట్టించె నని చెపుదురు. ఈతడు [[విజయనగర]] రాజయిన ప్రథమ బుక్కరాయలకు మంత్రిగనుండెను. ఈ యొడయార్ ఒక పెద్ద చెఱువు కట్టించి, దానికి రెండు అలుగుల నుండి యొక్కువైన నీరు పోవుటకు రెండు కత్వాలును, వానికి సమీపమున రెండు గ్రామములను కట్టించెను. అందొక గ్రామమునకు రాజుపేరిట బుక్కరాయ సముద్రము అని పేరు పెట్టి, రెండవదానికి దనభార్య యైన అనంతమ్మ పేరిట అనంతసాగర మని పేరు పెట్టెను. ఆ పేరే అనంతపురమని మాఱెను.
1800లో [[సీడెడ్|దత్తమండలములు]] కంపెనీవారి క్రిందకు రాగా, ఆ ప్రదేశము నంతకునూ [[మన్రో]] అను వానిని కలెక్టరుగా నియమించిరి. అతడు అనంతపురము నందే తన కచ్చేరీ యేర్పఱుచుకొనెను. 1822లో కలెక్టరు కచ్చేరీ బళ్ళారికి తీసుకొని పోయిరి. 1823లో మరల ఆ కచ్చేరి అనంతపురమునకు వచ్చెను. 1840లో కలెక్టరు కచ్చేరిని [[బళ్లారి]]కి మార్చి, అనంతపురములో సబ్‌కలెక్టరు ఉండజొచ్చెను. 1869లో ఈకచ్చేరి కూడా గుత్తికి బోయెను. 1882లో అనంతపురము స్వతంత్రముగా జిల్లా ఆయెను. అప్పుడిచట మరల కలెక్టరు కచ్చేరి వచ్చెను.
 
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు