ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దర్శకుడు, రచయిత
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 33:
{{main article|ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా}}
[[బొమ్మ:SV Ranga rao in varudhini.jpg|right|thumb|[[వరూధిని]] చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు]]
=== తొలినాళ్ళు ===
ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన [[వరూధిని (సినిమా)|వరూధిని]] అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి [[గిరిజ (నటి)|గిరిజ]] తల్లి [[దాసరి రామతిలకం|దాసరి తిలకం]] ఆయనకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంకు వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.<ref name="ఎస్వీఆర్ తొలి సినిమా అగ్రిమెంట్">{{cite journal|last1=నవ్య|first1=బృందం|title=అరవై ఏళ్ళ నాటి సినిమా అగ్రిమెంట్లు|journal=నవ్య|date=10 September 2008|page=43|url=http://1.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDlV6mfnpRI/AAAAAAAAB0s/LdkgAF-m16Y/s1600/sv+rangarao+agriment.jpeg|accessdate=5 June 2017}}</ref> కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరాడు.<ref name="Srivathsan">{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/s-v-ranga-rao-100-a-golden-standard-for-the-craft/article24311031.ece|title=S V Ranga Rao @ 100 : A golden standard for the craft|date=2 July 2018|accessdate=18 December 2018|website=The Hindu|last=Nadadhur|first=Srivathsan}}</ref> జంషెడ్పూర్ లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవాడు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా ఆయన వేషాలు వేసేవాడు. అదే సమయంలో ఆయన వివాహం కూడా జరిగింది.
 
=== పునఃప్రవేశం ===
కొద్ది రోజుల తర్వాత బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం [[ఏ.వి.సుబ్బారావు|ఎ. వి. సుబ్బారావు]]కు ఇచ్చేశారు. బి. ఎ. సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్నపాత్ర దక్కింది. తర్వాత [[ఎల్.వి.ప్రసాద్|ఎల్. వి. ప్రసాద్]] దర్శకత్వంలో వచ్చిన [[మన దేశం|మనదేశం]], [[పి. పుల్లయ్య]] దర్శకత్వంలో వచ్చిన [[తిరుగుబాటు (1950 సినిమా)|తిరుగుబాటు]] చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు