గుంతకల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 47:
 
==నేపధ్యము==
[[అనంతపురము]] తరువాత మూడవ పెద్ద పట్టణము గుంతకల్లు. [[దక్షిణ మధ్య రైల్వే]] లోని 5 ప్రధాన డివిజన్ లలో మూడవది గుంతకల్ డివిజన్. ముంబై చెన్నై మధ్య ప్రధాన జంక్షన్ గా [[గుంతకల్లు]]కు పేరు ఉంది. ఇక్కడ డీజిల్ లోకో షెడ్ ఉంది. ఇటీవలే ఇది 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. గుంతకల్లుకు ఆ పేరు ఎలా వచ్చింది అనగా ఇక్కడి పాత గుంతకల్లలో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద అని చెబుతారు. గుంతకల్లు స్టేషను మీదుగా ప్రతినిత్యము వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు ఇక్కడినుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజలు కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఇక్కడ పట్టాన జనాభాలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన [[హజారత్ వలి మస్తాన్]] దర్గా చాల ముఖ్యమైనది. ప్రతి సంవత్సరము [[మొహర్రము]] తరువాత 15 రోజులకు ఇక్కడ జరిగే ఉరుసు మహోత్సవానికి [[కర్ణాటక]] [[మహారాష్ట్ర]] వంటి రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని పూజిస్తారు.
 
==దర్శనీయ ప్రదేశాలు==
గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా [[కర్ణాటక]] రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. [[శ్రావణమాసము]]లో ఇక్కడ స్వామి వారిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతారు. ప్రతి [[శనివారము]], [[మంగళవారము]] కసాపురం దేవాలయము భక్తులతో కిట కిట లాడుతుంది. ఇక్కడ స్వామి వారిని తమ కోరికలను కోరుకొని తీరిన తరువాత స్వామి వారికి చెక్కతో చేసిన పాదరక్షలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. స్వామి వారికి సమర్పించిన పాదరక్షలు సంవత్సరము తరువాత అరిగిపోయి ఉండడము స్వామి వారి మాహాత్మ్యము అని ఆలయ పూజారులు చెబుతారు. ఇక్కడికి దగ్గరిలోనే కొండమీద కాశీ విశ్వేశ్వర స్వామి వెలసినాడు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటోలు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురముకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.
"https://te.wikipedia.org/wiki/గుంతకల్" నుండి వెలికితీశారు