ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

→‎అవార్డులు, ప్రశంసలు: పూర్తి స్థాయి అభిప్రాయాలు తొలగింపు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 68:
1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. [[1974]] [[జూలై 18]]వ తేదీన [[మద్రాసు]]లో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశాడు.
 
== నటనా శైలి ==
== కొన్ని పాత్రలు==
రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు. రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించాడు. సంతానం చిత్రంలో ఆయన పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించాడు. మాంత్రికుడి పాత్ర కూడా ఆయన పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించాడు.
 
రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఈయన నటనను అభినందించాడు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడు. రౌడీ పాత్రల్లో నటించేటపుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టాడు. ఆయన కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవాడు.
 
=== కొన్ని పాత్రలు ===
రంగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్ర ఏదయినా, ఆయన కనిపించేవాడు కాదు, పాత్రే కనిపించేది. ఆయన తన సుదీర్ఘ నట జీవితంలో, అనేకానేక పాత్రలలో జీవించాడు. వాటిలో కొన్ని:
 
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు