ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
}}
 
'''ఎస్. వి. రంగారావు''' గా సుప్రసిద్ధుడైన '''సామర్ల వెంకట రంగారావు''' ([[జులై 3]], [[1918]] - [[జులై 18]], [[1974]]) ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు, రచయిత.<ref name="biography">{{Cite book|title=విశ్వనటచక్రవర్తి|last=యం.|first=సంజయ్ కిషోర్|publisher=సంగం అకాడమీ|year=2005|isbn=|location=హైదరాబాదు|pages=}}</ref> ఈయన మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించాడు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. ''విశ్వనట చక్రవర్తి'', ''నట సార్వభౌమ'', ''నటసింహ'' మొదలైనవి ఈయన బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించాడు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975).<ref>{{Cite web|url=http://telugucinemacharitra.com/%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%8e/|title=విశ్వ యశస్వి|date=18 December 2011|publisher=Sakshi}}</ref>
 
== తొలి జీవితం ==
పంక్తి 71:
 
== మరణం ==
1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నాడు. కానీ ఈ లోపే [[1974]] [[జూలై 18]]వ తేదీన [[మద్రాసు]]లో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశాడు.
 
== గుర్తింపు ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు