ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 58:
ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ, అనకాపల్లి లాంటి ఊర్లలో ఆయనకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్రా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు. అన్నై, శారద, నానుం ఒరుపెణ్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతులమీదుగా పారితోషికం స్వీకరించాడు.
 
ఈయన నటించిన [[బంగారుపాప]] (1955) అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసిన చార్లీ చాప్లిన్ ''ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడ''ని అన్నాడు. ఇలియట్ రాసిన ''సైలాస్ మార్నర్'' అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం.<ref name="gotelugu.com">{{Cite web|url=http://www.gotelugu.com/issue11/286/telugu-columns/article-on-sv-ranga-rao-by-tvs-sastry/|title=సుశాస్త్రీయం : నటసార్వభౌమ 'యశస్వి'రంగారావు|website=గోతెలుగు.కామ్|last=టివిఎస్|first=శాస్త్రి}}</ref> ప్రముఖ నటుడు [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] ఆయన గురించి ప్రశంసిస్తూ ఇలా అన్నాడు. ''రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదుమంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండే వాడు''.<ref>{{Cite web|url=https://kapunadu.org/sv-ranga-rao-biography/|title=ఎస్వీ రంగారావు బయోగ్రఫీ}}</ref>
;బిరుదులు:
* విశ్వనటచక్రవర్తి
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు