లేపాక్షి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
 
==మందిర వర్ణన==
లేపాక్షి దేవాలయమున చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు లను ఉపయోగించి అబ్ధుతమగు చిత్రములు గీయించిరి. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనము యొక్క గొప్పదనము- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనమును కూడా చూడవచ్చును. సమకాలికుడగు [[పింగళి సూరన్న]] ప్రభావతీ ప్రద్యుమ్నమున కొంత సూచించాడు. అందు ప్రభావతీ వర్ణన " కన్నుల గట్టినట్లు తెలికన్నుల నిక్కను జూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడన్ శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు" అని శుచిముఖిచేత వర్ణించాడు.శివ, [[వీరభద్ర]], వైష్ణవాలాయములకు సమానమైన ముఖమండపము పైకప్పు లోభాగమున [[మహాభారత]], రామాయణ పౌరాణిక గాథల పెక్కుగా వ్రాసినను, వీరభద్ర దేవాలయపు గోడలమీదను, శివాలయపు అర్ధపంటపమున శివకథలు అచ్చెరెవు గొల్పునట్లు అలంకరించారు. పార్వతీ పరిణయము, [[పార్వతీ]] పరమేశ్వరుల పరస్పరానురాగ క్రీడలు, త్రిపుర సంహారము, [[శివ తాండవము]] లోనిఆఖ్యాయికలు గాథా విషయములుగ చేర్చబడినవి. గౌరీ ప్రసాద శివుడను చిత్తరువున పద్మములు మీసములతో జటాజూటము నుండి ప్రవహించు గంగను మరుగుపరుపజూచుచు [[శివుడు]] [[పార్వతి]] చిబుకములపై చేయుడి బుజ్జగించుట, పార్వతి ప్రణయ కోపము, పరిణయమునకు ముందు పార్వతీ అలంకారము, పార్వతీ పరమేశ్వరులు చదరంగమాడుట, శివుడు అంధకాసుర సంహారమొనర్చుట ముఖమున శాంతి, కరమున శూలము పెట్టి [[రుద్రుడు]] మొఖము, శివుని భిక్షాటనము, నటేశుని ఆనందతాండవము, [[దక్షిణామూర్తి]] మొదలగు చిత్రములు చూచువారిని ముగ్ధులు గావించెను. విష్ణువాలయమున మధ్య విష్ణువును, చుట్టు దశావతారములను చిత్రించిరి. లేపాక్షి శిల్పములు అనల్పములు. 60 కాళ్ళ ముఖ మంటపములోని స్తంభముల మీద పూర్ణకృతులగు సంగీతకారులయ, నటులయ మూర్తులను విజయనగర కీర్తిని తీర్చారు. [[బ్రహ్మ]] మద్దెలను, [[తుంబురుడు]] వీణెను, నందికేశ్వరుడు [[హుడుక్క]]నుహుడుక్కను మరియొక నాట్యచార్యుడు తాళమును వాయింప [[రంభ]] నాట్య మాడుట ఒకచోట చిత్రించెను.
 
ఇచ్చట గుట్టవంటి రాతి నిచ్చట బసవేశ్వరుడుగా తీర్చిదిద్దినారు. ఇంత పెద్ద బసవడు మనికెన్ని చోట్లలనో దొరకడు.ఈగుడిని ఉద్ధేసించి "లేపాక్షి రామాయణము" అను హరికథ కూడాకలదు.దేవాలయాలకు కల్యాణమండపాలుండడము మన మెరుగుదుము. ఈ ఆలయములో కల్యాణమండపము ఉన్నది (అసంపూర్ణము) ఉన్నదీ,లతా మండపమున్నది.పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపము ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు. నాలుగు కాళ్ళ మండపము విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో ప్రాకరములో వైపున పశ్చిమ భాగంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/లేపాక్షి" నుండి వెలికితీశారు