పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''పిఠాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 533450.
==ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర ==
 
<nowiki/><nowiki/><nowiki/><nowiki/><nowiki/><nowiki/><br /><nowiki/>[[File:Padhagaya kshetram-Pithapuram - Eastgodavari District of A.P.jpg|thumb|Padhagaya kshetram - Pithapuram - Eastgodavari District of A.P]]<nowiki/><nowiki/><nowiki/>[[దస్త్రం:Pithapuram .jpg|right|250px|thumb|పాదగయ క్షేత్రం (కుక్కుటేశ్వర స్వామి)]]
ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో పిఠాపుర<nowiki/>ము అను గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము... 20 తేదివుదయాన నాలుగున్నరగంటలకు భయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము గయాసుర [[రాజధాని]]<nowiki/>గా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ ఒక [[చెరువు|తటాక]] మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున ఒక చిన్న [[శివాలయము]]<nowiki/>న్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో ఒకపాడుకూపములో అష్టాదశపీఠములతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు.
 
*
యీ వూళ్ళో యిన్నూరు బ్రాహ్మణయిండ్లు ఉన్నాయి. వారందరు తీర్ధవాసులుగా [[యాచకులు|యాచక]]<nowiki/>వృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపకమయిన జీవనము లేని [[బ్రాహ్మణుడు]] లేడు. యీ దినము [[తొలిఏకాదశి]]. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప [[పండుగ|పండగ]]<nowiki/>గా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, [[భోజనము]]లు కాచేసుకున్నందున గయాతీర్ధములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.
 
యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులు నీలాద్రిరాయనింగారి కుటుంబస్థులు ఒక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన [[వీధులు]] కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిన దారి కొంతమేర [[అడుసు]] నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, [[మొగిలి]]చెట్లు, [[జెముడు]], యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.''
 
== చరిత్ర ==
[[సముద్ర గుప్తుడు]] [[అలహాబాదు]] శాసనములో పిఠాపురము నాలుగో శతాబ్దపు తొలిపాదములో ఒక రాజధానిగా ఉండినట్లు తెలుపబడి యున్నది. పిఠాపురములోని దొరికిన [[జైన]] విగ్రహముల మీది ఉపవాస క్లేశ చిహ్నాలు, వాటి రొమ్ము మీద ఉన్న కొన్ని గాడులూ, [[తాటిపాక]] విగ్రహములు, పెనుమంచిలి చౌముఖములు మొదలైనవి అన్నీ కోన రాజ్యము ఏర్పడిన 12 వ శతాబ్దము ప్రారంభము తరువాతవని తెలియుచున్నవి. వీటిని బట్టి పిఠాపురము గర్భములో చాలా చరిత్ర ఉన్నట్లు తెలియుచున్నది.దీనిని '''పిష్ఠపురం''' అని కూడా అనేవారు.
 
పిఠాపురాన్ని పూర్వం '''పీఠికాపురం''' అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో [[బంగారు]] పాత్ర, వేరొక చేత బాగుగా పండిన [[ఉసిరి]] కాయ, మూడవ చేత [[త్రిశూలం]], నాల్గవ చేత లోహ [[దండం]] ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో [[షణ్ముఖుడు|కుమారస్వామి]] ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు [[శ్రీనాథుడు]] భీమేశ్వర పురాణంలో ఈ కింది విధంగా చెబుతాడు.
 
: "హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
: ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
: గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
: గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
[[File:PhiThapuram.Rly. Stn..JPG|thumb|right|పిఠాపురం రైల్వే స్టేషను]]
పిఠాపురానికి ఉత్తర దిక్కున [[ఏలేరు]] అనే ఏరు ఒకటి ఉంది ( ప్రస్తుతం దీనిని [[చెరుకుల కాలువ]] అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు [[శ్రీనాథుడు]] అలా అనేసి ఊరుకోకుండా-
: "ఏలేటి విరినీట నిరుగారునుంబండు
: ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
 
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ [[శ్రీనాథుడు]] తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు [[పనస]] చెట్లు, [[వక్క|పోక]] తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాథుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. [[సింహాచలం]] వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర [[సముద్రం]]<nowiki/>లో కలుస్తుంది. అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడా సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి "శ్రీనాథ కృతి సమీక్ష" అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డె రాజులతో వైరం పూనిన [[విజయనగరం]] గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ఠ చేసేరుట. ఈ జగన్నాథ స్వామి [[చేతులు]] ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని "మొండి జగ్గప్ప" అని ప్రాంతీయులు పిలుస్తారు.
 
పిఠాపురంలో కుంతీమాధవ స్వామి [[ఆలయం]], కుక్కుటేశ్వరుడి కోవెలలు ఉన్నాయి. [[వృత్తాసురుడు|వృత్తాసురుడిని]] చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకుందికి ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించేడు. అవి <ref>http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom3.html</ref>.
* [[కాశీ]]లో బిందు మాధవ స్వామి.
* [[ప్రయాగ]]లో వేణు మాధవ స్వామి.
* పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
* [[తిరుచునాపల్లి]]లో సుందర మాధవ స్వామి.
* [[రామేశ్వరము|రామేశ్వరం]] లో సేతు మాధవ స్వామి.
 
== పౌరాణిక ప్రశస్తి ==
గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంవత్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా ''నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని'' కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక [[కీటకాలు]], [[సూక్ష్మజీవులు]] కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.<br />
ఇది కాక ఆయన చేసిన గొప్ప [[యాగాలు]], పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. [[గయాసురుడు]] చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.<ref>{{cite news|last1=కమల|first1=ఎం.|title=దేహమే దేవాలయం-పాదగయే పిఠాపురం|url=http://archives.andhrabhoomi.net/archana/pithapuram-896#|accessdate=20 December 2014|agency=ఆంధ్రప్రభ|date=నవంబర్ 13, 2010}}</ref><br />
బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో [[బ్రహ్మ]] చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు [[బ్రహ్మదేవుడు]] విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref><br />
గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి ''నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని'' కోరి పొందారు.<br />
ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తూన్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన (కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ [[యాగం]] తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో (కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం [[శిక్ష]]<nowiki/>గా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.
 
==పాదగయ క్షేత్ర వివరణ==
[[File:Padhagaya kshetram-Pithapuram - Eastgodavari District of A.P.jpg|thumb|Padhagaya kshetram - Pithapuram - Eastgodavari District of A.P]]
కుక్కుటేశ్వరుడి [[గుడి]]<nowiki/>కి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. [[గంగా నది|గంగా]] తీరమున ఉన్న [[గయ]] "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే [[గంగ]]<nowiki/>లో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయునికి సంబంధించిన ఒక కథనం ప్రకారం గయుని చావు తరువాత చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని [[సింహాచలం]] నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. అన్నవరం తదనంతర కాలంలో ప్రశస్తి చెందినది. అందువలననే శ్రీనాథుని రచనలలో ఎక్కడా [[అన్నవరం]] చరిత్ర కనబడదు.
 
===కుక్కుటేశ్వర దేవాలయం===
ఈ [[దేవాలయం]] కోనేరుకు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయం ఎదురుగా కల ఏకశిల [[నంది]] అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొద్దిగా దిగువగా ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.
 
===పురుహూతికా దేవి ఆలయం===
{{ప్రధాన వ్యాసం|పురుహూతికా క్షేత్రం}}
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో '''పురుహూతికా దేవి''' ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. [[భారత దేశము|భారతదేశం]] లోని [[శక్తి పీఠాలు|అష్టాదశ మహా శక్తి పీఠములలో]] ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి '''పీఠికాపురం''' అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.
 
=== శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం===
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం,శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ [[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయు]]<nowiki/>ల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు,భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు,మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి [[పాదుకలు]] ఉన్నాయి.
 
===[[షిరిడి సాయి]] గురు మందిరం===
 
===[[కాలభైరవ|కాలభైరవుడు]] ఆలయం===
ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే [[కాలభైరవుడు|కాలభైరవుడి]] విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉంది.
 
===కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)===
 
===ఇతర ఆలయాలు===
[[దస్త్రం:Pithapuram .jpg|right|250px|thumb|పాదగయ క్షేత్రం (కుక్కుటేశ్వర స్వామి)]]
[[దస్త్రం:Padagaya.jpg|right|250px|thumb|కుక్కుటేశ్వర స్వామి]]
[[దస్త్రం:Puruhutika ammavaru.jpg|250px|right|thumb|పురుహూతికా దేవి]]
 
===పిఠాపురంలో ఇతర ఆలయాలు===
* వేణు గోపాలస్వామి ఆలయం,
* నూకాలమ్మ గుడి ([[గ్రామదేవత]])
* [[కుక్క]] [[పాము]]గుడి (సీతయ్యగారి తోట)
* రాముని కోవెల (మంగాయమ్మరావు పేట)
* [[వెంకటేశ్వరస్వామి]] గుడి (కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద)
* [[కోతి|ఆంజనేయ స్వామి గుడి (కోతి]] గుడి) (మార్కెట్ వద్ద)
* సాయిబాబా గుడి (చిన్న పోస్టాఫీస్ వద్ద)
* పురుహూతికా అమ్మవారు (పాత బస్ స్టాండ్ వద్ద)
* కోట సత్తెమ్మ తల్లి గుడి (సీతయ్యగారి తోట)
* శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం (పాత బస్టాండ్ వద్ద)
* శ్రీ సకలేశ్వర స్వామి గుడి (నూకాలమ్మ గుడి ప్రక్కన )
* శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం (వేణుగోపాలస్వామి గుడి వద్ద)
* దత్తాత్రేయుడి గుడి (దూళ్ళ సంత దగ్గర, అగ్రహారం)
 
=== చర్చిలు===
ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, బెతెస్థ బాప్టిస్ట్ చర్చి, ఎల్-షద్దాయి మినిస్ట్రీస్ చర్చి, జియన్ ప్రార్థనా మందిరం, హౌస్ ఆఫ్ హోప్, బైబిల్ మిషన్ చర్చి, ట్రినిటీ లూథరన్ చర్చి, డోర్ ఆఫ్ హోప్ చర్చి, సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ చర్చి, మరి కొన్ని
 
==సౌకర్యాలు==
 
[[File:A.P. Village Pithapuram-Suryaraya vidyananda Librery.jpg|thumb|Suryaraya vidyananda Librery of A.P. Village Pithapuram-]]
[[File:A.P. Village Pithapuram-Suryaraya vidyananda Librery-1.jpg|thumb|Suryaraya vidyananda Librery of A.P. Village Pithapuram-]]
===రవాణ===
[[బొమ్మ:APtown Pithapuram 1.JPG|250px|thumb|right|పిఠాపురం రైల్వేస్టేషను]]
* ఈ పట్టణం మద్రాసు-హౌరా రైలు మార్గంలో ఉంది.
* జాతీయ రహదారి [[కాకినాడ]] నుండి [[విశాఖపట్నం]] వైపుగానూ, [[రాజమండ్రి]] వైపుగానూ వెళుతుంది. కనుక [[బస్సులు]] విరివిగా తిరుగుతాయి.
 
*
===విద్య===
* సూర్యరాయ డిగ్రీ కాలేజి
* సి.బి.ఆర్.డిగ్రీ కాలేజి,
* ఆర్.ఆర్.బి.హెఛ్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
* ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కాలేజి,
* శ్రీ హనుమంతరాయ జూనియర్ కాలేజి,
* నవచైతన్య జూ.కాలేజి,
* ప్రియదర్శిని జూ.కాలేజి,
* అంజనా జూ.కాలేజి
 
=== '''కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు''': ===
* పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ - మంగయమ్మారావు పేట
 
===సినిమా థియేటర్లు===
శ్రీ సత్యా, పూర్ణా, అన్నపూర్ణా, శివదుర్గా, శ్రీవెంకటేశ్వర
 
===క్రికెట్ మైదావాలు===
ఆర్.బి.హెచ్.ఆర్. క్రికెట్ గ్రౌండ్, రాజుగారి కోట, దూళ్ళ సంత
 
==ప్రముఖులు==
*[[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] [[వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి]] (బాలవ్యాస, తర్క వ్యాకరణ సిద్ధాంతి బిరుదాంకితులు)
* [[ఓలేటి పార్వతీశం]] (వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరు)
* [[నడకుదుటి వీర్రాజు]]
* [[ఉమర్ ఆలీషా]] (తెలుగు పండితులు)
* [[పానుగంటి లక్ష్మీనరసింహం]] ([[సాక్షి వ్యాసములు]] రచయిత)
* [[డా.శ్రి మాడభూషి భావనాచారి]][స్వాతంత్ర్యసమరయోధులు,తామర పత్ర గ్రహీత,సాహితీవేత ]
* [[నేదునూరి కృష్ణమూర్తి]] (సంగీత విద్వాంసులు)మొదలైన వారు అక్కడ ఉండేవారు.
* [[మొక్కపాటి నరసింహశాస్త్రి]]
* [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]
* [[పిఠాపురం నాగేశ్వరరావు]]
* [[మిరియాల రామకృష్ణ]]
* [[ఆవంత్స సోమసుందర్]]
* [[మాసిలామణి]]
* [[ర్యాలి ప్రసాద్]]
*[[కూచి నరసింహం]]
*[[ హరనాథ్ రాజు]]
*[[పురాణం సుబ్రహ్మణ్యశర్మ]]
*[[మలిరెడ్డి బాబీ]]
 
==ఇతర విశేషాలు==
 
* సా. శ. 1930 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా [[బరంపురం]]లో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారి తాలూకు వారు ఎవరో ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (బట్టలు కుట్టే దర్జీని అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, ట్రంకు పెట్టెలో పెట్టేసి ఆ పెట్టెని కురదా రోడ్డు పేసెంజరు లోనో హౌరా మెయిల్ లో ఎక్కించేసేరు. (ఆ రోజులలో పిఠాపురంలో మెయిలు బండి ఆగేది) దరిమిలా రైలు బరంపురం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం [[బరంపురం]]లో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
* పిఠాపురంలో [[వీణ]]ల తయారీ జరుగుతోంది. పాదగయా క్షేత్రానికి దగ్గరలో వీణలను తయారు చేస్తారు. పిఠాపురానికి చెందిన [[తుమరాడ సంగమేశ్వరశాస్త్రి]] మరియు [[చిట్టి బాబు]] వీణా విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. సంగమేశ్వర శాస్త్రి గారు నెహ్రూ గారి ఉపన్యాసాలు కూడా వీణ మీద వాయించేవారని నానుడి.
* [[కాకినాడ]] లోని పిఠాపురం రాజా కళాశాల పూర్వపు రోజుల్లో మంచి పేరున్న [[కళాశాల]]. దరిమిలా ఆ పేరు లోని జిగి తగ్గింది అనుకొండి.
 
===పిఠాపుర సంస్థాన విశేషాలు===
పిఠాపురం సంస్థానాన్ని [[వెలమ]] రాజులు పాలించే వారు. వీరిలో శ్రీ [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు|సూర్యారావు బహదూర్]] ప్రముఖులు. వీరు సాహిత్యాన్ని బాగా పోషించారు. వింజమూరి సోమేశ (రాఘవపాడవీయం), వక్కలంక వీరభద్ర కవి (వాసవదత్తా పరిణయం), కూచిమంచి జగ్గ కవి, కూచిమంచి గంగన్న, దేవులపల్లి బాపన్న, పిండిప్రోలు లక్ష్మన్న, [[అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి]], దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, కురుమెళ్ళ వెంక‌ట‌రావు మా పిఠాపురం పుస్తకాన్ని ర‌చించారు. ఇందులో శ్రీ వెంక‌ట‌రావు గారు పిఠాపురం మ‌హారాజ వారితో క‌లిసి ప్రయాణించిన సంగ‌తులతో పాటుగా పిఠాపురం యొక్క ఖ్యాతి గురించి బ‌హు చక్కగా వివ‌రించారు. రెండవ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి''''''' ప్రభృతులు పిఠాపురం ఆస్థానంలోని వారే.
 
{{పిఠాపురం సంస్థానం జమీందారుల వంశవృక్షము}}
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[పిఠాపురం శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
 
=చిత్రమాలిక=
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
<gallery>
దస్త్రం:Pithapuram.JPG|'''శ్రీ గురు దత్తాత్రేయుని ఆలయం'''
దస్త్రం:Padagaya.JPG|'''శ్రీ కుక్కుటేశ్వర దేవాలయం'''
దస్త్రం:Datta_treya_alayam.jpg
దస్త్రం:Datta treya.jpg
దస్త్రం:Pithapuram shiva.jpg
దస్త్రం:Pithapuram temple.jpg
దస్త్రం:Gayasura.jpg
దస్త్రం:Puruhitaka temple.jpg
దస్త్రం:Pithapuram .jpg
దస్త్రం:Pithapuram shivayya.jpg
దస్త్రం:Puruhitaka temple.jpg
దస్త్రం:Pithapuram photo.jpg
దస్త్రం:Arati datta.jpg
దస్త్రం:Datta treya pitham.jpg
</gallery>
 
==వనరులు==
[[వేమూరి వేంకటేశ్వరరావు]], [http://eemaata.com/em/issues/200409/147.html "పిఠాపురంలో నా మొదటి మజిలీ"] ఈమాట అంతర్జాతీయ పత్రిక, సెప్టెంబరు 2004
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,29,282 - పురుషులు 64,906 - స్త్రీలు 64,376
;
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు