తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: మార్చేసారు
పంక్తి 31:
=
 
===
 
=== 1947 భారతదేశ స్వాతంత్రం అనంతరం - ప్రస్తుతం ===
1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా అవతరించింది. 1953లో ఉత్తర జిల్లాలు గోదావరి జిల్లాలతో చేర్చి ఆంధ్ర ప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రంగా అవతరించింది. 1954లో యానాం నుండి ఫ్రెంచి వారు నిష్క్రమిస్తూ దానిని ప్రత్యేకంగా [[పుదుచ్చేరి|పాండిచేరి]] రాష్ట్రంలోని ఒక భాగంగా ఉండాలని ఒప్పందం చేసుకున్నారు.
 
== భౌగోళిక స్వరూపం ==
[[File:CanalRoad.jpg|thumb|కాలువ గట్లు]]
[[File:View of Banana plants at Ryali village in East Godavari district.jpg|thumb|కోనసీమలో అరటి పొలాలు]]
[[దస్త్రం:Konaseema-1.jpg|right|thumb|కోనసీమ పొలాలు]]
[[File:Kon2.jpg|thumb|కోనసీమ పొలాలు]]
తూర్పుగోదావరి జిల్లా వైశాల్యం 10,807 చదరపు కిలోమీటర్లు ఉంటుంది(4,173 మైళ్ళు). ఇది వైశాల్యంలో ఇండోనేషియా యొక్క ద్వీపంతో సమానం. ఈ జిల్లా పశ్చిమాన కొండాకోనలతో నిండి ఉటుంది. అలాగే తూర్పున మైదానాలతో నిండి ఉంటుంది. ఈ జిల్లాకు తూర్పున బంగాళాఖాతం ఉటుంది. ఈ జిల్లా కేంద్రమైన [[కాకినాడ]] సముద్రతీరాన ఉపస్థితమై ఉంది.
 
తూర్పు గోదావరి జిల్లాకు ఉత్తరాన [[విశాఖపట్నం]] జిల్లా, [[ఒడిషా]] రాష్ట్రము, తూర్పున, దక్షిణాన [[బంగాళా ఖాతము]], పశ్చిమాన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, వాయవ్యాన [[ఖమ్మం]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా జిల్లాను మూడు ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు. అవి: డెల్టా, మెట్ట ప్రాంతం, కొండ ప్రాంతాలు. వివిధ ప్రాంతాల ఎత్తులు సముద్ర మట్టం నుండి 300 మీ.ల వరకు ఉన్నాయి.
 
డెల్టా ప్రాంతంలో [[కోనసీమ]], [[కాకినాడ]]లోని ప్రాంతాలు, పూర్వపు [[రామచంద్రపురం]], [[రాజమండ్రి]] తాలూకాలు ఉన్నాయి. ఈ ప్రాంతం [[వరి]] పొలాలతో, [[అరటి]], [[కొబ్బరి]], [[తమలపాకు]] తోటలతో, లెక్కలేనన్ని [[తాటి|తాడి చెట్ల]]తో కళకళ లాడుతూ ఉంటుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, ఇసుకతో కూడిన మట్టి నేలలు డెల్టా ప్రాంతంలో కనిపిస్తాయి.
 
[[మండపేట]], [[తుని]], [[పిఠాపురం]], [[పెద్దాపురం]], [[కాకినాడ]], [[రామచంద్రాపురం]] మరియు [[రాజమండ్రి]]లలో కొన్ని ప్రాంతాలను మెట్ట ప్రాంతాలుగా పిలుస్తారు.<!-- Red loamy soil in upland and hill tracts of the district. --> [[తూర్పు కనుమలు]] సముద్ర మట్టం నుండి అంచెలంచెలుగా లేస్తూ, పూర్వపు మన్యం తాలూకాలైన [[రంపచోడవరం]], ఎల్లవరం అంతటా వ్యాపించాయి. [[గోదావరి]], పంపా, [[తాండవ నది|తాండవ]] మరియు ఏలేరులు జిల్లాలో ప్రవహిస్తున్న ప్రముఖ నదులు. పెద్దాపురం సంస్థానం ప్రసిద్ధికెక్కింది.
=== వాతావరణం ===
ఈ జిల్లాలో ఈశాన్య ఋతుపవనాలు మరియు నైరుతీ ఋతుపవనాల కారణంగా జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ జిల్లా పశ్చిమ కొండ ప్రాంతాలలో సుమారు 140 సెంటిమీటర్లు మరియు ఉత్తర కోస్తా ప్రాంతంలో సరాసరి వర్షపాతం 100 సెంటిమీటర్లు ఉంటుంది.
ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది.
 
== ఆర్ధిక స్థితి గతులు ==
[[File:Hindu Pilgrimage sites map of Andhra Pradesh.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు.]]
[[File:View from Talupulamma Temple.jpg|thumb|తలుపులమ్మ లోవ, తుని]]
[[దస్త్రం:Dowleswaram barrage.JPG| right|thumb|[[ధవళేశ్వరం]] బేరేజి]]
గోదావరి డెల్టాలో అధికభాగం ఈ జిల్లాలోనే ఉన్నందున వ్యవసాయం మరియు నీటిసంబంధిత వృత్తులు(అక్వా కల్చర్) జిల్లా ప్రజలకు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా సహజవాయువు నిలువలు బయటపడడం వలన ఈ ప్రదేశం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్నది. జిల్లాలో రెండు ఎరువుల కర్మాగారాలు, సహజ వాయువుతో తయారయ్యే విద్యుత్ వుత్పత్తి కేంద్రాలు మరియు చమురు శుద్ధి కర్మాగారాలున్నాయి. ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద చమురు మరియు సహజవాయు ఉత్పత్తి కేంద్రంగా ఉంది.
 
=== వనరులు ===
తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయం ప్రధానంగా వున్న జిల్లా. అలాగే తూర్పు గోదావరి సంపన్నభరితమైన జిల్లా కూడా. రాష్ట్రంలో సంపన్నతలో మొదటి స్థానంలోనూ దేశంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది దేశంలో సమృద్ధిగా సహజ వాయువు మరియు చమురు నిలువలు విస్తారంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లాలో చమురు మరియు సహజవాయువు నిల్వలు ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నట్లు భావించబడుతుంది.
 
=== జీవనప్రమాణం ===
2007-2008 జనాభాగణాంకాలను అనుసరించి '''అంతర్జాతీయ జనసంఖ్యా శాస్త్రశిక్షణాలయం'''(ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ) జిల్లా మొత్తంలో 38 గ్రామాలలో 1019 మంది అభిప్రాయాలను సేకరించింది. వారి పరిశోధనలో 92.5% ప్రజలు విద్యుత్తు వసతిని, 96.7% ప్రజలు మంచినీటి వసతిని, 50.4% ప్రజలు మరుగుదొడ్ల వసతిని మరియు 30.9% పక్కా గృహాల వసతి కలిగి ఉన్నట్లు తేలింది. 28.6 మంది యువతులు చట్టపరమైన 18 సంవత్సరాలకంటే ముందే వివాహం చేసుకున్నారు.
 
శెట్టబలిజ, కాపులు, రెడ్డి, కమ్మ, కొండా రెడ్డిలు అధికంగా ఉన్నఈ జిల్లాలో ఇంకా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. రాచపల్లి వంటి మెట్ట ప్రాంతాల్లో ఇంకా క్షత్రియ రాజుల జమీందారీ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ జిల్లా వాసులకు ఎక్కువగా [[పశ్చిమ గోదావరి జిల్లా]] వాసులతో వివాహ సంబంధాలుంటాయి. ఈ జిల్లాలో [[రాజమండ్రి]], [[కాకినాడ]] వంటి పట్టణాలలో కొద్దిగా ఆధునికత కనిపించినా మిగిలిన మండలాల్లో చాలావరకూ గ్రామీణ సంస్కృతి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పోలిస్తే ఈ జిల్లాలో ఉన్న మహిళల్లో అక్షరాస్యత తక్కువ, ఎక్కువశాతం ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండగానే వివాహాలు జరుగుతాయి. బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతూవుంటాయి. యువతులు, స్త్రీలు ఒంటరిగా బయట తిరగడం అంతగా కనిపించరు. [[సంక్రాంతి]], [[ఉగాది]], [[వినాయక చవితి]], [[క్రిస్టమస్]] మరియూ గ్రామీణ పండుగలు వైభవంగా జరుపుకుంటారు గట్టిగా
 
== పాలనా వ్వవస్ధ. ==
 
=== జిల్లాలో రెవెన్యూ డివిజన్లు. ===
1.[[కాకినాడ]] 2.[[పెద్దాపురం]] 3.[[అమలాపురం]] 4.[[రాజమండ్రి]] 5.[[రంపచోడవరం]],6.[[రామచంద్రపురం]] 7.[[ఏటపాక|ఎటపాక.]]
 
=== జిల్లాలో నగర పాలక వ్యవస్థలు ===
 
=== 1.[[కాకినాడ (పట్టణ)]] 2. [[రాజమండ్రి (పట్టణ)]]. ===
 
=== జిల్లాలో పురపాలక వ్యవస్థలు ===
తూర్పు గోదావరి జిల్లాలో 8 పురపాలక వ్యవస్థలు ఉన్నాయి.
# [[అమలాపురం]]
# [[మండపేట]]
# [[పెద్దాపురం]]
# [[పిఠాపురం]]
# [[రామచంద్రపురం]]
# [[సామర్లకోట]]
# [[తుని]]
 
=== జిల్లాలో మండలాలు ===
పూర్వపు తాలూకాలు 19
[[మండలాలు]] 64 (62 గ్రామీణ + 2 పట్టణ)
మండల ప్రజా పరిషత్తులు 57
పంచాయితీలు 1,012
[[మునిసిపాలిటీలు]], కార్పొరేషనులు 9
పట్టణాలు 14
[[గ్రామాలు]] 1379
 
భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లాను 57 రెవిన్యూ మండలాలుగా విభజించారు<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0204000000&ptype=B&button1=Submit తూర్పు గోదావరి జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 26, 2007న సేకరించారు.</ref>. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 59 మండలాలు ఉన్నాయి.జివో నంబరు 31 ద్వారా [[రౌతులపూడి]] అనే కొత్త మండలాన్ని 44 గ్రామాలతో ఏర్పరచారు. [[శంఖవరం]] నుండి 12 గ్రామాలు, [[కోటనందూరు]] నుండి 31 గ్రామాలు, [[తుని]] నుండి ఒక గ్రామాన్ని విడదీసి ఈకొత్త మండలాన్ని ఏర్పరచారు. దీనితో మొత్తం 60 మండలాలు అయ్యాయి. [[జగ్గంపేట]], [[ముమ్మిడివరం]] గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలు గానూ, గొల్లప్రోలు, కొత్తపేట, ఏలేశ్వరం, రావులపాలెం, రాజోలు, అనపర్తి గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చబోతున్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం (రామాలయమున్న భద్రాచలం రెవెను గ్రామం మినహా), [[చింతూరు]], [[వరరామచంద్రపురం]], [[కూనవరం]] అనే 4 మండలాలు ఈ జిల్లాలో కలిసినవి. మొదట్లో ఈ 4 ముంపుమండలాలను [[రంపచోడవరం]] రెవెన్యు మండలంలో ఉంచినప్పటికీ, 2015లో ఎటపాక రెవెన్యు మండలం ఏర్పాటుచేయబడి, అందులోకి మార్చబడ్డాయి. ఈ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని రెవెన్యు మండలాల సంఖ్య 7కి పెరిగింది. ఏపీలో విలీనం చేసిన [[భద్రాచలం]] రూరల్ మండలాన్ని [[నెల్లిపాక]] మండల కేంద్రంగా చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగానే కాక రెవెన్యూ మండలంగా మార్చబడటంతో, ఇక నెల్లిపాక మండలానికి బదులుగా ఎటపాక మండలంగా గుర్తించబడటం జరిగింది.
 
{|
|rowspan=22 valign="center"|[[File:East Godavari district Montage.png|265px]][[దస్త్రం:Eastgodavari.jpg|265px|తూర్పు గోదావరి జిల్లా మండలాలు]]
 
|-
!సంఖ్య !!పేరు!! సంఖ్య !!పేరు!! సంఖ్య !!పేరు !! సంఖ్య !!పేరు
|-
|1 ||[[మారేడుమిల్లి]] ||21 ||[[పిఠాపురం]] ||41 ||[[కపిలేశ్వరపురం]] ||61 ||[[చింతూరు]]
|-
|2 ||[[వై.రామవరం]] ||22 ||[[కొత్తపల్లె,తూర్పుగోదావరి|కొత్తపల్లె]] ||42 ||[[ఆలమూరు(తూర్పుగోదావరిజిల్లా మండలం)|ఆలమూరు]] ||62 ||[[వరరామచంద్రపురం]]
|-
|3 ||[[అడ్డతీగల]] ||23 ||[[కాకినాడ(గ్రామీణ)|కాకినాడ (గ్రామీణ)]] ||43 ||[[ఆత్రేయపురం]] ||||
|-
|4 ||[[రాజవొమ్మంగి]] ||24 ||[[మండపేట|మండపేట (గ్రామీణ)]] ||44 ||[[రావులపాలెం]] ||||
|-
|5 ||[[కోటనందూరు]] ||25 ||[[సామర్లకోట]] ||45 ||[[పామర్రు (తూ.గో జిల్లా)|పామఱ్ఱు]] ||||
|-
|6 ||[[తుని]] ||26 ||[[రంగంపేట]] ||46 ||[[కొత్తపేట (తూర్పు గోదావరి జిల్లా)|కొత్తపేట]]
|-
|7 ||[[తొండంగి]] ||27 ||[[గండేపల్లి]] ||47 ||[[పి.గన్నవరం]]
|-
|8 ||[[గొల్లప్రోలు]] ||28 ||[[రాజానగరం]]||48 ||[[అంబాజీపేట]]
|-
|9 ||[[శంఖవరం]] ||29 ||[[రాజమండ్రి (గ్రామీణ)]] ||49 ||[[ఐనవిల్లి]]
|-
|10 ||[[ప్రత్తిపాడు (తూ.గో జిల్లా)|ప్రత్తిపాడు]] ||30 ||[[రౌతులపూడి]] ||50 ||[[ముమ్మిడివరం]]
|-
|11 ||[[ఏలేశ్వరం]] ||31 ||[[కడియం]] ||51 ||[[ఐ.పోలవరం]]
|-
|12 ||[[గంగవరం]] ||32 ||[[సఖినేటిపల్లి]] ||52 ||[[కాట్రేనికోన]]
|-
|13 ||[[రంపచోడవరం]] ||33 ||[[అనపర్తి]] ||53 ||[[ఉప్పలగుప్తం]]
|-
|14 ||[[దేవీపట్నం]] ||34 ||[[బిక్కవోలు]] ||54 ||[[అమలాపురం]]
|-
|15 ||[[సీతానగరం]] ||35 ||[[పెదపూడి]] ||55 ||[[అల్లవరం]]
|-
|16 ||[[కోరుకొండ]] ||36 ||[[కరప]] ||56 ||[[మామిడికుదురు]]
|-
|17 ||[[గోకవరం]] ||37 ||[[తాళ్ళరేవు]] ||57 ||[[రాజోలు]]
|-
|18 ||[[జగ్గంపేట]] ||38 ||[[కాజులూరు]] ||58 ||[[మలికిపురం]]
|-
|19 ||[[కిర్లంపూడి]] ||39 ||[[రామచంద్రాపురం]] ||59 ||[[ఎటపాక మండలం|ఎటపాక]]
|-
|20 ||[[పెద్దాపురం]] ||40 ||[[రాయవరం]] ||60 ||[[కూనవరం]]
|}
 
[[తెలంగాణా]] రాష్ట్ర విభజన తర్వాత Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2014 ప్రకారం తెలంగాణాలో [[ఖమ్మం జిల్లా]]కు చెందిన [[చింతూరు]] మండలం, [[వరరామచంద్రపురం]] మండలం, [[కూనవరం]] మండలం, [[భద్రాచలం]] మండలం లోని గ్రామాలు (భద్రాచలం పట్టణం తప్ప) - తూర్పుగోదావరి జిల్లాలో కలిశాయి <ref>http://www.prsindia.org/uploads/media/Telangana/AP%20Reorganisation%20%28A%29%20Bill,%202014.pdf</ref>
 
== రవాణా వ్వవస్థ ==
తూర్పు గోదావరి జిల్లా దేశం నలుమూలలకు రహదారి మరియు రైలు మార్గాలతో అనుసంధానించబడి ఉంది. [[చెన్నై]], [[కలకత్తా|కోల్‌కతా]] లను కలిపే జాతీయ రహదారి, రైల్వే లైనులు జిల్లా గుండా పోతున్నాయి. రాజమండ్రి కొవ్వూరును అనుసంధానిస్తూ అతి పెద్ద రహదారి మరియు రైలు వంతెన ఉన్నది . [[రాజమహేంద్రవరం]]కి 15 కి.మీ.ల దూరంలో ఉన్న [[మధురపూడి]] వద్ద ఒక విమానాశ్రయము ఉంటుంది. ఇది [[కాకినాడ]]కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. [[రాజమండ్రి]] నుండి [[హైదరాబాదు]], [[చెన్నై]], [[విజయవాడ]] మొదలైన నగరాలకు వరకు ప్రతి రోజు రైలు సేవలు ఉన్నాయి. విశాఖపట్టణం విమానౌకాశ్రయం తరువాత స్థానంలో ఉన్న నౌకాశ్రయం ఈ జిల్లా కేంద్రమైన కాకినాడలో ఉంది.
 
== జనాభా లెక్కలు ==
2011 జనాభాగణాంకాలను అనుసరించి తూర్పు గోదావరి జిల్లా జనసంఖ్య 5,151,549. ఇది సంయుక్త అరబ్ ఎమిరేట్‌కు జనసంఖ్యకు 5,148,664 సమానం లేక కొలరాడో రాష్ట్ర జనాభాకు సమానం. భారతదేశంలో జనసంఖ్యలో తూర్పు గోదావరి జిల్లా 19వ స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 1 కిలోమీటరుకు 477. జిల్లా వైశాల్యం (1,240 చదరపు మైళ్ళు). 2001-2011 వరకు జనసాంద్రత పెరుగుదల శాతం 5.1%. జిల్లా అక్షరాస్యత 71.35%. [[2001]]లో అక్షరాస్యత 65.48%. స్త్రీ:పురుషుల నిష్పత్తి 1005:1000. 2001లో స్త్రీ:పురుషుల నిష్పత్తి 993:1000. స్త్రీల అక్షరాస్యత 74.91%. పురుషుల అక్షరాస్యత 67.82%. జాతీయ స్త్రీ :పురుష నిష్పత్తి 994:1000.
 
2001లో 6 సంవత్సరాలకంటే చిన్న పిల్లల సంఖ్య 613,490. 2011 లో 6 సంవత్సరాల సంఖ్య 492,446. మొత్తం 492,446 పిల్లలలో ఆడ పిల్లల సంఖ్య
250,086, మగ పిల్లల సంఖ్య 242,360. 2001లో ఆడపిల్లమగపిల్లల నిష్పత్తి 978:1000. 2011లో ఆడపిల్లమగపిల్లల నిష్పత్తి 969:1000. 2011లో 6 సంవత్సరాల పిల్లలు 9.56%. 2001లో 6 సంవత్సరాల పిల్లలు 12.52%.
 
'''0-6 ఏళ్ళ మధ్య వయసు గల పిల్లల జనాభా '''
{| border="1" cellpadding="1" width=500 align=center
!
!మొత్తం
!పురుషులు
!స్త్రీలు
!నిష్పత్తి
|- align=right
|గ్రామీణ: || 456003 || 231005 || 224998 || 97.4%
|- align=right
|పట్టణ: || 121418 || 60911 || 60507 || 99.3%
|- align=right
|మొత్తం: || 577421 || 291916 || 285505 || 97.8%
|}
 
== పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణలు==
{{main|తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు}}
జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 34 లక్షల మంది పైచిలుకు, 2016లో కోటీ 28 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.<ref>[http://web.archive.org/save/http://apfootfall.viswagnan.com/web/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)</ref> జిల్లా 2016, 17 సంవత్సరాల్లో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించిన జిల్లాల్లో 5వ స్థానం పొందింది.
 
# [[అంతర్వేది]]
# [[అన్నవరం]]
# [[ద్రాక్షారామం]]
# పవనగిరి గృప్ ఆఫ్ టె౦పుల్స్ ([[అడ్డతీగల]])
# [[ద్వారపూడి]]
# [[తలుపులమ్మ లోవ]]
# [[సామర్లకోట]]
# [[పిఠాపురం]]
# [[పాపి కొండలు]]
# పింజరికొండ జలపాతం అడ్డతీగల
 
== క్రీడలు ==
ఆంధ్ర ప్రదేశ్ లో చాలా వరక్కు ఆటలను మనం గమనించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ "కబాడీ". తూర్పుగొదావరి జిల్లా యొక్క క్రీడ "కో-కో".
 
== ప్రముఖవ్యక్తులు==
* [[కందుకూరి వీరేశలింగం పంతులు]]
* [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]]
* [[గంటి మోహనచంద్ర బాలయోగి]]
* [[బోయి భీమన్న]]
==ఇవి కూడా చూడండి==
* [[తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు]]
 
== బయటి లింకులు ==
{{commons category|East Godavari district}}
* [http://www.eastgodavari.nic.in తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్ సైటు]
* [http://www.aponline.gov.in/Quick%20links/apfactfile/info%20on%20districts/eastgodavari.html ఏపీ ఆన్‌లైన్‌లో తూర్పు గోదావరి గురించి]
* [http://eenadu.net/district/inner.aspx?dsname=Eastgodavari&info=eaghistory ఈనాడు జాలస్థలిలో జిల్లావివరాలు]
 
== మూలాలు ==
<references />
{{ఆంధ్ర ప్రదేశ్}}
{{గోదావరి పరీవాహకం}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు]]
[[వర్గం:కోస్తా]]