మెట్రిక్ పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

ఈ వారం వ్యాసం పరిగణన మూస వ్యాసంలో ఉండరాదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Metric system adoption map.svg|thumb|{{legend|green|అధికారికంగా మెట్రిక్ పద్ధతి అవలంబిస్తున్న దేశాలు}}
{{legend|gray|అధికారికంగా మెట్రిక్ పద్ధతి అవలంబించని దేశాలు (యునైటెడ్ స్టేట్స్, మయన్మార్ మరియు లైబీరియా)}}]]
'''[[మెట్రిక్ పద్ధతి]]''' ('''Metric system''' - '''మెట్రిక్ సిస్టమ్''') అనేది [[మీటరు]] ఆధారంగా [[పొడవు]], [[గ్రాము]] ఆధారంగా [[ద్రవ్యరాశి]] లేదా [[భారము]], మరియు [[లీటరు]] ఆధారంగా ఉరువు ([[వాల్యూమ్ఘనపరిమాణము]]) తో కొలిచే ఒక పద్ధతి.<ref>{{cite web |title=Oxford Dictionaries |url=http://www.oxforddictionaries.com/us/definition/american_english/metric-system?q=metric+system}}</ref>
 
 
==కొలతలు, కొలమానాలు, లెక్కింపు పద్ధతులు==
 
ఆధునిక శాస్త్రం జోడు గుర్రాల [[బండి]] లాంటిది. వీటిలో ఒక గుర్రం పేరు వాదం (theory), రెండవ గుర్రం పేరు ప్రయోగం (experiment). ప్రయోగం ద్వారా ఋజువు చెయ్యలేని వాదం వీగి పోతుంది. వాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుంది?మొదలవుతుందంటే, ఒకరికి మెదడులో ఒక చిరు ఆలోచన పుడుతుంది. ఆ చిరు ఆలోచనలో కాసింత సత్యం ఉందేమోనన్న భావం బలపడితే దానిని ఇంగ్లీషులో థీసిస్ (thesis) అంటారు. కనుక థీసిస్ అంటే “గాఢమైన అభిప్రాయం” అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండే హైపోథసిస్ (hypothesis) అనే ఇంగ్లీషు మాట పుట్టింది. ఇంగ్లీషులో వాడుకలో తారసపడే ఒక ప్రత్యయం “హైపో” (hypo) అంటే “అడుగున” అని కానీ (ఉదా. హైపోడెర్మిక్ అంటే చర్మం అడుగున), “తక్కువ స్థాయిలో ఉన్న” అని కానీ అర్థం. కనుక హైపోథసిస్ అంటే “పూర్తిగా బలపడని ఆలోచన.” ఇలా పూర్తిగా బలపడని ఆలోచనలు ఎప్పుడు బలపడి నిలదొక్కుకుంటాయి? ప్రయోగం ద్వారా ఋజువు చేసినప్పుడు! బలపడి నిలదొక్కుకుంటాయి.
 
ప్రయోగం ద్వారా ఋజువు చెయ్యడం అంటే? ఇంటి నుండి పెద్ద బజారుకి ఎంత దూరం ఉంటుంది? ఒకటిన్నర కిలోమీటర్లు దూరం ఉంటుందేమో! ఏమో ఏమిటి, కొలిచి చూస్తే పోలా? అలా కొలిచి చూడడమే ప్రయోగం అంటే! బియ్యపు బస్తా బరువు ఎంతుంటుంది? గట్టు మీద కూర్చుని మెట్టవేదాంతం చెప్పడమెందుకు? కొలిచి చూస్తే పోలే! ఈ కొలవడాన్ని ఇంగ్లీషులో measurement అంటారు, అలా కొలువగా వచ్చిన విలువని కూడా measurement అనే అంటారు. దీనిని మనం తెలుగులో “కొలత” అంటాం. కనుక కొలవడం అంటే ఒక లక్షణానికి ఒక విలువ (value), ఒక మూర్తం (unit) ఇవ్వడం. కొలవడానికి ఒక కొలముట్టు (measuring tool) కావాలి. బరువుని కొలవడానికి త్రాసు, కాలాన్ని కొలవడానికి గడియారం, పొడుగుని కొలవడానికి గీట్ల బద్ద, వేడిని కొలవడానికి [[ఉష్ణమాపకం|తాపమాపకం]], వగైరాలు ఉన్నాయి. పొడుగుని కొలవడానికి మూర్తాలు (units) ఏమిటి? పొడుగుని (లేదా, దూరాన్ని) [[అంగుళాలు|అంగుళాల]]<nowiki/>లోను, [[గజాలు|గజాల]]<nowiki/>లోను కొలవచ్చు లేదా [[మీటర్లు|మీటర్ల]]<nowiki/>లోను, కిలోమీటర్లలోనూ కొలవచ్చు.
 
 
ప్రయోగం ద్వారా ఋజువు చెయ్యడం అంటే? ఇంటి నుండి పెద్ద బజారుకి ఎంత దూరం ఉంటుంది? ఒకటిన్నర కిలోమీటర్లు దూరం ఉంటుందేమో! ఏమో ఏమిటి, కొలిచి చూస్తే పోలా? అలా కొలిచి చూడడమే ప్రయోగం అంటే! బియ్యపు బస్తా బరువు ఎంతుంటుంది? గట్టు మీద కూర్చుని మెట్టవేదాంతం చెప్పడమెందుకు? కొలిచి చూస్తే పోలే! ఈ కొలవడాన్ని ఇంగ్లీషులో measurement అంటారు, అలా కొలువగా వచ్చిన విలువని కూడా measurement అనే అంటారు. దీనిని మనం తెలుగులో “కొలత” అంటాం. కనుక కొలవడం అంటే ఒక లక్షణానికి ఒక విలువ (value), ఒక మూర్తం (unit) ఇవ్వడం. కొలవడానికి ఒక కొలముట్టు (measuring tool) కావాలి. బరువుని కొలవడానికి త్రాసు, కాలాన్ని కొలవడానికి గడియారం, పొడుగుని కొలవడానికి గీట్ల బద్ద, వేడిని కొలవడానికి తాపమాపకం, వగైరాలు ఉన్నాయి. పొడుగుని కొలవడానికి మూర్తాలు (units) ఏమిటి? పొడుగుని (లేదా, దూరాన్ని) [[అంగుళాలు|అంగుళాల]]<nowiki/>లోను, [[గజాలు|గజాల]]<nowiki/>లోను కొలవచ్చు లేదా [[మీటర్లు|మీటర్ల]]<nowiki/>లోను, కిలోమీటర్లలోనూ కొలవచ్చు.
 
పూర్వం “ఏబలం, పదలం" వగైరా కొలమానాలు వాడేవారు. (ఏబలం అంటే 5 పలాలు, పదలం అంటే 10 పలాలు!). ఆ రోజుల్లో [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు గోదావరి]], [[విశాఖపట్నం జిల్లా|విశాఖ]] జిల్లాలలో బరువులు కొలవడానికి [[వీశ]], పదలం, ఏబలం, పౌను, [[తులం]], వగైరాలు వాడేవారు. బందరులో అర్థ సేరు, సవాసేరు, నవటాకు, చటాకు, అంటూ మరొక రకం కొలతలు వాడేవారు. ఇంజనీరింగు కాలేజీలో మెట్రిక్ పధ్ధతి అంటూ గ్రాములు, సెంటీ మీటర్లు, అంటూ మరొక కొలమానం వాడేవారు.
"https://te.wikipedia.org/wiki/మెట్రిక్_పద్ధతి" నుండి వెలికితీశారు