మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|మహబూబ్ నగర్}}
'''మహబూబ్‌నగర్''' జిల్లా, [[తెలంగాణా]] రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఒకటి.మరియు ఇది జిల్లా ముఖ్యపట్టణం.మహబూబ్ నగర్ జిల్లా ను పాలమూర్ అని కూడా పిలుస్తారు .
{{భారత స్థల సమాచారపెట్టె‎|type =district|native_name=మహబూబ్ నగర్|
|skyline =Palamuru Symbol in DIst Map.png
పంక్తి 21:
|pincode = 509001
}}
ఇది [[హైదరాబాదు]]నుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మహబూబ్ నగర్ జిల్లా ను పాలమూర్ అని కూడా పిలుస్తారు .
 
ఇది [[హైదరాబాదు]]నుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు దక్షిణాన [[తుంగభద్ర నది]], [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[నల్గొండ]] జిల్లా, ఉత్తరమున [[రంగారెడ్డి]] జిల్లా, పశ్చిమమున [[కర్ణాటక]] లోని [[రాయచూరు]], [[గుల్బర్గా]] జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య దిశలో [[హైదరాబాదు]] జిల్లా ఉంది. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006, పేజీ 233</ref> రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. [[కృష్ణానది|కృష్ణా]] మరియు [[తుంగభద్ర నది|తుంగభద్ర]] నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచిన[[ఆలంపూర్]]<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133</ref>, [[మన్యంకొండ]], [[కురుమూర్తి]],మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఊర్కొండపేట, [[శ్రీరంగాపూర్]] లాంటి పుణ్యక్షేత్రాలు, [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి]], [[బీచుపల్లి]], వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు|జూరాల]], [[కోయిలకొండ]]కోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 247</ref>) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన [[గద్వాల]] కోట, [[కోయిలకొండ కోట]], [[చంద్రగఢ్ కోట]], పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. [[సురవరం ప్రతాపరెడ్డి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[పల్లెర్ల హనుమంతరావు]] లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, [[గడియారం రామకృష్ణ శర్మ]] లాంటి సాహితీవేత్తలు, [[సూదిని జైపాల్ రెడ్డి]], సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. [[ఎన్.టి.రామారావు]]ను సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది.కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడె తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు ప్రసిద్ధిచెందిన [[నారాయణపేట]], చేనేత వస్త్రాలకు పేరుగాంచిన [[రాజోలి]], కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, [[మామిడి]]పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, [[రామాయణం|రామాయణ]] కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన [[తంగడి]] ప్రాంతం<ref>పాలమూరు వైజయంతి, 2013</ref> ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]].
 
==భౌగోళికం==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
[[దస్త్రం:Mahbubnagar mandals outline.svg|left|200px260x260px|<center>మహబూబ్‌నగర్ జిల్లా</center>|alt=|కుడి]]
భౌగోళికంగా ఈ జిల్లా [[తెలంగాణ]] ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. 16°-17° ఉత్తర అక్షాంశం మరియు 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది.<ref>http://mahabubnagar.nic.in/nic/nic/index.php</ref> 18432 చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాకు దక్షిణంగా [[తుంగభద్ర నది]] సరిహద్దుగా ప్రవహిస్తున్నది. [[కృష్ణా నది]] కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి [[ఆలంపూర్]] వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా [[ఉత్తరం|ఉత్తర]], [[దక్షిణం]]గా 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) [[జాతీయ రహదారి]] మరియు [[సికింద్రాబాదు]]-[[ద్రోణాచలం]] రైల్వే లైను వెళ్ళుచున్నది. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. [[2001]] [[జనాభా]] గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35,13,934<ref>Handbook of Statistics, Mahabubnagar Dist-2009, published by CPO Mahabubnagar</ref>. జిల్లా వాయువ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు [[నల్లమల అడవులలో]] భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, [[జూరాలాప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు|జూరాల]], దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి.
 
==చరిత్ర==
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం [[పాలమూరు]] (Palamooru) అని [[రుక్మమ్మపేట]] (Rukmammapeta) అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, [[1890]]నందు1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ [[మహబూబ్ ఆలీ ఖాన్]] అసఫ్ జా ([[1869]] - [[1911]]) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది. క్రీ.శ. [[1883]]నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా ఉంది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని '''చోళవాడి''' (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన [[కోహినూర్]] వజ్రం మరియు [[గోల్కొండ]] వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు<ref name="mahabubnagar.nic.in">http://mahabubnagar.nic.in/history.html</ref>.
 
ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. జిల్లాలోని ప్రముఖ సంస్థానాలలో [[గద్వాల సంస్థానము|గద్వాల]], [[వనపర్తి సంస్థానము|వనపర్తి]], [[జటప్రోలు సంస్థానము|జటప్రోలు]], [[అమరచింత సంస్థానము|అమరచింత]] మరియు [[కొల్లాపూర్ సంస్థానము|కొల్లాపూర్]] సంస్థానాలు ప్రముఖమైనవి. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.
Line 52 ⟶ 53:
స్వాతంత్ర్యానికి పూర్వం [[1930]] దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అధ్యక్షత వహించారు. 1930లో [[మెదక్]] జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు [[సురవరం ప్రతాపరెడ్డి]] అధ్యక్షత వహించగా, [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. [[1936]]లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని [[ఫరూఖ్ నగర్|షాద్‌నగర్]] లోనే జరిగింది.
 
[[1956]]లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లానుంచి పలు ప్రాంతాలు విడదీసి, సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. జిల్లానుంచి [[పరిగి (వికారాబాద్)|పరిగి]] తాలుకాను విడదీసి హైదరాబాదు జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా)కు కలిపినారు. పశ్చిమాన ఉన్న [[రాయచూరు]] జిల్లా నుంచి [[గద్వాల]], ఆలంపూర్ తాలుకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాకు జతచేశారు. [[కర్ణాటక]]లోని [[గుల్బర్గా]] జిల్లా నుంచి కోడంగల్‌ను ఇక్కడ విలీనం చేశారు.
 
[[1958]]లో కల్వకుర్తి తాలుకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేయబడింది. [[1959]]లో [[రంగారెడ్డి జిల్లా]] లోని కొన్ని గ్రామాలు షాద్‌నగర్‌కు బదిలీ చేయబడ్డాయి. 1959 నాటికి జిల్లాలో 11 తాలుకాలు ఏర్పడ్డాయి. [[1986]]లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలుకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా భౌగోళికంగా పెద్దదిగా ఉన్నందున కోడంగల్ నియోజకవర్గంలోని మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. [[జూన్ 2]], [[2014]]న తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో ఈ జిల్లాలో తెలంగాణలో అంతర్భాగంగా కొనసాగుతోంది.