రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

చి 103.69.77.30 (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 24:
'''[[రాజమహేంద్రవరం]]''' (మార్పుకు మందు‌‌:'''రాజమండ్రి''') [[తూర్పు గోదావరి]] జిల్లాలో [[గోదావరి]] నది ఒడ్డున ఉన్న ఒక నగరం. రాజమహేంద్రవరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ''ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని'' అని కూడా అంటారు.<ref name=profile>{{cite web|title=Introductory|url=http://rajahmundrycorporation.org/|publisher=Rajahmundry Municipal Corporation|accessdate=3 September 2014}}</ref> రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది. గోదావరి నది [[పాపి కొండలు]] దాటిన తరువాత [[పోలవరం]] వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న [[ధవళేశ్వరం]] దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ పుణ్యస్థలిలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది [[పుష్కరాలు]] ఘనంగా జరుగుతాయి. ఈ నగరం [[తూర్పుచాళుక్య]] రాజైన [[రాజరాజనరేంద్రుడు]] పరిపాలించిన చారిత్రక స్థలం మరియు ఆ రాజ్యపు రాజధాని. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరి పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును [[రాజమహేంద్రవరము]]గా మార్చడమైనది.
 
== నగర చరిత్ర ==
1
[[దస్త్రం:Portrait of Rajaraja Narendrudu.JPG|thumbnail|రాజరాజ నరేంద్రుడి చిత్రపటం]]
[[File:Chalukya vaibhavam.jpg|thumb|రాజమండ్రి నగర సాంస్కృతిక, చారిత్రిక ప్రాధాన్యతను వివరిస్తూ నగర రైల్వేస్టేషన్లో వేసిన [[కుడ్యచిత్రాలు|కుడ్యచిత్రం]]]]
రాజమహేంద్రిని [[రాజరాజ నరేంద్రుడు]] రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతారు. రాజరాజ నరేంద్రుని పూర్వపు రాజుల చరిత్రాధారాలు లేకపోవడం వలన వీరి గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒక కథనం ప్రకారం 919-934 సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆయన తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు (945-970) రాజమహేంద్రిని పరిపాలించారని చెబుతారు. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత సంపాదించుకొంది. నరేంద్రుని పరిపాలనలో [[కవిత్రయం]]లో మెదటివారైన [[నన్నయ్య]] శ్రీ మహాభారతాన్ని తెనుగించడం ప్రారంభించారు. ఈ మహారాజు తరువాత [[విజయాదిత్యుడు]] (1062-1072), కుళోత్తుంగ చోళుడు, రాజరాజవేంగి-2 రాజమహేంద్రిని పరిపాలించారు. [[కాకతీయులు|కాకతీయ]] సామ్రాజ్యంలో రాజమహేంద్రికి ప్రముఖస్థానం ఉంది. 1323లో [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఇప్పటి రాజమహేంద్రవర నడిబోడ్డులో ఉన్న మసీదు తుగ్లక్ పరిపాలనాకాలంలో తూర్పుచాళుక్యులచే నిర్మించబడ్డ వేణుగోపాలస్వామివారి ఆలయ స్థానంలో నిర్మించబడింది. ఆ తరువాత రెడ్డి రాజులు (1353-1448) తుగ్లక్ కు వ్యతిరేకంగా ఉద్యమించి గెలిచారు. ఆ తరువాత కపిలేశ్వర గజపతి, [[బహమనీ సుల్తానులు]], పురుషోత్తమ గజపతి, [[శ్రీకృష్ణదేవరాయలు]], [[ప్రతాపరుద్ర గజపతి]] వంటివారు రాజమహేంద్రిని పరిపాలించారు.
[[File:Rajahmundry Rly.Stn..JPG|thumb|left|రాజమండ్రి రైల్వే స్టేషను]]
 
== స్థల పురాణము ==
1
శ్రీ చక్ర విలసవము అను గ్రంథములో [[శ్రీ చక్రం|శ్రీ చక్ర]] అవిర్భావము గురించిన రెండు పౌరాణిక గాథలలోని రెండవ కథ ఈ విధముగా చెప్పబడింది. ఈ కథ బ్రహ్మాండ పురాణమునకు చెందినది. భండాసురుని జయించుటకై శ్రీదేవిని ఉద్దేశించి [[ఇంద్రుడు]] మహా యజ్ఞము చేసెను. ఆ [[యజ్ఞము]]<nowiki/>న దేవతలు తమతమ శరీరమాంసములను కోసి హోమద్రవ్యముగా నొసగిరి. దేవతల త్యాగమునకు సంతోషించిన [[శ్రీదేవి]] కోటిసూర్య సమమైన తేజముతోను, కోటిచంద్ర శీతలమయూఖములతోను ఆ హోమాగ్ని మధ్యమున ప్రత్యక్షమయ్యెను. [[శ్రీదేవి]] జ్యోతీరూపమైన శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమైనది. (ఈ వృత్తాంతమునే లలితాసహస్రనామావళిలో 'చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా' (4,5 నామములు) అనునవి వెల్లడించుచున్నవి. ఈ వృత్తాంతసందర్బమైన యజ్ఞము నేటి గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరమున గల [[కోటిలింగాల|కోటిలింగ]] క్షేత్రమున జరిగినదనియూ అక్కడే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయిందని స్థలపురాణము.).
 
==సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు