రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
1
 
1
==నగరంలో ముఖ్య ప్రదేశాలు==
[[ఫైలు:Paul chowk kamdukuri veeresalingam.JPG|right|thumb|కోటిపల్లి బస్సు నిలయం వద్ద నున్న కందుకూరి వీరేశలింగం పంతులు]]
పాల్ చౌక్ ఈ ప్రదేశం ఇప్పటి కోటిపల్లి బస్సు నిలయం ఉన్న ప్రదేశం క్రిందకు వస్తుంది. 1907 సంవత్సరం ఏప్రియల్ మాసంలో బిపిల్ చంద్ర పాల్ ఈ ప్రదేశంలోనే ఐదు రోజులు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పటీకి ఆ సంఘటనాను నగరం 50-60 వయస్సు గల ప్రజలు గుర్తు చేసుకొంటుంటారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రదేశాన్ని పాల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఇప్పుడు జెట్టి టవర్స్, కోటీపల్లి బస్సు నిలయం, మూడు పార్కులు ఉన్నాయి. ఈ ప్రదేశం కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం మరియు [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రదేశం నగరంలో ఒక ముఖ్య కూడలి. ది.6-5-1929 రాత్రి గం. 7-50 కు మహాత్మా గాంధీజీ పాల్ చౌక్ కు చేరుకుని ప్రసంగించారు. ఇక్కడ నుండి పశ్చిమం వైపు పోతే రోడ్డు రైలు వంతెన వస్తుంది, తూర్పు వైపు వెళ్ళితే రాజమండ్రి [[బస్సు]] కాంపెక్స్ వస్తుంది, ఉత్తరం వైపు వెళ్ళితే శ్యామలా సినిమా ధీయేటర్, ఇంకా ముందుకు వెళ్తే పొట్టి శ్రీరాములు విగ్రహం, రాజమండ్రి మెయిన్ రోడ్డు వస్తుంది. దక్షిణం వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం, [[దూరవాణి]] కేండ్రం (టెలిఫోన్ భవన్) రాజమండ్రి జూనియర్ కళాశాల, రాజమండ్రి రైలు స్టేషను వస్తుంది. ఈ పాల్ ఉన్న ప్రదేశంలోనె మూడు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో స్వాతంత్రత్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి.
 
=== ఇన్నీసుపేట ===
1865 సంవత్సరంలో అప్పటి సబ్ కలక్టర్ ఇన్నిసిన్ ద్వార వలస స్థావరంగా ఏర్పాటు చెయ్యబడింది. ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి రాజమండ్రి జూనియర్ కాలేజి వరకు. 1910 సంవత్సరం తరువాత నుండి ఇప్పటి వరకు ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి వీరేశలింగం థియోలాజికల్ కళాశాల వరకు విస్తరించబడింది.
 
=== ఆల్కాట్ గార్డెన్స్ ===
ఒకప్పుడు దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపలు, సమావేశాలు జరిగే ఈ ప్రదేశం దివ్య సమాజ నాయకుడైన ఆల్కాట్ పేరు మీద పెట్టబడింది.
దివ్యజ్ఞాన సమాజమ్
 
=== రామదాసు పేట ===
జానపద గాయకుడైన యెడ్ల రామదాసు పేరు మీద ఈ ప్రాంతం పిలువబడుతోంది. యెడ్ల రామదాసు తన జానపద గేయాలలో వేదాంతాన్ని, అహింసావాదాన్ని వ్యాప్తి చేశాడు. రామదాసు పేట [[కోరుకొండ]] రోడ్డు మీద టి.బి.శ్యానిటోరియం - క్వారీకి మధ్య వస్తుంది. ఈ ప్రదేశం లో ఈ గాయకుడి సమాధి కనిపిస్తుంది. ఈయన టి.బి.శ్యానిటోరియం లోనే క్షయ వ్యాధిగ్రస్తుల మధ్య నివసించేవాడు.
 
=== ఆర్యాపురం ===
1895 సంవత్సరంలో అప్పటి సబ్ కలక్టర్ లిస్టర్ ఈ ప్రభుత్వ స్థలాన్ని మూడు వీధులు వచ్చేటట్లు 130 ఇళ్ళ స్థలంగా విభజించాడు. తొంభై శాతం ఇక్కడ నివసించేవారు పూజారులు. ఈ ప్రదేశానికి లిస్టర్ పేట అని పేరు పెట్టబడింది, ఈ ప్రాంతంలో ఆర్యులు లేక పండితులు అయిన [[బ్రాహ్మణులు]] నివసించడంతో కాలక్రమంలో ''ఆర్యాపురం''గా పేరు మార్చారు. 1890 సంవత్సరంలో ఆర్యాపురం రాజమండ్రి పురపాలక సంఘం పరిధిలోకి చేర్చబడింది. ఆర్యాపురంలో నున్న పాఠశాలకు పూర్వపు సబ్ కలక్టర్ పేరు గుర్తుగా లిస్ట్ర్ పేత మునిసిపల్ హైస్కులుగా నామకారణం చేశారు. 1910 సంవత్సరంలో ఆర్యాపురంలో డాక్టర్ ఏ.బి.నాగేశ్వర రావు ఆర్యాపురం గ్రంథాలయం ఏర్పాటు స్థాపించాడు. ఆర్యాపురంలో నున్న ఆ వీధీకి ఏ.బి.నాగేశ్వర రావు వీధిగా పేరు పెట్టారు. ఆర్యాపురం గ్రంధలాయాన్ని శ్రీ రామ బాల భక్త పుస్తక భండాగారంగా పేరు మార్చి వంకాయయల వారి వీధికి మార్చబడింది. 1935 సంవత్సరంలో సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నిర్మించబడింది. ఇప్పటికి ఈ అర్యాపురం వాసస్థులు ఎక్కువ మంది బ్రాహ్మణులు.
 
=== సీతం పేట ===
కాండ్రేగుల వంశానికి చెందిన వారిచేత ఈ ప్రదేశం పండితులకు, శాస్త్రజ్ఞులకు, పూజారులకు వారి తల్లి ''సీతమ్మ'' జ్ఞాపకార్థం ఇవ్వబడింది. అందువలన ఈ ప్రదేశాన్ని సీతంపేట అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఒక చెఱువు ఉండేది, దానిని సీతమ్మ చెఱువు అని పిలిచేవారు, ఆ చెఱువు ఇప్పటి కాలంలో ఒక ఉద్యానవనంగా మార్చబడింది. ఇచ్చట పేపర్ మిల్ కలదు అ ప్రదేశానికి పేపర్ మిల్ వారి సహకారముతో ఈ సీతం పేట అభివృద్ది చెందుతున్నది. రాజమండ్రి నగర పాలక సంస్థ వారు మరియు రెవెన్యు వారు ఈ సీతం పేట మరచినారు.ఆధ్యాత్మికంగా ప్రసిద్ద చెందిన [[అవతార్ మెహెర్ బాబా]] సెంటర్ ఇక్కడనే గుమ్మిడాలవారి వీధిలో రామాలయం దగ్గర ఉన్నది. జనవరి 31 న అమర తిధి, ఫిబ్రవరి 10 న, జన్మదినము జూలై 10న మౌన దినము జరుగును.
 
=== జాంపేట ===
[[విశాఖపట్నం|విశాఖపట్టణం]] జిల్లా జామి ప్రదేశములో కరువు కాటకాలు రావడంతో అక్కడ నివసించే చేనేత వృత్తిగా కలవారు ఈ ప్రదేశానికి వలస వచ్చారు. రాజమండ్రి పురపాలక సంఘం గౌవ గార్డెన్స్ అనే ప్రదేశాన్ని కొనుగోలు చేసి ఇళ్ళ స్థలాలుగా విభజించి వీరికి అమ్మింది. అందువలన ఈ ప్రదేశాన్ని జాంపేట అని పిలిచేవారు. ఇప్పటికీ వారి వారసులే ఎక్కువగా నివాసం వుంటున్నారు. కాని ఇప్పుడు ఈపేటలో ఒక్క మగ్గం కూడా లేదు. వీరంతా ఎక్కువగా వస్త్రవ్యాపారంలో స్దిరపడ్డారు. జాంపేట కూడలిలో ఉన్న [[మహాత్మా గాంధీ]] విగ్రహాన్ని, ఆంధ్ర కేసరి [[టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి చేత ఆవిష్కరింబడింది.
 
=== దానవాయిపేట ===
ఈ ప్రదేశం యొక్క చరిత్ర సరిగ్గా లభించడం లేదు. రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మెదటి అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం రజక నాయకుడైన ''దానయాయి'' పేరు మీద పెట్టబడిందని అని చెబుతారు. ''దానవాయి'' దానవాయిగుంట అనే చెఱువు త్రవ్వించాడు. రెండవ అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఉండేది మరియు ఇక్కడ సైనికుల నివసించేవారు అందువల్ల ''దాళవాయి'' అయ్యిందని, అది క్రమంగా దానవాయిపేటగా మారింది అని చెబుతారు. దానవాయిపేట రాజమండ్రిలో ఒక ప్రముఖ స్థలం దానవాయిపేటలో మూడు ప్రధాన వీధులు ఉన్నాయి, నగరంలో ఒక ప్రముఖ ప్రదేశం వ్యాపార కేంద్రాల కార్యాలయకు. ఇక్కడ దానవాయి పేట ఉద్యానవనం కూడా ఉన్నది.
 
ఈ విశాల ప్రపంచంలో ప్రాణికోటిని సృష్టిస్తున్న క్రమంలో ఆ భగవంతుడు దోమల్ని కూడా సృష్టించి భూమ్మీదకు వదులుతుండగా` ‘ఇంత చిన్నప్రాణులం. ఇంత పెద్ద మనుషుల మధ్య, జంతువులమధ్య మేం ఎలా బతికేది?‘అంటూ దోమలు భగవంతుడ్ని అడిగాయి. అప్పుడు ఆ దేవుడు`’ మూసీనదీతీరంలో అభయారణ్యంలో జీవించమని ఆదేశించాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దోమలు గూడుకట్టుకున్న ప్రాంతం కావడంతో ఆ అడవి ప్రాంతం ‘దోమలగూడ’గా ప్రసిద్ధికెక్కింది. క్రమక్రమంగా దోమజాతి వృద్ధి చెందడంతో మరో సురక్షిత ప్రదేశం కోసం అన్వేషిస్తూ కొన్ని దోమలు గోదావరీనదీ తీరం చేరుకున్నాయి. అక్కడ నివశించే ప్రజల్ని చూడగానే దోమలకు ఉత్సాహం ముంచుకొచ్చి జనాన్ని కుట్టివాయించేశాయి, దోమలు వాయించే ప్రాంతం కావడంతో ఆ ప్రాంతం ‘దోమవాయిపేట’గా పిలవబడిరది.ఆ తర్వాత కాలంలో అదే దానవాయిపేటగా రాజమండ్రిలో ఓ భాగమైతే`దోమల గూడ హైదరాబాద్‌లో ఓ ముఖ్య ప్రాంతంగా విరాజిల్లుతోంది.
 
=== నాగుల చెరువు ===
ఇప్పటి మున్సిపల్ స్టేడియం ఉన్న ప్రదేశాన్ని నాగుల చెరువు అని పిలిచేవారు. ఒక శతాబ్ధానికి పూర్వం నాగుల అనే పేరు గల వ్యక్తి సామాన్య జనాల కొరకు ఇక్కడ ఒక చెరువు త్రవ్వించాడని ఆయన పేరు మీద ఈ ప్రదేశాన్ని నాగుల చెరువు అని పిలిచేవారు. 1955 సంవత్సరం రాజమండ్రి ఛైర్మన్ గా ఎన్నికైన క్రీడాకారుడు పోతుల వీరభద్ర రావు ఈ ప్రదేశంలో 1956 సంవత్సరంలో ఒక క్రీడాప్రాంగ్రణం నిర్మాణం జరిపించాడు. ఈ క్రీడాప్రాంగణం కేంద్ర మంత్రి ''సురిత్ సింగ్ మజిగ్య'' ఫుట్ బాల్ ఆటతో ప్రారంభించాడు. ఇప్పుడు ఈ ప్రదేశంలో ఉన్న మార్కెట్ ని నాగుల చెరువు మార్కెట్ అనిపిలుస్తారు.
 
=== రంగరాజు పేట ===
1870 ప్రాంతంలో ఈ ప్రదేశంలో [[రాజస్థాన్]] [[మహారాష్ట్ర]] నుండి ప్రజలు వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశం ఇప్పటి కోట గుమ్మ వద్ద ఉంది. వలస వచ్చిన ప్రజలు అద్దకం వృత్తి మరియు కుమ్మర వృత్తి చేసేవారు. వీరు బోంధిలి మతానికీ చెందినవారు. భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన '''రత్నం కలాలు (రత్నం పెన్నులు)''' పరిశ్రమ మరియు ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.
 
=== వీరభద్రపురం ===
1910 సంవత్సరంలో కంభాల చెరువు వద్ద నున్న 100 ఎకరాల స్వంత స్థలాన్ని దువ్వురి వీరభద్ర రావు అనే వ్యక్తి ఇళ్ళ స్థలాలుగా విభజించి [[బ్రాహ్మణులు|బ్రాహ్మలకు]] అతి తక్కువ వెలకి, రజకులకు, విశ్వబ్రాహ్మణులకు ఉచితంగా ఇచ్చాడు. ఆ మహామనీషీ జ్ఞాపకార్థం ఈ ప్రదేశాన్ని వీరభద్రపురం అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఇప్పటి సుభాష్ నగర్, లలితనగర్లోకి వస్తుంది. 1930 సంవత్సరంలో ఇక్కడ నివసించే ప్రజలు రాజమండ్రి పురపాలక సంఘం పరిధిలోకి చేరడానికి నిరాకరించారు. కాని తరువాత ఈ ప్రాంతం పురపాలక సంఘం పరిధిలోకి వచ్చింది. వీరభద్ర రావు కంభాల చెరువు వద్ద ఉన్న ప్రదేశాన్ని [[రామకృష్ణ మిషన్]]కి దానం ఇచ్చారు. ఈ మధ్యకాలంలో రామకృష్ణ మఠం నుండి కొంత ప్రదేశాన్ని సంగ్రహించి ఆదాయక పన్ను శాఖ తమ కార్యాలయమైన ఆయకార్ భవన్ ఏర్పాటు చేసుకొన్నారు. ఈ కూడళిని వివేకానంద చౌక్ అని పిలుస్తారు. ఇది కంభాల చెరువికి ప్రక్కన వస్తుంది. ఇప్పుడు ఉన్న రామకృష్ణ మిషన్ వారి మఠం ఉన్న ప్రదేశం కూడా దువ్వురి వీరభద్ర రావు దానం చేసిన స్థలమే.
 
=== శేషయ్య మెట్ట ===
రాజమండ్రి జిల్లా న్యాయస్థానం వెనుక ఉన్న ప్రదేశాన్ని శేషయ్య మెట్ట అని పిలుస్తారు. రాజమండ్రి పంచ గిరులమీద ఉన్నదని శేషయ్య మెట్ట ఒక గిరి అని ఇక్కడి ప్రజలు చెబుతారు. ఈ గిరి పేరు వెనుక చరిత్రకారులలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రదేశం రాజమండ్రి పరిపాలించిన మహమదీయుడైన సఏర్ షహిబ్ పేరు క్రింద వచ్చిందని కొంత మంది అంటారు. షేర్ షాహిబ్ నివాసం ఇప్పటి రాజమండ్రి పాత తపాల కార్యాలయం.
 
=== సుబ్రహ్మణ్య మైదానం ===
1947 ఆగస్టు 15 వ తారీఖు వరకు ఈ ప్రదేశాన్ని పోలిస్ పెరేడ్ గ్రౌండ్స్ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాకా ఆప్పటి కొలెనెల్ డి.యస్.రాజు ఈ ప్రదేశాన్ని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బ్రహమజోసుల సుబ్రహ్మణ్యం పేరుకి స్మారకంగా నామకరణం చేశాడు.
 
=== మెరక వీధీ ===
1565 సంవత్సరం [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]] పతనమై పోయాక చంద్రగిరి నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రదేశానికి వలస వచ్చి, ఇక్కడ తమ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశంలో ఇప్పటి టౌన్ హాలు ఉంది. ఈ వలస వచ్చిన వారు, తెలగ కులమునకు చెందిన వారు. వారి [[ఇంటి పేర్లు]] కాందల, పోతుల, ముత్తంగి, కత్తుల, యర్ర, నర్ర, నీలం, కంచుమర్తి, నడీపల్లి, భయపునంద. వీరు విజయనగర సైన్యంలో సైనికులుగా పనిచేసేవారు. ఇప్పటికి ఈ వంశానికి చెందిన కుటుంబాల వార ఇళ్ళలో యుద్ధానికి ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. ఈ వంశాల ప్రధాన దైవం వేణుగోపాలస్వామి. వేణు గోపాలస్వామి ఉత్సవ ఊరేగింపుకి వచ్చినప్పుడు ఈ వీధి గుండా ఊరేగింపు జరుగుతుంది. ఈ వంశానికి చెందినవారు చాలా వరకు శ్రీవైష్ణవులు.
 
=== శ్రద్ధానంద ఘాట్ ===
1920 సంవత్సరంలో పాత సమాచార కేంద్రం వద్ద ఈ ఘాట్ ఏర్పాటు చెయ్యబడింది. ఈ ఘాట్ ఢిల్లీలో ఉన్న ఆర్యామాంస ప్రధానాచార్యుడు శ్రద్ధానంద పేరు మీద పెట్టబడింది. ఈ ప్రదేశంలో బోస్ విగ్రహం ఇక్కడ ఉండేది. రాజమండ్రికి వరదలు వచ్చినప్పుడు ఈ విగ్రహం మునిగిపోతుండేది. 1991 సంవత్సరం [[పుష్కరము|పుష్కరాల]] ఏర్పాట్లలో ఈ విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించారు. ఆచార్య కృపాలనీ, [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]], తెన్నేటి విశ్వనాధం, కాల వేంకట రావు ఈ ప్రదేశంలో ప్రజలను ఉద్దేశించి ఉపన్యసించేవారు, ప్రజలు ఇక్కడ వినేవారు.
 
=== కోట గుమ్మం ===
[[ఫైలు:Mruthyunjayudu statue Fort gate.jpg|right|thumb|కోట గుమ్మం వద్ద నున్న మృత్యుంజయుడి విగ్రహం]]
కోట గుమ్మం గోదావరి రైలుస్టేషను వద్ద ఉన్న ప్రదేశం. కోట గుమ్మం వద్దనే మృత్యుంజయుడి విగ్రహం, అమరజీవి [[పొట్టి శ్రీరాములు]] విగ్రహం, అజంతా హొటలు ఉన్న ప్రదేశాన్ని కోట గుమ్మం అని పిలుస్తారు. ఈ రోజుల్లో ఇక్కడ కోట గుమ్మం కాని లేక గోడ ఏమి కనిపించదు కాని పాక్షికంగా ప్రధాన వీధిలో కనిపిస్తుటుంటుంది, ఈ మార్గం ద్వారానే ఏనుగులు, గుర్రాలు గోదావరి నదికి వచ్చి స్నానం చెయ్యడానికి వెళ్ళేవి. ఈ కోట గోడ రెండు వైపుల వాలుగా ఉంటుంది. ఇక్కడ [[ఆర్థర్ కాటన్]] కుమార్తె సమాధి ఉంది. 1897-1900 సంవత్సరాల మధ్యన రాజమండ్రి గోదావరి పై మీద మొదటి రైలు వంతెన (హేవలాక్ వంతెన) కట్టేటప్పుడు ఈ కోట గుమ్మాన్ని బ్రద్దలు కొట్టారని చెబుతారు. ఈ కోట [[చాళుక్యులు]] 8-11 వ సతాబ్ధాలమధ్య నిర్మించబడినదని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఇప్పుడు కందకం వీధి కనిపిస్తుంది. కందకం = పెద్ద కాలువ. గోదావరి నుండి త్రవ్వబడిన ఒక పెద్ద కాలువ. ఈ కందకం శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అడ్డంగా ఈ కాలువ ఉండేది. 20 అడుగులు లోతు, 50 అడుగుల వెడల్పు ఉండేది.
 
=== కంభం సత్రం కంభాల చెరువు ===
చనిపోయిన తరువాత శాద్ధ్రాలు జరిపే సత్రం. 1845-1850 సంవత్సరాల మధ్య కంభం నరసింగ రావు పంతులు స్వంత నిధులతో ఈ సత్ర నిర్మాణం జరిపించారు. అదేసమయంలోనే ఇక్కడ ఒక చెరువు కూడా త్రవ్వించబడింది. చెరువు త్రవ్వగా వచ్చిన మట్టితోనే ఈ సత్రానికి కావలసిన ఇటుకలు తయారుచేశారు. ఈ సత్రం ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినవారికి శాద్ధ్రాలు నిర్వహించే ఏకైక సత్రం [[కాశీ]]లో కూడా శాద్ధ్రాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా సత్రం లేదు. ఈ సత్రం శిథిలాలుగా ఉంది. ఇక్కడ ఉన్న చెరువులో నిరంతరం నీరు ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఒక క్రీడాప్రాంగణం నిర్మించాలని యోచిస్తున్నది, కాని ప్రజలు దీనికి వ్యతిరేకత చూపించడంతో ఈ చెరువు అభివృద్ధి పరచి కంభాల ఉద్యానవనం మరియు ఒక పడవ షికారు జరపడానికి ఏర్పాట్లు చేస్తోంది. [[విశాఖపట్నం]] పాత నగరంలో పిండాల సత్రం అని ఉంది. ఈ సత్రంలో శ్రాద్ధకర్మలు (పిండాలు పెట్టటం) నిర్వహిస్తారు.
 
== పౌర పరిపాలన ==
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు