రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
1
 
1
== రవాణా సౌకర్యాలు ==
=== రోడ్డు రవాణా సౌకర్యాలు ===
రాజమండ్రి [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]]ని కలిపే జాతీయా రహదారి - 5 మీద ఉంది. రాజమండ్రి నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉంది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. నగరంలో ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయంతో కలిపి, గోకవరం, కోటిపల్లి హైటెక్ బస్సుస్టాండ్,అనే మెత్తం నాలుగు బస్టాండ్లు ఉన్నాయి.
 
==== ఆర్.టి.సి. రవాణా ====
[[ఫైలు:Rajahmundry bus complex.JPG|thumb|right|రాజమండ్రి బస్సు ప్రధాన నిలయం]]
[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆర్.టి.సి.]] బస్టాండు రాజమండ్రి నుండి రాష్ట్రం నలుమూలకు నడిపే బస్సుల తోటి, ప్రైవేటు బస్సుల తోటి కలుపబడుతోంది. రాజమండ్రి బస్సు కాంప్లెక్స్ (బొమ్మ ప్రక్కన ఉన్నది) నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు, పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన [[కాకినాడ]], [[తుని]], [[అన్నవరం]], [[విశాఖపట్నం]], [[విజయనగరం]], [[శ్రీకాకుళం]], [[విజయవాడ]], [[తాడేపల్లిగూడెం]], [[ఏలూరు]], [[నిడదవోలు]],[[గుంటూరు]]కి బస్సులు సర్వీసులు ఉన్నాయి.
 
==== కోటిపల్లి బస్టాండు ====
కోటిపల్లి బస్టాండు పాల్ చౌక్ వద్ద ఉంది. గోదావరి రైలు రోడ్డు వంతెన దిగి రాజమండ్రిలో ప్రవేశించిన వేంటనే ఈ బస్టాండు వస్తుంది. ఈ బస్టాండులో రాజమండ్రి రైలు స్టేషను మీదుగా [[ధవళేశ్వరం]] వైపుగా [[రావులపాలెం]], [[అమలాపురం]] [[మండపేట]], [[రామచంద్రపురం]], [[ద్రాక్షారామం]], [[కొటిపల్లి]] వెళ్ళే ఆర్.టి.సి.బస్సులు, రైలు రోడ్డు వంతెన మీదుగా [[కొవ్వూరు]], [[నిడదవోలు]], [[పోలవరం]], [[తాడేపల్లిగూడెం]], [[తణుకు]], [[భీమవరం]], [[పాలకొల్లు]] వెళ్ళే ఆర్.టి.సి. బస్సులు ఆగుతాయి. ముఖ్యంగా ఆగేవి ఆర్.టి.సి. బస్సులు, కాని నగరంలో తిరిగే కొన్ని ప్రైవేటు బస్సులు కూడా ఆగుతాయి. ఈ బస్సునిలయాన్ని ఈ మధ్యకాలంలో [[ఐ.టి.సి]] వారి సహాయంతో ఆధునీకరించారు.
 
==== గోకవరం బస్టాండు ====
గోకవరం బస్టండులో ప్రస్తుతం రాజమండ్రిలో విలీనం చేస్తున్న పరిసర గ్రామాలూ ఐన కోరుకొండ గాడాలా,కొంతమురు, గోకవరం ఇతర ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులు మరియు ప్రైవేటు బస్సు నిలుస్తాయి. ఈ బస్సు నిలయం గోదావరి రైలు స్టేషనుకి ఆవతల, రాజమండ్రి నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉంది. ఈ బస్సు స్టేషను నుండి తిన్నగా వెళ్ళితే దేవి చౌక్, కంభాల చెఱువు వస్తుంది.
 
=== రైలు సౌకర్యం ===
{{Further|గోదావరి రైల్వే స్టేషను}}
[[ఫైలు:New godavari stn.JPG|thumb|right|క్రొత్త గోదావరి రైలు స్టేషను]]
రాజమండ్రి [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారతదేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. మెదటిది గోదావరి రైలు స్టేషను (ప్రక్కన బొమ్మ చూడండి), రెండవది రాజమండ్రి రైలు స్టేషను. గోదావరి నది మీద మెదటి రైలు వంతెన (హేవలాక్‌ వంతెన్) 1900 నిర్మించబడినప్పుడు గోదావరి రైలు స్టేషను నిర్మించారు. తరువాతి కాలంలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో రైల్వే లైను సౌలభ్యం కోసం రైలు రోడ్డు వంతెన నిర్మాణం జరిగింది. 19890-1995 సంవత్సరాల మధ్య మూడవ రైలు వంతెన నిర్మాణం జరిగింది.
 
==== గోదావరి రైల్వే స్టేషను ====
{{Further|కొవ్వూరు రైల్వే స్టేషను}}
గోదావరి రైలు స్టేషను రాజమండ్రికి మొట్టమెదటి రైల్వే స్టేషను. మెదటి రైలు వంతెన [[కొవ్వూరు రైల్వే స్టేషను|కొవ్వూరు]] నుండి బయలు చేరి గోదావరి స్టేషను వద్ద ముగుస్తుంది. ఈ రైలు వంతెన పై చివరి సారి 1996లో కోరమండలం ఎక్స్‌ప్రెస్ ని నడిపి ఈ రైలు వంతెనని మూసి వేసి రైల్వేశాఖ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది. మూడవ రైలు నిర్మాణం జరిగాక గోదావరి రైలుస్టేషను కొద్దిగా గోకవరం బస్టాండు వైపు ప్రక్కకు జరపబడింది. 2003 పుష్కరాల సమయంలో ఈ స్టేషను ఆధునీకరించబడింది. ఈ స్టేషను మీదుగా [[కొవ్వూరు]] నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ బండ్లు వెళ్తాయి కాని ప్యాసింజర్ బండ్లు మాత్రమే నిలుస్తాయి. రాజమండ్రి నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ బండ్లు మాత్రమే వెళ్తాయి మరియు ఆగుతాయి. విజయవాడ వైపు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బండ్లు రెండవ రైలు వంతెన (రైలు రోడ్డు వంతెన) మీదుగా వెళ్తాయి.
 
==== రాజమండ్రి రైల్వే స్టేషను ====
{{Further|రాజమండ్రి రైల్వే స్టేషను}}
రెండవ రైల్వే లైను సౌకర్యార్థం రోడ్డు రైలు వంతెన నిర్మాణం జరిగాక రాజమండ్రి రైల్వేస్టేషను జరిగింది. కోస్తా జిల్లాలలో [[విజయవాడ]]-[[విశాఖపట్నం]] నగరాల మధ్యనున్న ముఖ్య రైలు స్టేషను. ఈ స్టేషనులో అన్ని రైలు బండ్లు ఆగుతాయి.
 
=== విమాన సౌకర్యం ===
{{Further|రాజమండ్రి విమానాశ్రయం}}
నగర శివార్లలో ఉన్న [[మధురపూడి]]లో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉంది. ఈ మధ్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు బవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా నిర్మించారు ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వెస్ మరియు స్పైస్ జెట్ వారు [[హైదరాబాదు]], [[చెన్నై]], [[బెంగళూరు]] నగరాలకు విమానాలను నడుపుతున్నారు.
 
=== జలరవాణా సౌకర్యాలు ===
రైలు వంతెన మరియు రోడ్డు వంతెన వచ్చాక జల రవాణా మీద ప్రజలు ఆధారపడడం లేదు. కాని జలరవాణా పర్యాటక రంగం ఊపందనుకోవడం వల్ల మళ్ళీ జీవము వస్తున్నది. ఇక్కడ నుండి పాపి కొండలకు, [[భద్రాచలం]] మరియు [[పట్టిసం|పట్టిసీమ]]కు లాంచీ సదుపాయం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా లాంచీలు నడుపుతున్నారు.
 
== పరిశ్రమలు ==
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు