"అల్లూరి సీతారామరాజు" కూర్పుల మధ్య తేడాలు

1
 
1
== రాజు గురించి వివిధ అభిప్రాయాలు ==
[[బొమ్మ:Alluri postal stamp.jpg|thumb|250px|భారత తపాల శాఖ [[1986]]లో విడుదల చేసిన అల్లూరి సీతారామ రాజు స్మారక తపాలా బిళ్ల]]
*అల్లూరి సీతారామరాజు విప్లవంపై ఆనాటి పత్రికల అభిప్రాయాలు ఇలా ఉండేవి:
**కాంగ్రెస్ పత్రిక: రంప పితూరీని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది.
**స్వతంత్ర వార పత్రిక (1924 మే 13, 20): అటువంటి (రాజు) వారు చావాలి అని ప్రచురించింది.
**కృష్ణాపత్రిక: విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది.
 
అయితే రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, ''శివాజీ''గా, ''రాణా ప్రతాప్‌''గా, ''లెనిన్‌''గా కీర్తించాయి. రాజు '''వీర స్వర్గమలంకరించాడ'''ని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును ''జార్జి వాషింగ్టన్''తో పోల్చింది.
 
[[1929]]లో [[మహాత్మా గాంధీ]] ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు:
:శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. - (యంగ్ ఇండియా పత్రిక - 1926) <ref>http://www.archive.org/details/allurisitaramara025767mbp</ref>
 
సుభాష్ చంద్ర బోస్-
:సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. .... భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక.
 
"సీతారామరాజు" [[బుర్రకథ]] ముగింపులో ఇలా ఉంది -
:'''శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది''' <ref>[http://www.archive.org/details/allurisitaramara025767mbp విప్లవజ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు బుఱ్ఱకథ] - కూర్పు: పి.దుర్గారావు</ref>
 
==ఇవి కూడా చూడండి==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2526603" నుండి వెలికితీశారు