"రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు" కూర్పుల మధ్య తేడాలు

}}
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు.
==దాతృత్వం==
ఇతడు తన తండ్రిచేత స్థాపించబడిన [[పిఠాపురం]] హైస్కూలు, కాకినాడ కాలేజీలను అమితమైన ధనం వెచ్చించి అభివృద్ధి చేసి దక్షిణ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి విద్యాసంస్థలు మరొకటి లేదనిపించాడు. కాకినాడ కాలేజీని ఫస్ట్ గ్రేడ్‌గా ఉద్ధరించి ఎన్నో భవనాలను కట్టించాడు. ఆ కాలేజీలో చదివే స్త్రీలకు, పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాడు. అంతే కాకుండా పట్టభద్రులై విదేశాలకు వెళ్లి, ఉన్నతవిద్య పొందగోరేవారికి సంపూర్ణ ధనసహాయం చేశాడు. [[పిఠాపురం]] హైస్కూలులో హరిజన విద్యార్థినీ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని నెలకొల్పి దానికయ్యే వ్యయాన్ని అంతా తానే భరించాడు. వారికి ప్రైవేటు టీచర్లను కూడా ఏర్పరిచి అనేకమందిని వృద్ధిలోనికి తీసుకువచ్చాడు. [[రాజమండ్రి]] లోని వీరేశలింగోన్నత పాఠశాల ఇతని పోషణతోనే నడిచింది. [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]] ప్రేరణతో [[కాకినాడ]]లో బ్రహ్మసమాజ ప్రార్థనామందిరాన్ని, అనాథశరణాలయాన్ని ఏర్పాటు చేశాడు. రాణీ చిన్నమాంబాదేవి కోరికపై కాకినాడ లేడీస్ క్లబ్‌కు 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చాడు. రాణీ ఆధ్వర్యంలో [[పిఠాపురం]]లో ఘోషా స్కూలును నడిపాడు. [[1920]] ప్రాంతములో విశ్వకవి [[రవీంద్రనాథ టాగూరు]] [[పిఠాపురం]] సందర్శించినప్పుడు ఇతడు సుమారు లక్షరూపాయలు పారితోషికంగా ఇచ్చాడు. ప్రాచ్య, పాశ్చాత్య విద్యలను సమదృష్టితో గౌరవించి వాటి అభివృద్ధికై ఎంతో ధనాన్ని వెచ్చించాడు. ఇతని ఔదార్యముతోనే తెలుగుదేశములోని ఆనాటి ప్రతి సాహిత్యసంస్థ అభివృద్ధిని చెందింది. ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజము, విజ్ఞానచంద్రికా మండలి, ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలలకు విశేషమైన ధనసహాయం చేశాడు. [[జయంతి రామయ్య]] స్థాపించిన ఆంధ్రసాహిత్య పరిషత్తును ప్రోత్సహించి సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణానికి కారకుడైనాడు. అంతే కాకుండా ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిషత్తు ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి ముద్రింపజేశాడు.
 
==సూర్యరాయాంధ్ర నిఘంటువు==
[[దస్త్రం:Rao Venkata Kumara Mahipati Surya Rao.jpg|thumbnail|150px| సూర్యారావు తైలవర్ణపటం]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2527297" నుండి వెలికితీశారు