పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

rv
పంక్తి 1:
'''పిఠాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 533450.
==ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర ==
 
ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో పిఠాపుర<nowiki/>ము అను గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము... 20 తేదివుదయాన నాలుగున్నరగంటలకు భయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము గయాసుర [[రాజధాని]]<nowiki/>గా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ ఒక [[చెరువు|తటాక]] మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున ఒక చిన్న [[శివాలయము]]<nowiki/>న్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో ఒకపాడుకూపములో అష్టాదశపీఠములతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు.
 
యీ వూళ్ళో యిన్నూరు బ్రాహ్మణయిండ్లు ఉన్నాయి. వారందరు తీర్ధవాసులుగా [[యాచకులు|యాచక]]<nowiki/>వృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపకమయిన జీవనము లేని [[బ్రాహ్మణుడు]] లేడు. యీ దినము [[తొలిఏకాదశి]]. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప [[పండుగ|పండగ]]<nowiki/>గా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, [[భోజనము]]లు కాచేసుకున్నందున గయాతీర్ధములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.
 
యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులు నీలాద్రిరాయనింగారి కుటుంబస్థులు ఒక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన [[వీధులు]] కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిన దారి కొంతమేర [[అడుసు]] నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, [[మొగిలి]]చెట్లు, [[జెముడు]], యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.''
 
== చరిత్ర ==
[[సముద్ర గుప్తుడు]] [[అలహాబాదు]] శాసనములో పిఠాపురము నాలుగో శతాబ్దపు తొలిపాదములో ఒక రాజధానిగా ఉండినట్లు తెలుపబడి యున్నది. పిఠాపురములోని దొరికిన [[జైన]] విగ్రహముల మీది ఉపవాస క్లేశ చిహ్నాలు, వాటి రొమ్ము మీద ఉన్న కొన్ని గాడులూ, [[తాటిపాక]] విగ్రహములు, పెనుమంచిలి చౌముఖములు మొదలైనవి అన్నీ కోన రాజ్యము ఏర్పడిన 12 వ శతాబ్దము ప్రారంభము తరువాతవని తెలియుచున్నవి. వీటిని బట్టి పిఠాపురము గర్భములో చాలా చరిత్ర ఉన్నట్లు తెలియుచున్నది.దీనిని '''పిష్ఠపురం''' అని కూడా అనేవారు.
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు