"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

rv
(rv)
'''[[రాజమహేంద్రవరం]]''' (మార్పుకు మందు‌‌:'''రాజమండ్రి''') [[తూర్పు గోదావరి]] జిల్లాలో [[గోదావరి]] నది ఒడ్డున ఉన్న ఒక నగరం. రాజమహేంద్రవరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ''ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని'' అని కూడా అంటారు.<ref name=profile>{{cite web|title=Introductory|url=http://rajahmundrycorporation.org/|publisher=Rajahmundry Municipal Corporation|accessdate=3 September 2014}}</ref> రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది. గోదావరి నది [[పాపి కొండలు]] దాటిన తరువాత [[పోలవరం]] వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న [[ధవళేశ్వరం]] దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ పుణ్యస్థలిలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది [[పుష్కరాలు]] ఘనంగా జరుగుతాయి. ఈ నగరం [[తూర్పుచాళుక్య]] రాజైన [[రాజరాజనరేంద్రుడు]] పరిపాలించిన చారిత్రక స్థలం మరియు ఆ రాజ్యపు రాజధాని. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరి పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును [[రాజమహేంద్రవరము]]గా మార్చడమైనది.
 
== నగర చరిత్ర ==
1
[[దస్త్రం:Portrait of Rajaraja Narendrudu.JPG|thumbnail|రాజరాజ నరేంద్రుడి చిత్రపటం]]
[[File:Chalukya vaibhavam.jpg|thumb|రాజమండ్రి నగర సాంస్కృతిక, చారిత్రిక ప్రాధాన్యతను వివరిస్తూ నగర రైల్వేస్టేషన్లో వేసిన [[కుడ్యచిత్రాలు|కుడ్యచిత్రం]]]]
రాజమహేంద్రిని [[రాజరాజ నరేంద్రుడు]] రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతారు. రాజరాజ నరేంద్రుని పూర్వపు రాజుల చరిత్రాధారాలు లేకపోవడం వలన వీరి గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒక కథనం ప్రకారం 919-934 సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆయన తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు (945-970) రాజమహేంద్రిని పరిపాలించారని చెబుతారు. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత సంపాదించుకొంది. నరేంద్రుని పరిపాలనలో [[కవిత్రయం]]లో మెదటివారైన [[నన్నయ్య]] శ్రీ మహాభారతాన్ని తెనుగించడం ప్రారంభించారు. ఈ మహారాజు తరువాత [[విజయాదిత్యుడు]] (1062-1072), కుళోత్తుంగ చోళుడు, రాజరాజవేంగి-2 రాజమహేంద్రిని పరిపాలించారు. [[కాకతీయులు|కాకతీయ]] సామ్రాజ్యంలో రాజమహేంద్రికి ప్రముఖస్థానం ఉంది. 1323లో [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఇప్పటి రాజమహేంద్రవర నడిబోడ్డులో ఉన్న మసీదు తుగ్లక్ పరిపాలనాకాలంలో తూర్పుచాళుక్యులచే నిర్మించబడ్డ వేణుగోపాలస్వామివారి ఆలయ స్థానంలో నిర్మించబడింది. ఆ తరువాత రెడ్డి రాజులు (1353-1448) తుగ్లక్ కు వ్యతిరేకంగా ఉద్యమించి గెలిచారు. ఆ తరువాత కపిలేశ్వర గజపతి, [[బహమనీ సుల్తానులు]], పురుషోత్తమ గజపతి, [[శ్రీకృష్ణదేవరాయలు]], [[ప్రతాపరుద్ర గజపతి]] వంటివారు రాజమహేంద్రిని పరిపాలించారు.
[[File:Rajahmundry Rly.Stn..JPG|thumb|left|రాజమండ్రి రైల్వే స్టేషను]]
 
== స్థల పురాణము ==
1
శ్రీ చక్ర విలసవము అను గ్రంథములో [[శ్రీ చక్రం|శ్రీ చక్ర]] అవిర్భావము గురించిన రెండు పౌరాణిక గాథలలోని రెండవ కథ ఈ విధముగా చెప్పబడింది. ఈ కథ బ్రహ్మాండ పురాణమునకు చెందినది. భండాసురుని జయించుటకై శ్రీదేవిని ఉద్దేశించి [[ఇంద్రుడు]] మహా యజ్ఞము చేసెను. ఆ [[యజ్ఞము]]<nowiki/>న దేవతలు తమతమ శరీరమాంసములను కోసి హోమద్రవ్యముగా నొసగిరి. దేవతల త్యాగమునకు సంతోషించిన [[శ్రీదేవి]] కోటిసూర్య సమమైన తేజముతోను, కోటిచంద్ర శీతలమయూఖములతోను ఆ హోమాగ్ని మధ్యమున ప్రత్యక్షమయ్యెను. [[శ్రీదేవి]] జ్యోతీరూపమైన శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమైనది. (ఈ వృత్తాంతమునే లలితాసహస్రనామావళిలో 'చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా' (4,5 నామములు) అనునవి వెల్లడించుచున్నవి. ఈ వృత్తాంతసందర్బమైన యజ్ఞము నేటి గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరమున గల [[కోటిలింగాల|కోటిలింగ]] క్షేత్రమున జరిగినదనియూ అక్కడే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయిందని స్థలపురాణము.).
 
==సంస్కృతి==
1
 
===చలనచిత్ర రంగం===
1
 
''దుర్గా సినీటౌన్'', [[దక్షిణ భారతదేశము]]లోని మొట్టమొదటి సినిమా స్టూడియో, ఈ స్టూడియో 1936లొ నిడమర్తి సూరయ్య గారిచే స్థాపించబడింది.<ref>{{cite book|last1=Ram|first1=P|title=Life in India|date=2014|publisher=AnVi|page=153|url=https://books.google.co.in/books?id=OjT4BQAAQBAJ&pg=PA153&lpg=PA153&dq=First+Film+Studio+of+Andhra+Pradesh-%5B1936,+Rajahmundry&source=bl&ots=rAZ9vWPJBT&sig=47mdBIEv93GduOy69FbF_vlUwNU&hl=en&sa=X&redir_esc=y#v=onepage&q=First%20Film%20Studio%20of%20Andhra%20Pradesh-%5B1936%2C%20Rajahmundry&f=false|accessdate=2 July 2016|language=en}}</ref>
1
 
రాజమండ్రి నగరంలో సుమారు 9 సినిమా హాల్స్ కలవు
1
 
=== కళ మరియు క్రాఫ్ట్ ===
1
 
ఇక్కడ చిత్రలేఖనంలో ప్రపంచ ఖ్యాతి పొందిన ''దామోర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ'' ఉంది. ఇక్కడ దామోర్ల రామారావు గారి చిత్రాల్లో ముఖ్యమైన ''కృష్ణ లీల'', ''తూర్పు కనుమల గోదావరీ'' మరియు ''కథియవార్'', [[గౌతమ బుద్ధుడు]] పై ''సిధ్ధార్ద రాగొద్యం'', [[కాకతీయులు|కాకతీయు]]<nowiki/>ల పై ''నంది పూజ'' చిత్రాలు భద్రపరిచారు.<ref>{{cite news|title=Damerla Rama Rao Art Gallery: a picture of neglect|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/damerla-rama-rao-art-gallery-a-picture-of-neglect/article7523945.ece|accessdate=2 July 2016|work=The Hindu|date=11 August 2015|language=en-IN}}</ref>
1
 
=== గోదావరి పుష్కరాలు ===
1
{{Main|2015 గోదావరి పుష్కరాలు}}
[[పుష్కరము]] అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. రాజమండ్రిలో గత పుష్కరాలు 2015లొ జరిగాయి.<ref>{{cite web|title=Godavari Pushkaralu 2|url=http://godavaripushkaralu.co.in/index.html|website=godavaripushkaralu.co.in|accessdate=2 July 2016}}</ref> దీని కోసం నిర్మించిన ''కోటి లింగాల ఘాట్'' ముఖ్యమైనది, దీనిని ''అఖండ గోదావరి ప్రాజెక్ట్'' ద్వారా ఆధునీకరిస్తున్నారు.<ref>{{cite news|title=Iconic Kotilingala Ghat loses its sheen|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/iconic-kotilingala-ghat-loses-its-sheen/article8293818.ece|accessdate=2 July 2016|work=The Hindu|date=26 February 2016}}</ref>
 
=== నగరం గురించిన ప్రస్థావన===
1
 
'''ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రలో'''
1
 
''యీ రాజమహేంద్రవరము గౌతమమహాముని ఆశ్రమము పూర్వకాలమందు ద్వాదశర్షక్షామము సంభవించి సమస్త బ్ర్రాహ్మణ్యము అన్నములేక మనుష్యకోటికి గురువులయిన గౌతమలవద్దికి వచ్చి మొరపెట్టుకుంటే వారు తన తపోబలముచేత బ్రత్యహము కొద్దిగా వరిబీజాలు చల్లి అవి సద్య:ఫలమునకు వచ్చేటట్టుచేసి ఆధాన్యము అక్షయ మౌటచేత అనేకకోటి బ్రాహ్మణ్యమునకు ప్రత్యహము అన్నము యిచ్చి వారల ప్రాణరక్షణ చేసారు. పిమ్మట క్షామము వదలగానే సమస్త ద్విజులు గౌతముల ఆశ్రమము వదిలి పొయ్యేటప్పుడు యంత యశస్సు గౌతములకు రావచ్చునా అని అసూయచేత, పాంఛంభౌతిక దేహములన్ని యీశ్వరుని మాయా సంబంధమయిన అరిషడ్వర్గముతో బద్ధము లయివున్నవి గనుకనున్ను ఉయిక్కడి జిల్లాజడ్జియయిన వైబరుటుదొర, చెక్కుముక్కి రాయిపై యినుము వేగముగాకొట్టి అగ్ని పడకపోతే తుపాకీలోని మందుగుండు భయిలుపడదు అన్నవతుగా యీ [[ప్రపంచము]] కృతజ్ఞత సాత్వికత్వౌలతో నిండితే అన్ని ప్రకృతులు చప్పుడు లేక స్థావరములుగా నిద్రపోతూ వుండవలశినవి గనుకనున్ను దురత్యయమయిన మాయ 'కష్నతి కష్నతి కష్న త్యేన ' అనే వచనప్రకారము పండితులను కూడా మోసపరచి చీకటిలో కండ్లు కలవాడు కండ్లు లేనివాడున్ను సమ మయినట్టు మనుష్యులను కృతఘ్నులను చేస్తోంది గనుక అదేప్ర్కారము అప్పట్లో గౌతముల ఆశ్రమములో నున్న బ్రాహ్మణులు కుతంత్రమువల్ల ల్వొక గోవును కల్పించి గౌరములు ఆ దినము చల్లిన పయిరు మే శేటట్టు చేసారు. ఆ గోవు ఆ ప్రకారము తాను చల్లిన పయిరు మేశేకృత్యము చూచి గౌతములు బ్రాహ్మలమీది భక్తిచేత గరికపోచను గొవుమీద వేశి అదలించాడు. అంతమాత్రానికే ఆ గోవు చచ్చినట్టు అభినయించింది. వెంబడిగానే అక్కడవున్న బ్రాహ్మలు గౌరములను హత్యదోషము కలవాణ్నిగా నిందించారు. గౌతములు పశ్చాత్తప్తలయి నాకు యేమి గతి యని బ్రాహ్మణమందలిని అడగగా శివుని జటాజూటములో వుండే విష్ణుపాదప్రసూతయయిన గంగను భయిటికి తెచ్చి అందులో అవగాహనము చేస్తేనేగాని నీవు పుణ్యాత్ముడవు గావని చెప్పినారు. పిమ్మట గౌతములు తపస్సువల్ల సాంబమూర్తిని సంతోష పెట్టి ఒక ధారను భూమిమీదికి తెచ్చి తన ఆశ్రమముదాకాతెచ్చి స్నానముచేసి యెప్పుడున్ను లోకాపకారముగా భూమిమీద ప్రవహింపుచు వుండేటట్టు చేసాడు. ఆ ధారకు, గొదావరి అని [[నామకరణము]] చేయడమయినది. పిమ్మట సప్తఋషులు గౌతములను ప్రార్థించి సెలవు పుచ్చుకుని యేడుధారలుగా గోదావరిని చీలదీసి తమ తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళీనారు గనుక యీ రాజమహేంద్రవరమునకు గోదావరి అఖండముగా వచ్చిధవళేశ్వరము మొదలుగా చీలి సప్తగోదావరులుగా అయినది. ఆ సప్తగోదావరీ తీరమందు వుండే [[భూములు]] గోదావరీ వుదకబలముచేత సమసస్యా ధులను అమోఘముగా ఫలింపచేయుచున్నవి. ఆ సప్తగోదావరీ తీరమును కోనశీమ అనుచున్నారు. అక్కడ బ్రాహ్మలకు భూవసతులు చాలా ఉన్నాయి.''
1
 
యిది కాకినాడుజిల్లా యెనిమిదిలక్షల వరహాలు సాలుకు యెత్తుతన జమీన్ గ్రామాలమీదుగా తానుకూడా వచ్చి యెనిమిదామడపత్యంతము నన్ను సాగనంపించవలె నని తలచి ప్రార్థించినాను గనుక దండుల్దారిని యేలూరిమీదుగా నా రెండుబండ్లను రవానాచేసి నేను అడ్డదారినివుండే [[వాడపల్లి]] రాత్రి 7 గంటలకు ప్రవేశించినాను. దారి గోదావరి వొడ్డుననే ఒక మనిషి నడిచేపాటి కాలిదారిగా ఉంది. రాజమహేంద్రవరమునకు వాడపల్లె అనేవూరు 6 కోసుల దూరము. గోదావరి మధ్యే కొన్ని లంకలు ప్రవాహపు వేగాన పెట్టబడుచువచ్చుచున్నవి. వాడపల్లి యనే వూరు విష్ణుస్థలము గనుక వెంకటేశ్వరుల గుడి చిన్నదిగా ఒకటి ఉంది. యిరువై యిండ్ల వైష్ణవాగ్రహారముకూడా ఉంది. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారి తమ్ముడు యీ వాడపల్లెలో విశాలమయిన నగరు కట్టి ఉన్నాడు. యీ రాత్రిన్ని మరునాడున్ను యిక్కడ వుండినాను. యీవూరు గోదావరి వొడ్డు గనుక యీవూళ్ళో [[బావులు]]<nowiki/>లేవు.''
1
 
* రాజరాజనరేంద్రుని పరిపాలన
* [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలన
* రెడ్డిరాజుల, గజపతి రాజుల పరిపాలన
* ఆంగ్లేయుల పరిపాలన
* ఫ్రెంచ్ పరిపాలన
 
== ముఖ్య సందర్శనీయ ప్రదేశములు మరియు దేవాలయములు ==
[[File:Godavari matha statue.jpg|thumb|రాజమండ్రి రైల్వేస్టేషను భవనంపై [[గోదావరి|గోదావరి మాత]] విగ్రహం]]
[[File:Rajamahendravaram ghats.jpg|thumb|రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున వివిధ ఘాట్లు]]
రాజమండ్రి నగరం ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక పర్యాటక నగరం ఇక్కడ ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఆలయములు వున్నాయి.ఈ యుగానికి అవతారుడైన మెహెర్ బాబా వారి పాదపద్మాలచే పునీతమైన పుణ్య క్షేత్రము. 1953 మరియు 1954 జనవరి, ఫిబ్రవరి నెలలొ మెహెర్ బాబాను వేలాది సంఖ్యలొ ప్రజలకు దర్సనము కావించుకొన్నారు.
 
===గోదావరి హారతి===
రాజమండ్రి ఒక దివ్య పుణ్యక్షేత్రం. ఈ పుణ్య నగరం లో ప్రతి నెలా వచ్చే పున్నమికి పరమపుణ్య గోదావరి మాతకు [[హారతి]] ఇస్తారు అలానే సంవత్సరానికి ఒకసారి కార్తిక పున్నమి రోజున నగర జనుల మధ్య ఎంతో ఘనంగా గోదావరి మాతకు వేద పండితులు హారతి ఇస్తారు. ఈ కార్యక్రమం ఎంతో బాగుంటుంది. అలానే [[కోటగుమ్మం]] లోని మహా శివుని [[విగ్రహము|విగ్రహం]] వద్ద ప్రతి మాస [[మహాశివరాత్రి|శివరాత్రి]]<nowiki/>కి అలానే ప్రti [[సంవత్సరము|సంవత్సరం]] మహా శివ రాత్రికి మహా కుంభ హారతి నిర్వహిస్తారు.
===రాజమండ్రి కేంద్ర కారాగారం ===
{{ప్రధాన వ్యాసం|రాజమండ్రి కేంద్ర కారాగారం}}
రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఒకటి. సెంట్రల్ జైలు కంభాల చెఱువు నుండి తిన్నగా వై-జంక్షన్ వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రభుత్వ కళాశాల(ఆర్ట్స్ కాలేజి) ఎదురుగా 100 మీటర్ల దూరంలో ఉన్నది. ఇది మెదట్లో ఒక కోట. దీనిని 2-3 శతాబ్ధాల క్రితం భారత దేశానికి వర్తకం చెయ్యడానికి వచ్చిన డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలో [[కారాగారము|కారాగారం]] క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి [[సెంట్రల్ జైల్]] స్థాయి కల్పించబడింది. ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ జైలు [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలులో 581 మంది జీవైత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు ఉన్నారు. రాజమండ్రి కొంత కాలం [[డచ్ భాష|డచ్]] వారి పరిపాలనలో ఉన్నది. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్పాటు చేశారు, దీనిలో [[ఆయుధాలు]] తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, అవసరం పడి నప్పుడు ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటుకి ఎదురుగా ఉన్నది, ముడవది పాత సబ్ కల్టకర్ ఆఫీసు వెనుక అప్సర హోటలు దగ్గర ఉన్నది. ఈ గదులను ఇప్పుడు రికార్డులను దాచడానికి తగులపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. 1857 సంవత్సరంలో ప్రధమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్తగతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను [[కారాగారం]] గా మార్చారు. ఈ కారాగారంలో ఒక పెద్ద [[దేవాలయం]] ఉండేదని ( ఇప్పుడు లేదు) డి.ఐ.జి. కార్యాలయంలో ఉన్న శిలా ఫలకం చెబుతుంది. ఇంకో ఆకర్షణ ఈ జైలులో గజలక్ష్మి ( లక్ష్మి దేవి విగ్రహం లక్ష్మి దేవికి ఇరుప్రక్కల రెండు ఏనుగులు ఉన్నాయి) విగ్రహం కనిపిస్తుంది, ఇది గజపతుల రాజ చిహ్నం. గోదావరి నది నుండి ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలులో ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఎందరో ఈ జైలులో ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు.
 
===కాటన్ మ్యూజియం మరియు ఆనకట్ట===
రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనది. ఇది రాజమండ్రి నగరంలోని ధవళేశ్వరం ప్రాంతంలో కలదు. బ్రిటష్ ఇంజినీర్ సర్ ఆర్ధర్ థోమస్ కాటన్ గోదావరి నదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసారు. ఆ సందర్భంలో తన కూతుర్ని కోల్పోయారు. ఆ అమరజీవి గుర్తుగా నగరంలో ఆయన బస చేసిన ఇంటిని మ్యూజియంగా 1998 లో మార్చారు. అలాగే వారి కూతురి సమాధి గోదావరి రైల్వేస్టేషన్ సమీపంలో ఉంది.
 
===రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం===
రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం నగరానికి చెందిన ప్రముఖులు శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారి పేరుమీద స్థాపించిన పురావస్తు ప్రదర్శన శాల. పూర్వకాలంలో రాజులు, బ్రిటిష్ వారు ఉపయోగించిన వస్తువులు మొదలైనవి ఇందులో ఉన్నాయి.
===దత్త ముక్తి క్షేత్రం===
{{main|దత్త ముక్తి క్షేత్రం}}
ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ నందు కలదు. ఈ క్షేత్రంలో శ్రీ గణపతి ప్రతిష్ఠ, శ్రీ దత్తత్రేయ ప్రతిష్ఠ, మరకత దత్త పాదుకా ప్రతిష్ఠ మరియు కుంభాభిషేకము శ్రీ శ్రీ శ్రీ గణపతి సఛ్ఛిదానంద స్వామీజీ వారు 2008 వ సంవత్సరము జనవరి మాసము 19, 20వ తేదీలలో నిర్వహించినారు.
 
===ఆర్యభట్ట సైన్సు మ్యూజియం===
ఈ ఆర్యభట్ట సైన్సు మ్యూజియం రాజమహేంద్రవరం నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వుంది. నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఒకరు [[విద్యార్ధులు|విద్యార్ధుల]]<nowiki/>లో సైన్సు పట్ల అవగాహన కొరకు వారి ఇంటినే [[సంగ్రహాలయం|మ్యూజియం]]<nowiki/>గా ఏర్పాటుచేసారు. ఈ మ్యూజియం ఒక విజ్ఞాన గనివంటిది. దేశం నలుమూలల నుంచి సేకరించిన సైన్సుకి సంబంధించిన వస్తువులు విద్యార్ధులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
 
===ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం===
[[ఇస్కాన్]] శ్రీ కృష్ణ దేవాలయం(అంతర్ జాతీయ శ్రీ కృష్ణ సంఘం) గోదావరీ నదీతీరములో జీవిత సభ్యుల సభ్యత్వరుసుములతో మరియు భక్తుల నుండి విరాళాలతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇస్కాన్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. చాలా అందంగా ఉంటుంది. నగరంలోని దర్శనీయ ప్రదేశాలలో ఇది ఒకటి.
===కైలాసభూమి===
ఇది హిందువుల యొక్క స్మశానవాటిక. కాని నిజమైన [[కైలాసము]] వలె చాల అందముగా వుంటుంది ఎవరైనా సందర్శించవచ్చు.
===అయ్యప్ప దేవాలయం===
ఇది నగరంలో నూతనం గా నిర్మించిన దేవాలయం తూర్పు [[శబరిమలై]] గా పేరుగాంచినది అద్భుతంగా వుంటుంది [[కేరళ]]<nowiki/>లో మాత్రమే నిర్వహించే కేరళ వాయిద్యం నిర్వహించే ఆంధ్ర ప్రాంతాలలో ఒకటి.
===శ్యామలాంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం===
ఈ అమ్మవారిని రాజమండ్రి నగర [[దేవత]]<nowiki/>గా పిలుస్తారు. ఈ అమ్మవారి చరిత్ర సరిగా ఎవరికీ లభించ లేదు; కాని అమ్మ వారి ఆలయం రాజ రాజ నరేంద్రుని కాలం నుంచి వుందనీ, వారు శ్రీ అమ్మవారిని కొలిచేవారని కొంతమంది పెద్దలు చెబుతారు. పెద్దల కథనం మేరకు అమ్మవారు చిన్న వయసులో తోటి పిల్లలతో ఆడుకుంటూ యేరు పిదకలకోసం అని బయలుదేరి ప్రస్తుతం ఆర్.టి.సి బస్సు కాంప్లెక్సు దగ్గర ఉన్న ప్రదేశంలో అమ్మవారిగా అవతరించారని అక్కడే ఆమె నేను సోమ్మలమ్మ ను రాజముండ్రి నగర దేవతను అని ప్రకటించారని పెద్దలు చెబుతుంటారు. అలా దేవతగా మారిన అమ్మవారు ప్రతి ఏట ఉగాది పర్వదినం సందర్భం లో నన్ను నగరం లో కి తీసుకువెళ్ళి [[జాతర]] చెయ్యాలి అని వారి భక్తులను ఆదేశించారు అంట ! ఆ తల్లి కోరిన విధం గానే నేడు ప్రతీ ఏట ఇక్కడ అమ్మ వారి జాతర అంగ రంగ [[వైభవం]]<nowiki/>గా జరుగుతుంది. ఈ జాతర జరిగే తీరు హిందూ కుటుంబంలో ఆడ పిల్లకు గల ప్రాముఖ్యం, అక్క చెళ్ళెల మధ్య వుండే అనుబంధం అందరికి స్పూర్తి కలిగిస్తుంది. అది ఎలా అంటే ఒకసారి జాతర జరిగే తీరును తెలుసుకుందాం అమ్మవారి పుట్టినిల్లు గా పిలువబడే శ్యామల నగర్ (కొత్త పేట) లోని ఆలయంలో నుంచి అమ్మవారి కుటుంబంకి చెందిన వ్యక్తి అమ్మవారిని పుట్టింటికి పిలిచేందుకు కావిడితో చీర,ముర్రట (పసుపు నీరు )వేపాకులు ఇంకా ఇతర సారె వస్తువులు తీసుకొని రోడ్డు మర్గాన రాజమండ్రి నగర వీదులలో నుంచి వెళ్తారు ఈ మార్గ మధ్యం లో ప్రజలు ఆ కావిడి తీసుకొని వెళ్ళే వ్యక్తి కి కాళ్ళు కడిగి అమ్మ వారిని నగరం లో తీసుకొని రావాలని ప్రార్థిస్తారు. ఈ సమయం లో పాత సోమాలమ్మ ఆలయం వద్ద జాతర మొదలవుతుంది. ఈ వ్యక్తి ఆ ఆలయం కి వెళ్లి అమ్మవారిని పిలిచి జాతరగా అమ్మను తీసుకొని నగరం లోకి ప్రవేశిస్తారు.ఈ దారిపొడవునా ప్రజలు అమ్మవారికి వేపాకులు ముర్రట డప్పులతో స్వాగతం పలుకుతారు అలా అమ్మవారు అత్త వారి ఇంటినుంచి పుట్టింటికి వస్తారు. అప్పుడు పుట్టింటి వద్ద జాతర అంగరంగ వైభవం గా మొదలవుతుంది. అమ్మవారు నగరం లో ఉండే ఒక్కో రోజు అమ్మవారి చెల్లెళ్ళు గా పిలిచే గొల్లమారమ్మతల్లి,ముత్యాలమ్మ తల్లి ,గంటాలమ్మతల్లి ,పున్తలమ్మ తల్లి ........ మొదలగు అమ్మవారులు [[ఊరేగింపు]]<nowiki/>గా జాతరతో ఈ ఆలయం వద్దకు వచ్చి అమ్మ వారిని కలుసుకుంటారు చూసారా ఎంత ఆప్యాయత ఈ జాతర ప్రతి ఒక్కరికి ఆదర్శం. అలా అందరు అమ్మవారులు పల్కరించాక చివరగా సోమాలమ్మ అమ్మవారి [[జాతర్ల|జాతర]] అంగ రంగ వైభవంగా జరుగుతుంది. అలా ఈ జాతర చివరి రోజు అమ్మవారు భక్తులను ఆశఈర్వదిస్తూ అత్త వారి ఇంటికి వెళ్తారు. ఈ విధంగా జాతర ముగుస్తుంది.
===ఉమా రామ కోటిలింగేశ్వర స్వామి ఆలయం===
ఈ ఆలయం చాల విశిష్ట మైనది మరియు పురాతన మైనది. ఈ ఆలయ చరిత్ర పరకారం బ్రమ్మ దేవుడు మహా సరస్వతి సమేతుడై ఇక్కడ కోతిలిగాలకు పూజించారని ఆ కోటి లింగముల లో ని బ్రమ్మ సరస్వతుల చే పూజించా బడిన లింగాకరమే స్వమివారని అంటారు అలాగే ఈ స్వామివారిని అరణ్య వాసము సమయం లో శ్రీ సీతా రాములు పూజించారని చారిత్రక ఆదారాలు చెబుతున్నాయి. అందుకు గుర్తుగా ఇక్కడ శ్రీ అన్న పూర్ణ సమేత కోటిలింగేశ్వర స్వామి వారితో పాటు శ్రీ సీతా రాముల దేవాలయం కుడా వుంది.
===శ్రీ వేణుగోపాలస్వామి గుడి===
శ్రీ [[వేణుగోపాలస్వామి ఆలయం, రాజమండ్రి|వేణుగోపాలస్వామి]] రాజమహేన్ద్రి క్షేత్ర పాలకుడు. ఈ గుడి రాజమండ్రి ముఖ్య వీధిలోని ఇప్పటి "పెద్దమసీదు" స్థానములో ఉండేది. 1323 సంవత్సరములో నూర్ హసన్ (మహమ్మద్ద్ బీన్ తుక్లక్) వేణుగోపాలస్వామి గుడిని మసీదుగా (రాయల్ మాస్క్) మార్చెను. అప్పుడు గుడి పూజారులు కంభం వారి సత్రం వీధిలోని ఒక సందులో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దాచి పూజించేవారు. 14 వ శతాబ్దంలో రెడ్దిరాజులు దేవాలయం నిర్మించి అనపర్తి గ్రామన్ని గుడికి దానం చేసారు. నగర ముఖ్య వీధిలోని రాయల్ మసీదుకు, అప్పటి గుడియొక్క ముఖద్వారము, ద్వారము పైన పద్మము, గుడిలోని 12 దేవాలయ స్తంభాలు, సరోవరం, రాతి కట్టడంతో చదరపాకారములో దిగుడు బావి ఇంకాను అలాగే ఉన్నాయి.
===శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి గుడి===
మృకండ మహర్షి ఆయన భార్య మరుద్వతికి సంతానం లేకపోవడం చేత శివుడి గురించి తపస్సు చేసి 16 ఏళ్ళు ఆయుష్షు కల సంతానం పొందుతారు. ఆ పిల్లవాడి పేరు మార్కండేయుడు. [[నారద మహర్షి]] సూచన మేరపు మార్కండేయుడు గౌతమీ (గోదావరి) తీరంలో శివ లింగాన్ని ప్రతిష్ట చేసుకొని తపస్సు చేస్తాడు. [[ఇతిహాసం]] ప్రకారం ఇక్కడే శివుడు మార్కండేయుడిని యముడి బారి నుండి కాపాడి చిరంజీవత్వం ఇచ్చాడు. మార్కండేయుడే శివ లింగాన్ని అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల ఇక్కడ స్వామి వారిని శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి అని పిలుస్తారు. శాసనాల ఆధారంగా రాజరాజ నరేంద్రుడు, చోళరాజులు, రెడ్డి రాజులు ఆలయ నిర్వహణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయ నిర్వహణా బాధ్యతలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాలయ ధర్మదాయ శాఖ గ్రేడ్ ఒకటి కార్యనిర్వహణాధికారి ద్వారా చేబట్టుతోంది. ఈ దేవాలయం గోదావరి బండ్ మీద ఉన్నది. ఈ దేవలయం ఉన్న ప్రదేశం దగ్గరలో చంద సత్రం శిధిలమైన [[మసీదు]] ఉండేది. శిధిలమైన మసీదుని పురావస్తు శాఖ వారు పరిశోధించి ఇక్కడ ఒక శివుని దేవాలయం ఉండేదని నిర్ధారణ జరిపారు. 1818 సంవత్సరంలో గుండు శోభనాధీశ్వర రావు అనే వ్యక్తి ఈ శివాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం ఉన్న వీధిని గుండు వారి వీధీ అని పిలుస్తారు. ఆలయానికి ప్రధాన ద్వారం గుండు వారి మీద నుండి ఉన్నది. అంతే కాకుండా తరువాతి కాలంలో గోదావరి బండ్ మీద నుండి ఒక ద్వారం ఏర్పాటు చేశారు. ఇప్పుడు గుండు వారి వీధిలో ఉన్న ద్వారాన్ని రెండో పక్షంగా వాడుతూ ప్రధాన ద్వారం గోదావరి బండ్ మీద ఉన్నదాని క్రింద వాడుతున్నారు. నగరంలో ఇప్పుడు ఉన్న వైశ్య హాస్టలు గుండు శోభనాధీశ్వర రావు వారి ఒకప్పటి నివాసం.
 
===శ్రీ సారంగధీశ్వర స్వామి గుడి===
సారంగధీశ్వర దేవాలయం రాజమండ్రి నగరం నుండి [[కోరుకొండ]] వైపు వెళ్ళే కోరుకొండ రోడ్డు వెళ్తేవచ్చే సారంగధార మెట్టా పై నున్నది. తూర్పు చాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు. రాజరాజనరేంద్రుడినికి సారంగధరుడు అనే కుమారుడు మరియు చిత్రాంగి అనే రెండవ భార్య ఉండేది. రాజరాజ నరేంద్రుడి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు రాజ రాజ నరేంద్రుడికి పక్కలో బల్లం వలే ఉండేవాడు. ఒకరోజు చిత్రాంగి సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది, వేట పై ఆసక్తి ఉన్న [[సారంగధరుడు]] విందుకు రాకుండా వేటకు వెళ్తాడు. ఆ విషయాన్ని చారులు ద్వారా తెలుసుకొన్న విజయాదిత్యుడు చిత్రాంగి - సారంగధారుడికి అక్రమ సంభంధం ఉన్నదని రాజారాజ నరేంద్రుడి చెబుతాడు. విషయా విషయాలు పరిశీలించకుండా రాజరాజ నరేంద్రుడు సారంగధారుడి రెండు చేతులు, రెండు కాళ్ళు ఖండించాలని శిక్ష వేస్తాడు. సేవకులు రాజాజ్ఞ పరిపాలించి సారంగధారుడిని నగరానికి ఉత్తర దిశలో అడవులతో నిండిన ఒక ఎత్తైన పర్వతం మీద రెండు చేతులు రెండు కాళ్ళు ఖండించి పాడవేస్తారు. సారంగధారుడు రెండు చేతులు కాళ్ళ నుండి నెత్తురు పారుతూ ఉండగా సారంగధారుడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు సారంగ ధారుడికి [[ఆకాశవాణి]] ద్వారా పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల ఈ శిక్షని అనుభవించవలసి వచ్చిందని, ఈ జన్మలో పాపం ఏమి చెయ్యలేదని చెబుతుంది. ఆ ఆర్త నాధం విన్న మేఘనాధ అనే శివ భక్తుడు అక్కడకు వచ్చి సారంగధారుడికి సపర్యలు చేసి, శివుడిని ప్రార్థించమని సలహా చెబుతాడు. సారంగధారుడు మేఘనాధుడి సూచన ప్రకారం శివుడి ఆరాధిస్తే [[శివుడు]] ఆ ప్రార్ధనతో సంతృప్తి చెంది సారంగధారుడికి తన పూర్వపు చేతులు, [[కాళ్ళు]] మరియు మంచి అందమయిన శరీరాన్ని ప్రసాదిస్తాడు. సారంగధరుడు శివుడి అనుగ్రహంతో పునర్జన్మ పొందిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశం పేరే సారంగధార మెట్ట, ఈ దేవాలయంలో నున్న దేవుడు సారంగధేశ్వరుడు.
 
===కోరుకొండ లక్ష్మీనరసింహ దేవాలయం:===
ఈ దేవాలయం రాజమండ్రి లోని కోరుకొండ ప్రాంతం లో కొండపై గల అతి ప్రాచిన దేవాలయం ఇక్కడ ప్రతి ఏట జరిగే లక్ష్మి నరసింహ స్వామి తీర్దం రాష్ట్రము లో ప్రసిద్ధి చెందినది
 
===జనార్ధన స్వామి ఆలయం===
ఈ ఆలయం రాజమండ్రి ధవళేశ్వరం ప్రాంతం లో వుంది పురాతనమైనది . ఇక్కడ కూడా ప్రతి ఏట జరిగే తీర్దం మరియు రధోత్సవము ప్రసిద్ధి చెందినది.
 
===మినీ తిరుమల===
ఈ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ [[వెంకటేశ్వర స్వామి]] వారిది ఈ ఆలయం తిరుపతి లో గల ఆలయం వలె నిర్మించారు తిరుమల లో జరిగే ప్రతీ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది రాజమండ్రి దివాన్చెరువు ప్రాంతం లో వుంది
 
===వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయం===
ఈ ఆలయం రాజముండ్రి సింహచల్ నగర్ లో కలదు ఇది విశాక నగరం సింహాచలం లోని ఆలయానికి నమూనా వంటిది అక్కడి ఆలయం ఎలా వుంటుందే అలాగే ఇక్కడ నిర్మించారు అక్కడి వలె ఇక్కడ కూడా ప్రతి ఏట స్వామి వారి నిజరూప దర్సనం వుంటుంది.
 
===సత్యనారాయణ స్వామి ఆలయం===
ఈ ఆలయం రాజముండ్రి ఆర్యాపురం లో కలదు ఇక్కడ అన్నవరం దేవస్థానం వలె అనేక పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ మధ్య ఈ ఆలయం చాల ప్రాచుర్యం పొందింది. ప్రతి ఏట భక్తులు పెరుగుతున్నారు ఆదాయం కుడా రికార్డు స్థాయి లో నమోదు అవుతుంది .
 
===నృత్య ఆలయం===
[[File:Aalaya nruthya kalaxetram.jpg|thumb|రాజమండ్రి నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద గల ఆలయ నృత్యక్షేత్రంలోని ఆలయ నృత్య విగ్రహాల స్తూపం]]
దేశం లో ఇక్కడ లేని విదం గా రాజమండ్రి లో నృత్య ఆలయం వుంది ( టెంపుల్ of thedance ) ఇది కోటిపల్లి బస్సు స్టాండ్ వద్ద కలదు భారత నృత్య రీతులను వివరించే అద్భుత శిల్ప కలలతో చాల అందం గా వుంటుంది.
 
===స్వతంత్ర సమరయోదుల పార్క్===
ఈ గనత కూడా ఈ నగరానికే చెందుతుంది రాష్ట్రము లో స్వతంత్ర సమరయోదుల కోసం ప్రతేకించి ఒక park ఎక్కడ లేదు కాని రాజమండ్రి నగరం లో కలదు ఇక్కడ- స్వతంత్రం కోసం పోరాడిన వీరుల [[విగ్రహాలు]] ఉంటాయి. అలాగే ఈ పార్క్ లోని ఒక బవనంలో స్వతంత్ర చరిత్రను ఆధ్యయనం చేస్తారు.
 
===సైనికుల పార్క్===
ఈ పార్క్ [[కార్గిల్ యుద్ధము|కార్గిల్ యుద్ధం]] లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల స్మరనర్దం నిర్మించారు ఇది దివంచేరువు నేషనల్ హైవే 16. పై వుంది.
 
=== గౌతమీ గ్రంథాలయం ===
ఇప్పుడు ఉన్న ఈ [[గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి)|గౌతమీ గ్రంథాలయం]] వాసురయ గ్రంధ్రాలయం మరియు రత్నకవి గ్రంధలయం సముదాయం. ఇవి రెండు చిన్న చిన్నగ్రంథాలయాలు కలుపబడ్డాయి. వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటర్తం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంథాలయం పేరు 1898 ఇవ్వబడింది, 1920 సంవత్సరంలో పేరు రిజిష్టరు చేయబడింది.
 
=== సి.టి.ఆర్.ఐ ===
భారతదేశములోనే ప్రసిద్ధిగాంచిన రీసెర్చ్ సంస్థ ఇది. ఇక్కడ [[పొగాకు]] మరియు ఇతర అన్ని రకముల మొక్కలకు సంభందించిన ప్రయోగములు జరుపుతారు.
[[పొగాకు]] ఉత్పత్తి సంస్థలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలలో కూడా సి టి ఆర్ ఐ ఒకటి. దీనిని [[1947]]లో స్థాపించారు. పొగాకు సాగు విధానము మొట్టమొదట 1605 వ సంవత్సరములో పోర్ఛుగీసు దేశమునుండి మన దేశమునకు వ్యాపించినది.
 
==నగరంలో ముఖ్య ప్రదేశాలు==
[[ఫైలు:Paul chowk kamdukuri veeresalingam.JPG|right|thumb|కోటిపల్లి బస్సు నిలయం వద్ద నున్న కందుకూరి వీరేశలింగం పంతులు]]
పాల్ చౌక్ ఈ ప్రదేశం ఇప్పటి కోటిపల్లి బస్సు నిలయం ఉన్న ప్రదేశం క్రిందకు వస్తుంది. 1907 సంవత్సరం ఏప్రియల్ మాసంలో బిపిల్ చంద్ర పాల్ ఈ ప్రదేశంలోనే ఐదు రోజులు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పటీకి ఆ సంఘటనాను నగరం 50-60 వయస్సు గల ప్రజలు గుర్తు చేసుకొంటుంటారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రదేశాన్ని పాల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఇప్పుడు జెట్టి టవర్స్, కోటీపల్లి బస్సు నిలయం, మూడు పార్కులు ఉన్నాయి. ఈ ప్రదేశం కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం మరియు [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రదేశం నగరంలో ఒక ముఖ్య కూడలి. ది.6-5-1929 రాత్రి గం. 7-50 కు మహాత్మా గాంధీజీ పాల్ చౌక్ కు చేరుకుని ప్రసంగించారు. ఇక్కడ నుండి పశ్చిమం వైపు పోతే రోడ్డు రైలు వంతెన వస్తుంది, తూర్పు వైపు వెళ్ళితే రాజమండ్రి [[బస్సు]] కాంపెక్స్ వస్తుంది, ఉత్తరం వైపు వెళ్ళితే శ్యామలా సినిమా ధీయేటర్, ఇంకా ముందుకు వెళ్తే పొట్టి శ్రీరాములు విగ్రహం, రాజమండ్రి మెయిన్ రోడ్డు వస్తుంది. దక్షిణం వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం, [[దూరవాణి]] కేండ్రం (టెలిఫోన్ భవన్) రాజమండ్రి జూనియర్ కళాశాల, రాజమండ్రి రైలు స్టేషను వస్తుంది. ఈ పాల్ ఉన్న ప్రదేశంలోనె మూడు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో స్వాతంత్రత్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి.
 
=== ఇన్నీసుపేట ===
1865 సంవత్సరంలో అప్పటి సబ్ కలక్టర్ ఇన్నిసిన్ ద్వార వలస స్థావరంగా ఏర్పాటు చెయ్యబడింది. ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి రాజమండ్రి జూనియర్ కాలేజి వరకు. 1910 సంవత్సరం తరువాత నుండి ఇప్పటి వరకు ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి వీరేశలింగం థియోలాజికల్ కళాశాల వరకు విస్తరించబడింది.
 
=== ఆల్కాట్ గార్డెన్స్ ===
ఒకప్పుడు దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపలు, సమావేశాలు జరిగే ఈ ప్రదేశం దివ్య సమాజ నాయకుడైన ఆల్కాట్ పేరు మీద పెట్టబడింది.
దివ్యజ్ఞాన సమాజమ్
 
=== రామదాసు పేట ===
జానపద గాయకుడైన యెడ్ల రామదాసు పేరు మీద ఈ ప్రాంతం పిలువబడుతోంది. యెడ్ల రామదాసు తన జానపద గేయాలలో వేదాంతాన్ని, అహింసావాదాన్ని వ్యాప్తి చేశాడు. రామదాసు పేట [[కోరుకొండ]] రోడ్డు మీద టి.బి.శ్యానిటోరియం - క్వారీకి మధ్య వస్తుంది. ఈ ప్రదేశం లో ఈ గాయకుడి సమాధి కనిపిస్తుంది. ఈయన టి.బి.శ్యానిటోరియం లోనే క్షయ వ్యాధిగ్రస్తుల మధ్య నివసించేవాడు.
 
=== ఆర్యాపురం ===
1895 సంవత్సరంలో అప్పటి సబ్ కలక్టర్ లిస్టర్ ఈ ప్రభుత్వ స్థలాన్ని మూడు వీధులు వచ్చేటట్లు 130 ఇళ్ళ స్థలంగా విభజించాడు. తొంభై శాతం ఇక్కడ నివసించేవారు పూజారులు. ఈ ప్రదేశానికి లిస్టర్ పేట అని పేరు పెట్టబడింది, ఈ ప్రాంతంలో ఆర్యులు లేక పండితులు అయిన [[బ్రాహ్మణులు]] నివసించడంతో కాలక్రమంలో ''ఆర్యాపురం''గా పేరు మార్చారు. 1890 సంవత్సరంలో ఆర్యాపురం రాజమండ్రి పురపాలక సంఘం పరిధిలోకి చేర్చబడింది. ఆర్యాపురంలో నున్న పాఠశాలకు పూర్వపు సబ్ కలక్టర్ పేరు గుర్తుగా లిస్ట్ర్ పేత మునిసిపల్ హైస్కులుగా నామకారణం చేశారు. 1910 సంవత్సరంలో ఆర్యాపురంలో డాక్టర్ ఏ.బి.నాగేశ్వర రావు ఆర్యాపురం గ్రంథాలయం ఏర్పాటు స్థాపించాడు. ఆర్యాపురంలో నున్న ఆ వీధీకి ఏ.బి.నాగేశ్వర రావు వీధిగా పేరు పెట్టారు. ఆర్యాపురం గ్రంధలాయాన్ని శ్రీ రామ బాల భక్త పుస్తక భండాగారంగా పేరు మార్చి వంకాయయల వారి వీధికి మార్చబడింది. 1935 సంవత్సరంలో సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నిర్మించబడింది. ఇప్పటికి ఈ అర్యాపురం వాసస్థులు ఎక్కువ మంది బ్రాహ్మణులు.
 
=== సీతం పేట ===
కాండ్రేగుల వంశానికి చెందిన వారిచేత ఈ ప్రదేశం పండితులకు, శాస్త్రజ్ఞులకు, పూజారులకు వారి తల్లి ''సీతమ్మ'' జ్ఞాపకార్థం ఇవ్వబడింది. అందువలన ఈ ప్రదేశాన్ని సీతంపేట అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఒక చెఱువు ఉండేది, దానిని సీతమ్మ చెఱువు అని పిలిచేవారు, ఆ చెఱువు ఇప్పటి కాలంలో ఒక ఉద్యానవనంగా మార్చబడింది. ఇచ్చట పేపర్ మిల్ కలదు అ ప్రదేశానికి పేపర్ మిల్ వారి సహకారముతో ఈ సీతం పేట అభివృద్ది చెందుతున్నది. రాజమండ్రి నగర పాలక సంస్థ వారు మరియు రెవెన్యు వారు ఈ సీతం పేట మరచినారు.ఆధ్యాత్మికంగా ప్రసిద్ద చెందిన [[అవతార్ మెహెర్ బాబా]] సెంటర్ ఇక్కడనే గుమ్మిడాలవారి వీధిలో రామాలయం దగ్గర ఉన్నది. జనవరి 31 న అమర తిధి, ఫిబ్రవరి 10 న, జన్మదినము జూలై 10న మౌన దినము జరుగును.
 
=== జాంపేట ===
[[విశాఖపట్నం|విశాఖపట్టణం]] జిల్లా జామి ప్రదేశములో కరువు కాటకాలు రావడంతో అక్కడ నివసించే చేనేత వృత్తిగా కలవారు ఈ ప్రదేశానికి వలస వచ్చారు. రాజమండ్రి పురపాలక సంఘం గౌవ గార్డెన్స్ అనే ప్రదేశాన్ని కొనుగోలు చేసి ఇళ్ళ స్థలాలుగా విభజించి వీరికి అమ్మింది. అందువలన ఈ ప్రదేశాన్ని జాంపేట అని పిలిచేవారు. ఇప్పటికీ వారి వారసులే ఎక్కువగా నివాసం వుంటున్నారు. కాని ఇప్పుడు ఈపేటలో ఒక్క మగ్గం కూడా లేదు. వీరంతా ఎక్కువగా వస్త్రవ్యాపారంలో స్దిరపడ్డారు. జాంపేట కూడలిలో ఉన్న [[మహాత్మా గాంధీ]] విగ్రహాన్ని, ఆంధ్ర కేసరి [[టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి చేత ఆవిష్కరింబడింది.
 
=== దానవాయిపేట ===
ఈ ప్రదేశం యొక్క చరిత్ర సరిగ్గా లభించడం లేదు. రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మెదటి అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం రజక నాయకుడైన ''దానయాయి'' పేరు మీద పెట్టబడిందని అని చెబుతారు. ''దానవాయి'' దానవాయిగుంట అనే చెఱువు త్రవ్వించాడు. రెండవ అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఉండేది మరియు ఇక్కడ సైనికుల నివసించేవారు అందువల్ల ''దాళవాయి'' అయ్యిందని, అది క్రమంగా దానవాయిపేటగా మారింది అని చెబుతారు. దానవాయిపేట రాజమండ్రిలో ఒక ప్రముఖ స్థలం దానవాయిపేటలో మూడు ప్రధాన వీధులు ఉన్నాయి, నగరంలో ఒక ప్రముఖ ప్రదేశం వ్యాపార కేంద్రాల కార్యాలయకు. ఇక్కడ దానవాయి పేట ఉద్యానవనం కూడా ఉన్నది.
 
ఈ విశాల ప్రపంచంలో ప్రాణికోటిని సృష్టిస్తున్న క్రమంలో ఆ భగవంతుడు దోమల్ని కూడా సృష్టించి భూమ్మీదకు వదులుతుండగా` ‘ఇంత చిన్నప్రాణులం. ఇంత పెద్ద మనుషుల మధ్య, జంతువులమధ్య మేం ఎలా బతికేది?‘అంటూ దోమలు భగవంతుడ్ని అడిగాయి. అప్పుడు ఆ దేవుడు`’ మూసీనదీతీరంలో అభయారణ్యంలో జీవించమని ఆదేశించాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దోమలు గూడుకట్టుకున్న ప్రాంతం కావడంతో ఆ అడవి ప్రాంతం ‘దోమలగూడ’గా ప్రసిద్ధికెక్కింది. క్రమక్రమంగా దోమజాతి వృద్ధి చెందడంతో మరో సురక్షిత ప్రదేశం కోసం అన్వేషిస్తూ కొన్ని దోమలు గోదావరీనదీ తీరం చేరుకున్నాయి. అక్కడ నివశించే ప్రజల్ని చూడగానే దోమలకు ఉత్సాహం ముంచుకొచ్చి జనాన్ని కుట్టివాయించేశాయి, దోమలు వాయించే ప్రాంతం కావడంతో ఆ ప్రాంతం ‘దోమవాయిపేట’గా పిలవబడిరది.ఆ తర్వాత కాలంలో అదే దానవాయిపేటగా రాజమండ్రిలో ఓ భాగమైతే`దోమల గూడ హైదరాబాద్‌లో ఓ ముఖ్య ప్రాంతంగా విరాజిల్లుతోంది.
 
=== నాగుల చెరువు ===
ఇప్పటి మున్సిపల్ స్టేడియం ఉన్న ప్రదేశాన్ని నాగుల చెరువు అని పిలిచేవారు. ఒక శతాబ్ధానికి పూర్వం నాగుల అనే పేరు గల వ్యక్తి సామాన్య జనాల కొరకు ఇక్కడ ఒక చెరువు త్రవ్వించాడని ఆయన పేరు మీద ఈ ప్రదేశాన్ని నాగుల చెరువు అని పిలిచేవారు. 1955 సంవత్సరం రాజమండ్రి ఛైర్మన్ గా ఎన్నికైన క్రీడాకారుడు పోతుల వీరభద్ర రావు ఈ ప్రదేశంలో 1956 సంవత్సరంలో ఒక క్రీడాప్రాంగ్రణం నిర్మాణం జరిపించాడు. ఈ క్రీడాప్రాంగణం కేంద్ర మంత్రి ''సురిత్ సింగ్ మజిగ్య'' ఫుట్ బాల్ ఆటతో ప్రారంభించాడు. ఇప్పుడు ఈ ప్రదేశంలో ఉన్న మార్కెట్ ని నాగుల చెరువు మార్కెట్ అనిపిలుస్తారు.
 
=== రంగరాజు పేట ===
1870 ప్రాంతంలో ఈ ప్రదేశంలో [[రాజస్థాన్]] [[మహారాష్ట్ర]] నుండి ప్రజలు వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశం ఇప్పటి కోట గుమ్మ వద్ద ఉంది. వలస వచ్చిన ప్రజలు అద్దకం వృత్తి మరియు కుమ్మర వృత్తి చేసేవారు. వీరు బోంధిలి మతానికీ చెందినవారు. భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన '''రత్నం కలాలు (రత్నం పెన్నులు)''' పరిశ్రమ మరియు ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.
 
=== వీరభద్రపురం ===
1910 సంవత్సరంలో కంభాల చెరువు వద్ద నున్న 100 ఎకరాల స్వంత స్థలాన్ని దువ్వురి వీరభద్ర రావు అనే వ్యక్తి ఇళ్ళ స్థలాలుగా విభజించి [[బ్రాహ్మణులు|బ్రాహ్మలకు]] అతి తక్కువ వెలకి, రజకులకు, విశ్వబ్రాహ్మణులకు ఉచితంగా ఇచ్చాడు. ఆ మహామనీషీ జ్ఞాపకార్థం ఈ ప్రదేశాన్ని వీరభద్రపురం అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఇప్పటి సుభాష్ నగర్, లలితనగర్లోకి వస్తుంది. 1930 సంవత్సరంలో ఇక్కడ నివసించే ప్రజలు రాజమండ్రి పురపాలక సంఘం పరిధిలోకి చేరడానికి నిరాకరించారు. కాని తరువాత ఈ ప్రాంతం పురపాలక సంఘం పరిధిలోకి వచ్చింది. వీరభద్ర రావు కంభాల చెరువు వద్ద ఉన్న ప్రదేశాన్ని [[రామకృష్ణ మిషన్]]కి దానం ఇచ్చారు. ఈ మధ్యకాలంలో రామకృష్ణ మఠం నుండి కొంత ప్రదేశాన్ని సంగ్రహించి ఆదాయక పన్ను శాఖ తమ కార్యాలయమైన ఆయకార్ భవన్ ఏర్పాటు చేసుకొన్నారు. ఈ కూడళిని వివేకానంద చౌక్ అని పిలుస్తారు. ఇది కంభాల చెరువికి ప్రక్కన వస్తుంది. ఇప్పుడు ఉన్న రామకృష్ణ మిషన్ వారి మఠం ఉన్న ప్రదేశం కూడా దువ్వురి వీరభద్ర రావు దానం చేసిన స్థలమే.
 
=== శేషయ్య మెట్ట ===
రాజమండ్రి జిల్లా న్యాయస్థానం వెనుక ఉన్న ప్రదేశాన్ని శేషయ్య మెట్ట అని పిలుస్తారు. రాజమండ్రి పంచ గిరులమీద ఉన్నదని శేషయ్య మెట్ట ఒక గిరి అని ఇక్కడి ప్రజలు చెబుతారు. ఈ గిరి పేరు వెనుక చరిత్రకారులలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రదేశం రాజమండ్రి పరిపాలించిన మహమదీయుడైన సఏర్ షహిబ్ పేరు క్రింద వచ్చిందని కొంత మంది అంటారు. షేర్ షాహిబ్ నివాసం ఇప్పటి రాజమండ్రి పాత తపాల కార్యాలయం.
 
=== సుబ్రహ్మణ్య మైదానం ===
1947 ఆగస్టు 15 వ తారీఖు వరకు ఈ ప్రదేశాన్ని పోలిస్ పెరేడ్ గ్రౌండ్స్ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాకా ఆప్పటి కొలెనెల్ డి.యస్.రాజు ఈ ప్రదేశాన్ని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బ్రహమజోసుల సుబ్రహ్మణ్యం పేరుకి స్మారకంగా నామకరణం చేశాడు.
 
=== మెరక వీధీ ===
1565 సంవత్సరం [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]] పతనమై పోయాక చంద్రగిరి నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రదేశానికి వలస వచ్చి, ఇక్కడ తమ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశంలో ఇప్పటి టౌన్ హాలు ఉంది. ఈ వలస వచ్చిన వారు, తెలగ కులమునకు చెందిన వారు. వారి [[ఇంటి పేర్లు]] కాందల, పోతుల, ముత్తంగి, కత్తుల, యర్ర, నర్ర, నీలం, కంచుమర్తి, నడీపల్లి, భయపునంద. వీరు విజయనగర సైన్యంలో సైనికులుగా పనిచేసేవారు. ఇప్పటికి ఈ వంశానికి చెందిన కుటుంబాల వార ఇళ్ళలో యుద్ధానికి ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. ఈ వంశాల ప్రధాన దైవం వేణుగోపాలస్వామి. వేణు గోపాలస్వామి ఉత్సవ ఊరేగింపుకి వచ్చినప్పుడు ఈ వీధి గుండా ఊరేగింపు జరుగుతుంది. ఈ వంశానికి చెందినవారు చాలా వరకు శ్రీవైష్ణవులు.
 
=== శ్రద్ధానంద ఘాట్ ===
1920 సంవత్సరంలో పాత సమాచార కేంద్రం వద్ద ఈ ఘాట్ ఏర్పాటు చెయ్యబడింది. ఈ ఘాట్ ఢిల్లీలో ఉన్న ఆర్యామాంస ప్రధానాచార్యుడు శ్రద్ధానంద పేరు మీద పెట్టబడింది. ఈ ప్రదేశంలో బోస్ విగ్రహం ఇక్కడ ఉండేది. రాజమండ్రికి వరదలు వచ్చినప్పుడు ఈ విగ్రహం మునిగిపోతుండేది. 1991 సంవత్సరం [[పుష్కరము|పుష్కరాల]] ఏర్పాట్లలో ఈ విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించారు. ఆచార్య కృపాలనీ, [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]], తెన్నేటి విశ్వనాధం, కాల వేంకట రావు ఈ ప్రదేశంలో ప్రజలను ఉద్దేశించి ఉపన్యసించేవారు, ప్రజలు ఇక్కడ వినేవారు.
 
=== కోట గుమ్మం ===
[[ఫైలు:Mruthyunjayudu statue Fort gate.jpg|right|thumb|కోట గుమ్మం వద్ద నున్న మృత్యుంజయుడి విగ్రహం]]
కోట గుమ్మం గోదావరి రైలుస్టేషను వద్ద ఉన్న ప్రదేశం. కోట గుమ్మం వద్దనే మృత్యుంజయుడి విగ్రహం, అమరజీవి [[పొట్టి శ్రీరాములు]] విగ్రహం, అజంతా హొటలు ఉన్న ప్రదేశాన్ని కోట గుమ్మం అని పిలుస్తారు. ఈ రోజుల్లో ఇక్కడ కోట గుమ్మం కాని లేక గోడ ఏమి కనిపించదు కాని పాక్షికంగా ప్రధాన వీధిలో కనిపిస్తుటుంటుంది, ఈ మార్గం ద్వారానే ఏనుగులు, గుర్రాలు గోదావరి నదికి వచ్చి స్నానం చెయ్యడానికి వెళ్ళేవి. ఈ కోట గోడ రెండు వైపుల వాలుగా ఉంటుంది. ఇక్కడ [[ఆర్థర్ కాటన్]] కుమార్తె సమాధి ఉంది. 1897-1900 సంవత్సరాల మధ్యన రాజమండ్రి గోదావరి పై మీద మొదటి రైలు వంతెన (హేవలాక్ వంతెన) కట్టేటప్పుడు ఈ కోట గుమ్మాన్ని బ్రద్దలు కొట్టారని చెబుతారు. ఈ కోట [[చాళుక్యులు]] 8-11 వ సతాబ్ధాలమధ్య నిర్మించబడినదని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఇప్పుడు కందకం వీధి కనిపిస్తుంది. కందకం = పెద్ద కాలువ. గోదావరి నుండి త్రవ్వబడిన ఒక పెద్ద కాలువ. ఈ కందకం శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అడ్డంగా ఈ కాలువ ఉండేది. 20 అడుగులు లోతు, 50 అడుగుల వెడల్పు ఉండేది.
 
=== కంభం సత్రం కంభాల చెరువు ===
చనిపోయిన తరువాత శాద్ధ్రాలు జరిపే సత్రం. 1845-1850 సంవత్సరాల మధ్య కంభం నరసింగ రావు పంతులు స్వంత నిధులతో ఈ సత్ర నిర్మాణం జరిపించారు. అదేసమయంలోనే ఇక్కడ ఒక చెరువు కూడా త్రవ్వించబడింది. చెరువు త్రవ్వగా వచ్చిన మట్టితోనే ఈ సత్రానికి కావలసిన ఇటుకలు తయారుచేశారు. ఈ సత్రం ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినవారికి శాద్ధ్రాలు నిర్వహించే ఏకైక సత్రం [[కాశీ]]లో కూడా శాద్ధ్రాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా సత్రం లేదు. ఈ సత్రం శిథిలాలుగా ఉంది. ఇక్కడ ఉన్న చెరువులో నిరంతరం నీరు ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఒక క్రీడాప్రాంగణం నిర్మించాలని యోచిస్తున్నది, కాని ప్రజలు దీనికి వ్యతిరేకత చూపించడంతో ఈ చెరువు అభివృద్ధి పరచి కంభాల ఉద్యానవనం మరియు ఒక పడవ షికారు జరపడానికి ఏర్పాట్లు చేస్తోంది. [[విశాఖపట్నం]] పాత నగరంలో పిండాల సత్రం అని ఉంది. ఈ సత్రంలో శ్రాద్ధకర్మలు (పిండాలు పెట్టటం) నిర్వహిస్తారు.
 
== పౌర పరిపాలన ==
 
[[రాజమండ్రి నగరపాలక సంస్థ|రాజమండ్రి నగర పాలక సంస్థ]] 50 వార్డులుగా విభజించారు. దీని పరిధి {{Convert|44.50|km2|mi2|abbr=on}}.<ref name=census>{{cite web|title=District Census Handbook – East Godavari|url=http://www.censusindia.gov.in/2011census/dchb/2814_PART_B_DCHB_EAST%20GODAVARI.pdf|website=Census of India|accessdate=6 November 2015|page=3,16–17|format=PDF}}</ref>
 
== ఆర్ధిక వ్యవస్థ ==
 
చమురు సహజ వాయివుల సంస్థ, తమ యొక్క కృష్ణా గోదావరి ప్రాజెక్టు బేస్ కాంప్లెక్సు, [[గోల్ఫ్]] కోర్టులను నిర్మించింది.
 
== ప్రముఖులు ==
*[[టంగుటూరి సూర్యకుమారి]]
*[[కందుకూరి వీరేశలింగం పంతులు]]
*[[టంగుటూరి ప్రకాశం పంతులు]]
*[[విశ్వనాథం సుందరశివరామ శర్మ]]
*[[ఆదుర్తి సుబ్బారావు]]
*[[మద్దూరి అన్నపూర్ణయ్య]]
*[[న్యాపతి సుబ్బారావు పంతులు]]
*[[పింగళి సూరన్న]]
*[[దామెర్ల రామారావు]]
*[[డా.ఈశ్వర వరాహ నరసింహము]]
*[[కుందూరి ఈశ్వరదత్తు (పాత్రికేయుడు)|కుందూరి ఈశ్వరదత్తు]] ప్రముఖ పాత్రికేయుడు. ది లీడర్ పత్రిక ప్రధాన సంపాదకుడు.
*[[దుర్గాబాయి దేశ్‌ముఖ్]]
* [[విశ్వనాథం మంగయ్య శర్మ (గోపి)]]
* [[మేడపాటి సీతారామి రెడ్డి]]
* [[ఆకెళ్ల శ్రీకృష్ణ మూర్తి]]
* [[పద్మ గిరిజ]]
* [[మల్లంపల్లి శరభేశ్వర శర్మ]]
*[[నేదునూరి గంగాధరం]]
*[[కోకా సుబ్బారావు]]
*[[ఆలీ (నటుడు)]]
*[[ఉండవల్లి అరుణ్ కుమార్]]
*[[గుబ్బల రాంబాబు]] - సమాజ సేవకుడు
*[[నన్నయ|నన్నయ్య భట్టు]]
*[[మధిర సుబ్బన్న దీక్షితులు]] (కాశీమజిలీ కథలు వ్రాసిన కవి)
*[[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]]
*[[కందుకూరి వీరేశలింగం]]
*[[శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి]]
*[[వావిలాల వాసుదేవ శాస్త్రి]]
*[[శివ సాయి ప్రద్యుమ్న]]
*[[ఆకెళ్ళ వెంకట శాస్త్రి]]
*[[శివ ఫణి సూర్య నారాయణ మూర్తి]]
*[[ఆకెళ్ళ అనిల్ దీక్షిత్]]
* [[మల్లంపల్లి శరభేశ్వర శర్మ]]
*[[డా.ఈశ్వర వరాహ నరశింహము]] (వీరు తన అనువాద సాహిత్య రచనలు 26వ ఏట ప్రారంభిం 69 ఏక్ష్ళ వయస్సు వరకు తన వైద్య వృత్తికి లోపము రాకుండా సంవత్సరాన కొ పుస్తకమే చొప్పున సాగించారు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముణ్డక, మాండ్యూక, తైతిరేయ, ఐతరేయ, ఛాంద్యోగ్య, బృహదారణ్య, శ్వేతాశ్వేతరోపనిషత్, మనస్మృతి, వేదాంత దర్శనము, అదవైతవాదము, నిఘంటు సహిత నిరుక్తము, మఱియు ఇతరులను వైదిక గ్రంథములను ఆంధ్రీకరించారు. ఇవి కాక సంస్కృతము అతి సులభంగా పద్ధతిలో నేర్చుకునుటకు వీలుకల్పించు "సంస్కృత పాఠమాల" అను సంస్కృత భాషాబోధినిని స్వీయరచన గావించారు.)
*[[భమిడిపాటి రాధాకృష్ణ]]
*[[గరికపాటి రాజారావు]]
*[[కల్లూరి వేంకట రామశాస్త్రి]]
*[[గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్]]
 
== విద్యా సంస్థలు ==
రాజమండ్రి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యా నిలయం ఇక్కడ ఎన్నో ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ పుణ్య నగరిలో స్వాతంత్ర్యం రాకముందే విద్యకు బీజం పడింది. మహనీయులు శ్రీ కందుకూరి వీరేశలింగం గారివలన స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు ఆ రోజులలోనే ప్రారంభించబడినవి.
 
===ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ===
* ఇది 2006 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. [[తూర్పు]],[[పశ్చిమ గోదావరి]] జిల్లాలకు చెందిన కళాశాలలు ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి.
====ప్రభుత్వ కళాశాల( ఆర్ట్స్ కళాశాల)====
ఇది ప్రస్తుతం నన్నయ విశ్వవిద్యాలయంలో అంతర్భాగంగా ఉంది. ఇక్కడినుండి సైన్స్ విభాగం, యూజీ విభాగాలు పనిచేస్తున్నాయి.
ఈ కళాశాల తూర్పు కోస్తాలో ప్రభుత్వ రంగంలో ఉన్న కళాశాలలో అతి పురాతనమైనది. ఈ కళాశాల 1857లో స్థాపించబడింది. దీనికి మొదటి ప్రిన్సిపాల్ గా "మెట్కాఫ్" అనే ఆంగ్లేయుడు పనిచేశాడు. ఈయన పేరుతోనే విద్యార్థుల వసతి గృహం (మెట్కాఫ్ హాస్టల్) ఇప్పటికీ నడుస్తున్నది. [[ఆడవి బాపిరాజు]] ఇక్కడ చదువుకున్నారు. [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] ఇక్కడ ఈ కళాశాలలో ముఖ్యాధ్యాపకులుగా పనిచేశారు. ఈ కళాశాల [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] కంటే పురాతనమయినది.
 
===రాజమండ్రి కేంద్రీయ విద్యాలయం ===
సెంట్రల్ పాఠశాల (Central School) అని ప్రముఖంగా పిలిచే ఈ కేంద్రీయ విద్యాలయం భారత ప్రభుత్వపు మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహణ లోని విద్యాలయము. 1965 లో "సెంట్రల్ స్కూల్స్" అన్న పేరుతో సీబీఎస్సీకి అనుగుణంగా మొదలయ్యాయి. తరువాత కేంద్రీయ విద్యాలయ అని పేరు రూపాంతరం చేసారు. రాజమండ్రిలో ఈ విద్యాలయము 1992 లో స్థాపించారు. ప్రాథమికంగా ఈ విద్యాలయాలను భారత రక్షణా వ్యవస్థ, భారత సైన్యంలో పనిచేసే సైనికుల పిల్లల కోసం ఏర్పాటు చేసారు. ఆర్మీ వారు సొంత విద్యాలయాలు నెలకొల్పాక కేంద్రీయ విద్యాలయాలను అన్ని కేంద్ర సంస్థలకు అందుబాటులో తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరచూ స్థానబదిలీ సమస్యను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను రూపొందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకే సిలబస్ ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనబడే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈ విద్యాలయాలను నడుపుతుంది.
 
===గైట్ (గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ )ఇంజనీరింగ్ కాలేజ్===
రాజమండ్రి నగరంలో ఇది మొదటి ఇంజినీరింగ్ కాలేజ్
2007లో కొత్తగా పెట్రోవర్సిటి స్థాపించారు. అక్కడ పెట్రోలియానికి సంబంధించిన విద్యను అందిస్తున్నారు.దక్షిణ భారతదేశం లోనే గల ఏకైక పెట్రోవర్సిటి ఇది. 2009 సంవత్సరంలో దేహ్రదున్ వద్దకు మర్చబదింది
 
===రైట్ రాజమహేంద్రి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజినేరింగ్ అండ్ టెక్నాలజీ (ఇంజనీరింగ్ కాలేజి)===
 
===శ్రీ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం===
శ్రీ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం యొక్క ఒక శాఖ రాజమండ్రిలో ఉంది. ఇది 1985 డిసెంబరు 2 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరియు ఇతర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది.
 
===మరికొన్ని===
* ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ కళాశాల ఇది ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ( హైదరాబాద్ ) యొక్క అనుబంధ సంస్థ ఇది 2008 లో స్థాపించాబడింది . అక్కడ వ్యవసాయ డిగ్రీ అందిస్తున్నారు.
* శ్రీ నాగరాజ ఉన్నత పాఠశాల
శ్రీ నాగరాజ ఉన్నత పాఠశాల విద్యానగర్ లో నిర్మితమైనది. ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించడంలో పేరు గాంచింది. ఎంతోప్రావీణ్యము పొందిన ఆచార్యుల చేతులమీదుగ చాలామంది పేద విద్యార్థులు ఉత్తీర్ణులై ఎంతో మంచి భవిష్యత్తు పొందుతున్నారు. ఇపుడు ఈ పాఠశాలలో 10వ తరగతి వరకు శిక్షణాతరగతులు ఉన్నాయి.
 
* జి.యస్.ఎల్ వైద్య కళాశాల ఇది దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలలో ఒకటి .
*డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల. ఇది 1940 లో స్థాపించబడింది.
*కందుకూరి వీరేశ లింగం గారి కృషి వలన స్థాపించిన విద్యాసంస్థలు -శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా జూనియర్ మరియు డిగ్రీ, పి.జి కళాశాల యస్.కే.వి.టి ఉన్నత ఆంగ్ల బోధనా పాఠశాల,యస్.కే.వి.టి ఉన్నత తెలుగు బోధనా పాఠశాల, యస్.కే.వి.టి జూనియర్ కళాశాల,యస్.కే.వి.టి డిగ్రీ & పి.జి కళాశాల
*జి.కే.యస్.యమ్ "లా" కళాశాల
*డాక్టర్ అంబేత్కర్ జి.యమ్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల
 
== రవాణా సౌకర్యాలు ==
=== రోడ్డు రవాణా సౌకర్యాలు ===
రాజమండ్రి [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]]ని కలిపే జాతీయా రహదారి - 5 మీద ఉంది. రాజమండ్రి నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉంది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. నగరంలో ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయంతో కలిపి, గోకవరం, కోటిపల్లి హైటెక్ బస్సుస్టాండ్,అనే మెత్తం నాలుగు బస్టాండ్లు ఉన్నాయి.
 
==== ఆర్.టి.సి. రవాణా ====
[[ఫైలు:Rajahmundry bus complex.JPG|thumb|right|రాజమండ్రి బస్సు ప్రధాన నిలయం]]
[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆర్.టి.సి.]] బస్టాండు రాజమండ్రి నుండి రాష్ట్రం నలుమూలకు నడిపే బస్సుల తోటి, ప్రైవేటు బస్సుల తోటి కలుపబడుతోంది. రాజమండ్రి బస్సు కాంప్లెక్స్ (బొమ్మ ప్రక్కన ఉన్నది) నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు, పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన [[కాకినాడ]], [[తుని]], [[అన్నవరం]], [[విశాఖపట్నం]], [[విజయనగరం]], [[శ్రీకాకుళం]], [[విజయవాడ]], [[తాడేపల్లిగూడెం]], [[ఏలూరు]], [[నిడదవోలు]],[[గుంటూరు]]కి బస్సులు సర్వీసులు ఉన్నాయి.
 
==== కోటిపల్లి బస్టాండు ====
కోటిపల్లి బస్టాండు పాల్ చౌక్ వద్ద ఉంది. గోదావరి రైలు రోడ్డు వంతెన దిగి రాజమండ్రిలో ప్రవేశించిన వేంటనే ఈ బస్టాండు వస్తుంది. ఈ బస్టాండులో రాజమండ్రి రైలు స్టేషను మీదుగా [[ధవళేశ్వరం]] వైపుగా [[రావులపాలెం]], [[అమలాపురం]] [[మండపేట]], [[రామచంద్రపురం]], [[ద్రాక్షారామం]], [[కొటిపల్లి]] వెళ్ళే ఆర్.టి.సి.బస్సులు, రైలు రోడ్డు వంతెన మీదుగా [[కొవ్వూరు]], [[నిడదవోలు]], [[పోలవరం]], [[తాడేపల్లిగూడెం]], [[తణుకు]], [[భీమవరం]], [[పాలకొల్లు]] వెళ్ళే ఆర్.టి.సి. బస్సులు ఆగుతాయి. ముఖ్యంగా ఆగేవి ఆర్.టి.సి. బస్సులు, కాని నగరంలో తిరిగే కొన్ని ప్రైవేటు బస్సులు కూడా ఆగుతాయి. ఈ బస్సునిలయాన్ని ఈ మధ్యకాలంలో [[ఐ.టి.సి]] వారి సహాయంతో ఆధునీకరించారు.
 
==== గోకవరం బస్టాండు ====
గోకవరం బస్టండులో ప్రస్తుతం రాజమండ్రిలో విలీనం చేస్తున్న పరిసర గ్రామాలూ ఐన కోరుకొండ గాడాలా,కొంతమురు, గోకవరం ఇతర ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులు మరియు ప్రైవేటు బస్సు నిలుస్తాయి. ఈ బస్సు నిలయం గోదావరి రైలు స్టేషనుకి ఆవతల, రాజమండ్రి నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉంది. ఈ బస్సు స్టేషను నుండి తిన్నగా వెళ్ళితే దేవి చౌక్, కంభాల చెఱువు వస్తుంది.
 
=== రైలు సౌకర్యం ===
{{Further|గోదావరి రైల్వే స్టేషను}}
[[ఫైలు:New godavari stn.JPG|thumb|right|క్రొత్త గోదావరి రైలు స్టేషను]]
రాజమండ్రి [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారతదేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. మెదటిది గోదావరి రైలు స్టేషను (ప్రక్కన బొమ్మ చూడండి), రెండవది రాజమండ్రి రైలు స్టేషను. గోదావరి నది మీద మెదటి రైలు వంతెన (హేవలాక్‌ వంతెన్) 1900 నిర్మించబడినప్పుడు గోదావరి రైలు స్టేషను నిర్మించారు. తరువాతి కాలంలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో రైల్వే లైను సౌలభ్యం కోసం రైలు రోడ్డు వంతెన నిర్మాణం జరిగింది. 19890-1995 సంవత్సరాల మధ్య మూడవ రైలు వంతెన నిర్మాణం జరిగింది.
 
==== గోదావరి రైల్వే స్టేషను ====
{{Further|కొవ్వూరు రైల్వే స్టేషను}}
గోదావరి రైలు స్టేషను రాజమండ్రికి మొట్టమెదటి రైల్వే స్టేషను. మెదటి రైలు వంతెన [[కొవ్వూరు రైల్వే స్టేషను|కొవ్వూరు]] నుండి బయలు చేరి గోదావరి స్టేషను వద్ద ముగుస్తుంది. ఈ రైలు వంతెన పై చివరి సారి 1996లో కోరమండలం ఎక్స్‌ప్రెస్ ని నడిపి ఈ రైలు వంతెనని మూసి వేసి రైల్వేశాఖ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది. మూడవ రైలు నిర్మాణం జరిగాక గోదావరి రైలుస్టేషను కొద్దిగా గోకవరం బస్టాండు వైపు ప్రక్కకు జరపబడింది. 2003 పుష్కరాల సమయంలో ఈ స్టేషను ఆధునీకరించబడింది. ఈ స్టేషను మీదుగా [[కొవ్వూరు]] నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ బండ్లు వెళ్తాయి కాని ప్యాసింజర్ బండ్లు మాత్రమే నిలుస్తాయి. రాజమండ్రి నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ బండ్లు మాత్రమే వెళ్తాయి మరియు ఆగుతాయి. విజయవాడ వైపు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బండ్లు రెండవ రైలు వంతెన (రైలు రోడ్డు వంతెన) మీదుగా వెళ్తాయి.
 
==== రాజమండ్రి రైల్వే స్టేషను ====
{{Further|రాజమండ్రి రైల్వే స్టేషను}}
రెండవ రైల్వే లైను సౌకర్యార్థం రోడ్డు రైలు వంతెన నిర్మాణం జరిగాక రాజమండ్రి రైల్వేస్టేషను జరిగింది. కోస్తా జిల్లాలలో [[విజయవాడ]]-[[విశాఖపట్నం]] నగరాల మధ్యనున్న ముఖ్య రైలు స్టేషను. ఈ స్టేషనులో అన్ని రైలు బండ్లు ఆగుతాయి.
 
=== విమాన సౌకర్యం ===
{{Further|రాజమండ్రి విమానాశ్రయం}}
నగర శివార్లలో ఉన్న [[మధురపూడి]]లో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉంది. ఈ మధ్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు బవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా నిర్మించారు ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వెస్ మరియు స్పైస్ జెట్ వారు [[హైదరాబాదు]], [[చెన్నై]], [[బెంగళూరు]] నగరాలకు విమానాలను నడుపుతున్నారు.
 
=== జలరవాణా సౌకర్యాలు ===
రైలు వంతెన మరియు రోడ్డు వంతెన వచ్చాక జల రవాణా మీద ప్రజలు ఆధారపడడం లేదు. కాని జలరవాణా పర్యాటక రంగం ఊపందనుకోవడం వల్ల మళ్ళీ జీవము వస్తున్నది. ఇక్కడ నుండి పాపి కొండలకు, [[భద్రాచలం]] మరియు [[పట్టిసం|పట్టిసీమ]]కు లాంచీ సదుపాయం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా లాంచీలు నడుపుతున్నారు.
 
== పరిశ్రమలు ==
* భారతదేశము మొత్తానికి [[కాగితము]] సరఫరా చేస్తున్న పరిశ్రమలలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థ-''' ఏ.పి.పేపర్ మిల్స్'''.ఇప్పుడు అంతర్జాతీయ పేపర్ సంస్థ (International Paper )ఆధ్వర్యంలో నడపబడుచు అంతర్జాతీయంగా పేరు గాంచినది ఈ పరిశ్రమ రాజమండ్రి చుట్టు ప్రక్కల ఊరి వారికి జీవనాధారముగా కూడా ఉంది.
* సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇనిస్టిస్టుట్ (CTRI) ఇండియన్ లీఫ్ టొబాకో డివిజన్ వారి సమన్వయంతో రాజమండ్రిలో పనిచేస్తున్నాయి.
* [[విజ్జేశ్వరం]] సహజవాయువుతో విద్యుత్తు తయారు చేసే కేంద్రము.
* [[ఓ.ఎన్.జి.సి]] (చమురు మరియు సహజ వాయివు సంస్థ) ([[w:en:ONGC|ONGC]]) (Navaratna) వారి కృష్ణ-గోదావరి బేసిన్ ప్రాజెక్టు కార్యాలయాలు రాజమండ్రిలో ఉన్నాయి.
* కోస్టల్ పేపర్ మిల్స్
* సథరన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ అనే మందుల కంపెనీ
* హారిక్ల్స్ ఫ్యాక్టరీ స్మిత్ క్లైన్ బీచ్‌హమ్‌ కన్సుమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ వారి హారిక్స్ల్ ఫ్యాకటరీ [[ధవళేశ్వరం]] వెళ్ళే మార్గములో ఉంది.
* కడియం పేపరు మిల్లు - [[కడియం]]
*పులమర్కేట్ మరియు మొక్కల నర్సరీలు - [[కడియపులంక]]
* జి.వి.కే. ఇండట్రీస్‌ మరియు జేగురుపాడు విద్యుత్తు కేంద్రము - [[జేగురుపాడు]]
* రాజమండ్రి కో.ఆఫ్‌. స్పిన్నింగ్‌ మిల్స్ లిమిటెడ్- [[లాలాచెరువు]]
* సర్వరాయ సుగర్స్‌ ప్రైవేటు లిమిటెడ్ ([[కోకొ కోలా]] బాట్లింగ్‌ లిమిటెడ్)-[[వేమగిరి]]
* నైలోఫిల్స్‌ ఇండియా లిమిటెడ్‌ - గుండువారి వీధిలో ఆఫీసు. కర్మాగారము - [[ధవళేశ్వరం]]
* గోదావరి సిరమిక్స్ - [[పిడింగొయ్యి]]
* [[రత్నం బాల్ పెన్ వర్క్స్]]
 
== గోదావరి పుష్కరాలు==
{{main|గోదావరి నది పుష్కరము}}
[[పుష్కరము]] అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
 
== దృశ్యమాలిక ==
<gallery>
File:Rajahmundry Airport 1.jpg|thumb|రాజమండ్రి ఎయిర్ పోర్ట్
బొమ్మ:Devi chowk2.JPG|దేవీ చౌక్ కూడలి
బొమ్మ:Rjy Municipal corporation office.jpg|రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం
బొమ్మ:Rjy freedon fighter statues.jpg|రాజమండ్రి గోదావరి బండ్ మీద శ్రద్ధానంద ఘాట్ ఎదురుగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు
బొమ్మ:Rjy rail cum road Bridge.jpg|రాజమండ్రి రైలు రోడ్డు వంతెన
బొమ్మ:Godavari old and new bridges 2.jpg|రాజమండ్రి మొదటి మరియు రెండవ వంతెనలు
బొమ్మ:Rjy city view from rail cum road bridge.jpg|రాజమండ్రి నగర దృశ్యం రైలు రోడ్డు వంతెన మీద నుండి
బొమ్మ:Rjy rajarajanaderna.JPG|రాజమండ్రిలో పుష్కర ఘాట్ కి ఎదురుగా ఉన్న రాజరాజనరేంద్రుడు విగ్రహం
బొమ్మ:Rail cum road birgde.JPG|రైలు, లారీలు ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు రోడ్డు వంతెన దృశ్యం
</gallery>
{{Commons category|Rajahmundry}}
 
==రేడియో==
93.5&nbsp;MHz (రెడ్.ఎఫ్.ఎమ్) రాజమండ్రి నెం1 ఎఫ్.ఎమ్.స్టేషను. ఇక్కడ నుండి ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలు శ్రోతలను అలరిస్తుంటాయి. వినోదమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందించే కార్యక్రమాలు ఇక్కడ ప్రసారమవుతుంటాయి. దీని ఉపశీర్షిక "వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా 93.5 రెడ్.ఎఫ్.ఎమ్"
==మరింతగా చదవటానకి==
{{వికీసోర్స్|ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదునాలుగవ ప్రకరణము#రాజమహేంద్రవరము.}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
==ఆధారములు==
1
1.http://www.eenadu.net/hyderabad-news-inner.aspx?item=break210
 
[[వర్గం:రాజమండ్రి]]
56

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2527312" నుండి వెలికితీశారు