"పిఠాపురం" కూర్పుల మధ్య తేడాలు

rv
(rv)
'''పిఠాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 533450.
==ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర ==
 
ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో పిఠాపుర<nowiki/>ము అను గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము... 20 తేదివుదయాన నాలుగున్నరగంటలకు భయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము గయాసుర [[రాజధాని]]<nowiki/>గా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ ఒక [[చెరువు|తటాక]] మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున ఒక చిన్న [[శివాలయము]]<nowiki/>న్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో ఒకపాడుకూపములో అష్టాదశపీఠములతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు.
 
యీ వూళ్ళో యిన్నూరు బ్రాహ్మణయిండ్లు ఉన్నాయి. వారందరు తీర్ధవాసులుగా [[యాచకులు|యాచక]]<nowiki/>వృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపకమయిన జీవనము లేని [[బ్రాహ్మణుడు]] లేడు. యీ దినము [[తొలిఏకాదశి]]. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప [[పండుగ|పండగ]]<nowiki/>గా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, [[భోజనము]]లు కాచేసుకున్నందున గయాతీర్ధములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.
 
యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులు నీలాద్రిరాయనింగారి కుటుంబస్థులు ఒక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన [[వీధులు]] కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిన దారి కొంతమేర [[అడుసు]] నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, [[మొగిలి]]చెట్లు, [[జెముడు]], యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.''
 
== చరిత్ర ==
[[సముద్ర గుప్తుడు]] [[అలహాబాదు]] శాసనములో పిఠాపురము నాలుగో శతాబ్దపు తొలిపాదములో ఒక రాజధానిగా ఉండినట్లు తెలుపబడి యున్నది. పిఠాపురములోని దొరికిన [[జైన]] విగ్రహముల మీది ఉపవాస క్లేశ చిహ్నాలు, వాటి రొమ్ము మీద ఉన్న కొన్ని గాడులూ, [[తాటిపాక]] విగ్రహములు, పెనుమంచిలి చౌముఖములు మొదలైనవి అన్నీ కోన రాజ్యము ఏర్పడిన 12 వ శతాబ్దము ప్రారంభము తరువాతవని తెలియుచున్నవి. వీటిని బట్టి పిఠాపురము గర్భములో చాలా చరిత్ర ఉన్నట్లు తెలియుచున్నది.దీనిని '''పిష్ఠపురం''' అని కూడా అనేవారు.
 
పిఠాపురాన్ని పూర్వం '''పీఠికాపురం''' అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో [[బంగారు]] పాత్ర, వేరొక చేత బాగుగా పండిన [[ఉసిరి]] కాయ, మూడవ చేత [[త్రిశూలం]], నాల్గవ చేత లోహ [[దండం]] ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో [[షణ్ముఖుడు|కుమారస్వామి]] ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు [[శ్రీనాథుడు]] భీమేశ్వర పురాణంలో ఈ కింది విధంగా చెబుతాడు.
 
: "హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
: ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
: గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
: గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
[[File:PhiThapuram.Rly. Stn..JPG|thumb|right|పిఠాపురం రైల్వే స్టేషను]]
పిఠాపురానికి ఉత్తర దిక్కున [[ఏలేరు]] అనే ఏరు ఒకటి ఉంది ( ప్రస్తుతం దీనిని [[చెరుకుల కాలువ]] అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు [[శ్రీనాథుడు]] అలా అనేసి ఊరుకోకుండా-
: "ఏలేటి విరినీట నిరుగారునుంబండు
: ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
 
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ [[శ్రీనాథుడు]] తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు [[పనస]] చెట్లు, [[వక్క|పోక]] తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాథుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. [[సింహాచలం]] వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర [[సముద్రం]]<nowiki/>లో కలుస్తుంది. అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడా సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి "శ్రీనాథ కృతి సమీక్ష" అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డె రాజులతో వైరం పూనిన [[విజయనగరం]] గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ఠ చేసేరుట. ఈ జగన్నాథ స్వామి [[చేతులు]] ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని "మొండి జగ్గప్ప" అని ప్రాంతీయులు పిలుస్తారు.
 
పిఠాపురంలో కుంతీమాధవ స్వామి [[ఆలయం]], కుక్కుటేశ్వరుడి కోవెలలు ఉన్నాయి. [[వృత్తాసురుడు|వృత్తాసురుడిని]] చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకుందికి ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించేడు. అవి <ref>http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom3.html</ref>.
* [[కాశీ]]లో బిందు మాధవ స్వామి.
* [[ప్రయాగ]]లో వేణు మాధవ స్వామి.
* పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
* [[తిరుచునాపల్లి]]లో సుందర మాధవ స్వామి.
* [[రామేశ్వరము|రామేశ్వరం]] లో సేతు మాధవ స్వామి.
 
== పౌరాణిక ప్రశస్తి ==
గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంవత్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా ''నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని'' కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక [[కీటకాలు]], [[సూక్ష్మజీవులు]] కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.<br />
56

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2527314" నుండి వెలికితీశారు