కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
rv
పంక్తి 30:
}}
 
'''[[కాకినాడ]]''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] tజిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. [[న్యూయార్క్]] నగరము మాదిరిగా [[వీధులు]] రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ [[మద్రాసు]] గానూ, [[చమురు]] అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ [[ముంబయి]] గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. [[ఆంధ్రప్రదేశ్]] పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి [[కాకినాడ]]<nowiki/>ని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో [[కృష్ణా గోదావరి బేసిన్‌|కె.జి బేసిన్]] రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.
 
==కాకినాడ పేరు వెనుక ఇతిహాసం==
[[File:Kakinada written in telugu 2013-12-31 13-26.jpg|thumb|250px|'''కాకినాడ''']]
[[ ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ’ అంటూ పేర్కొన్నారట! కాలక్రమంలో ‘కాకివాడ’గా, ‘కాకినాడ’గా మారిపోయింది!
కాకినాడ అనే పేరు వెనుక అనేక కథలు ఉన్నాయి.
* కాకినాడ పేరు మొదట '''కాకి నందివాడ''' అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది.
* త్రేతాయుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు [[రాముడు]] అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
* ఇక్కడకి మొదట [[డచ్]] వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత [[ఆంగ్లేయులు]] వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత [[కెనడా|కెనడియన్‌]] బాప్తిస్టు [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
* బ్రిటీషువారి కాలంలో కాకెనాడ /కోకనాడ (Cocanada) గా పిలువబడి, [[స్వతంత్రం|స్వాతంత్ర్యం]] వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు [[బ్రిటిషు]] వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కోకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.
* ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి ఎర్రకలువ (కోకనదము) లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది.
* బిటీష్‌ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులలో ఇక్కడ పండే [[పంట]]<nowiki/>ల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. సర్వే అధికారులు, పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ’ అంటూ పేర్కొన్నారట! కాలక్రమంలో ‘కాకివాడ’గా, ‘కాకినాడ’గా మారిపోయింది!
 
==నైసర్గిక స్వరూపము==
Line 39 ⟶ 46:
కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం (latitude) దగ్గర, 82.22° [[తూర్పు రేఖాంశం]] (longitude) దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 [[ఉత్తర రేఖాంశం]] కాకినాడ మీదుగా పోతుంది. సగటున కాకినాడ ఊరంతా [[సముద్రమట్టానికి ఎత్తు|సముద్ర]]<nowiki/>మట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది. నగరం యొక్క సరాసరి వెడల్పు 6 కి.మీ కాగా, పొడవు 15 కి.మీలు.
 
స్థూలంగా, నగరం రెండు ప్రాంతాలుగా ఉంటుంది. దక్షీణ ప్రాంతమైన [[జగన్నాధపురాన్ని]], మిగిలిన నగరాన్ని విడదీస్తూ బకింగ్ హాం కాలువ ఉంటుంది. స్థానికంగా, దీనిని ఉప్పుటేరుగా పిలుస్తారు. డచ్ కోరమాండల్ వారి వలసల కాలంలో, [[జగన్నాధపురం]], [[డచ్]] ఈస్టిండియా కంపెనీకి చెందిన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 1734 సం. నుండి 1834 సం. వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.
 
ఉత్తర ప్రాంతం అయిన కాకినాడ, శివారు గ్రామాలు ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరం నుండి దక్షిణం వఱకూ ఉన్న పారిశ్రామిక గొలుసు, నగరం యొక్క తూర్పు ప్రాంతాన్ని సముద్రతీరం నుండి వేరుచేస్తోంది. కాకినాడకి అగ్నేయంగా కాకినాడ అఖాతం ఉంది. ఈ ప్రాంతంలోని మడ [[అడవులు]], [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇదే ప్రాంతం [[కోరింగ వన్యప్రాణి అభయారణ్యం|కోరింగ అభయారణ్యానికి]] నెలవు. [[గోదావరి]]కి పాయలలో ఒకటైన 'గౌతమి', కాకినాడకి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.
 
===హోప్ ఐలాండ్===
కాకినాడ తీర ప్రాంతం అంతా '''[[హోప్ ఐలాండ్]]''' (హోప్ ద్వీపం) ([http://wikimapia.org/#lat=16.971139&lon=82.346478&z=13&l=0&m=a&v=2 వికీమాపియాలో హోప్ ఐలాండ్]) చేత పరిరక్షింపబడుతున్నది. [[సముద్రం|సముద్రపు]] ([[బంగాళా ఖాతము]]) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ [[హోప్ ఐలాండ్]] తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ [[హోప్ ఐలాండ్]] వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి.
మహాలక్ష్మీ పర్యాటకం, [[చొల్లంగిపేట]] వారి హోప్ ఐలాండ్ విహార యాత్ర మట్లపాలెంలో ఉంది.
 
{{Geographic location
|Northwest = [[వరంగల్]], [[కరీంనగర్]], [[పూణే]], [[ముంబయి]]
Line 64 ⟶ 78:
==వాతావరణం==
==పట్టణ చరిత్ర==
[[File:Gandhi statue at Kakinada 01.JPG|thumb|గాంధీనగర్ ఉద్యానవనంలో జాతిపిత విగ్రహం]]
[[File:Gandhi statue at Kakinada 01.JPG|thumb|గాంధీనగర్ . ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది. చెట్లు విపరీతంగా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.
ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్‌ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.
 
భారతదేశంలో వాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తిన్నటి విశాలమైన [[వీధులు]], విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి [[గ్రంథాలయాలు]], కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 1900 సంవత్సరం నుండి ఉన్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 48000. మద్రాసు రాష్ట్రంలోని అచ్చతెలుగు ప్రాంతాలలో అతి పెద్ద నగరం ఇదే. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, [[పరిశ్రమలు]], వ్యాపార సంస్థలు కూడా రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.
 
ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి రిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.అడ్డు ఆపు లేని నగరీకరణం వలన [[పర్యావరణము|పర్యావరణం]] పైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది. చెట్లు విపరీతంగా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.
 
===కొన్ని ముఖ్య సంఘటనలు===
 
* 19వ శతాబ్దంలో కాటన్ ఆనకట్ట పూర్తయ్యి [[ధవళేశ్వరం]] – కాకినాడ కాలువ ([[బకింగ్‌హాం కాలువ|బకింగ్ హామ్ కాలువ]]) వినియోగంలోకి వచ్చిన తర్వాత, కాకినాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 1881నాటికి 17వేలుగా ఉన్న పట్టణ జనాభా, 1901 నాటికి 48వేలకి చేరి, సర్కారు జిల్లాల్లో అతిపెద్ద నగరంగా ఏర్పడి, [[చెన్నై|మద్రాసు]] – [[కలకత్తా]] మధ్యలో అత్యంత భద్రమైన, అత్యుత్తమైన ఓడరేవు (Safest and Best Port) గా, రెండవ మద్రాసుగా పేర్కొనబడింది. నిజాం ఏలుబడిలోని బీరార్ ప్రాంతంనుండి, గోదావరి నదిమీద, భద్రాచలం మీదుగా, కాకినాడ ఓడరేవుకి జలరవాణా అధికమయ్యింది. ఒకానొక స్థాయిలో, కాకినాడ రాజధానిగా సర్కారు జిల్లాలని మద్రాసు ప్రెసిడెన్సీనుండి వేరుచేసి, మఱో ప్రెసిడెన్సీగా ఏర్పాటుచేసే ప్రతిపాదనలు కూడా బ్రిటీషువారు చేసుకున్నారు. (ఆ కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.) <ref>{{cite web
| url = http://books.google.co.in/books?id=CZEIAAAAQAAJ&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false
| title = Descriptive and Historical Account of the Godavery District in The Presidency of Madras, By Henry Morris
| publisher =
| accessdate = 2014-05-10
 
}}</ref>
*1923సంవత్సరంలో అఖిల [[భారత జాతీయ కాంగ్రెస్]] సభలకు కాకినాడ వేదిక అయింది. ఎప్పటిలాగే, [[జాతీయగేయం|వందేమాతరం]] గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా, అప్పటి కాంగ్రెస్ ముస్లిం నాయకుడు మౌలానా ముహమ్మద్ అలీ జవహర్, అది ఇస్లాంకి వ్యతిరేకమని అభ్యంతరం వ్యక్తం చేసారు.అయితే, వందేమాతరం కాంగ్రెస్ సంప్రదాయమని, తక్కిన పెద్దలందరూ నచ్చజెప్పడంతో ఆయన ఊరుకున్నారు. వందేమాతరం గీతం పైన కొందరు ముస్లింలలో ఉన్న వ్యతిరేకతకి ఉదాహరణగా నిలిచిన తొలి ఘటనగా దీనిని పరిగణిస్తారు.<ref>{{cite web
| url = http://www.rediff.com/news/1998/dec/03vande.htm
| title = A Fatwa against the Idea of India
| publisher = www.rediff.com
| accessdate = 2014-05-10
}}</ref>
*అవే సభలకు, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] వాలంటీరుగా పనిచేస్తూ, వద్ద టిక్కెట్ లేని కారణము చేత నెహ్రూను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను మహాత్ముని, [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రశంసలను పొందింది.
* అప్పటి డి.ఎస్.పి, ముస్తఫా ఆలీ ఖాన్ ని హతమార్చడానికై, 1933 ఏప్రిల్ 6 న, ఏప్రిల్ 14 లలో [[ప్రతివాది భయంకర వెంకటాచారి]] కొన్ని విఫలయత్నాల అనంతరం, ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మరో ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యింది కానీ, [[ప్రతివాది భయంకర వెంకటాచారి]], కామేశ్వర శాస్త్రి మరియు ఇతర విప్లవకారుల కుట్ర బయటపడింది. ఈ సంఘటన కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధమైంది. (క్రీ.శ 1931 మార్చి 30న జరిగిన వాడపల్లి కాల్పుల ఘటన, 1932 జనవరి 19న [[సీతానగరం]] ఆశ్రమ ఘటన లకు ముస్తఫా అలీ ఖాన్ బాధ్యుడని అప్పటి విప్లవకారులు భావించారు) . చాలా కాలం అనంతరం, సెప్టెంబరు 11 న [[ప్రతివాది భయంకర వెంకటాచారి]]ని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.
* రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు<ref>{{cite web
| url = http://www.thehindu.com/news/cities/chennai/october-69-years-ago-when-madras-was-bombed/article3956159.ece
| title = October, 69 years ago, when Madras was bombed
Line 80 ⟶ 107:
| accessdate = 2014-05-09
}}</ref>
 
==పరిపాలన==
[[File:District Collector Office building at Kakinada.jpg|thumb|కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ కార్యాలయ సముదాయం]]
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు