ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

→‎తొలి జీవితం: లింకులు, కొన్ని వాక్యాల శైలి
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
 
== తొలి జీవితం ==
ఎస్వీ రంగారావు [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]]లో, [[1918]] [[జూలై 3]] వ తేదీన తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించాడు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టాడు కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పని చేశాడు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు, మరియు న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. ఈయనకు వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఈమె భర్త మరణానంతరం మనుమలు, మనుమరాళ్ళతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హైస్కూలు చదువు అక్కడే సాగింది. మద్రాసు హిందూ హైస్కూలులో తన పదిహేనవ ఏట మొదటి సారిగా నాటకంలో నటించాడు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో ఆయనలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవాడు. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవాడు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు [[బళ్ళారి రాఘవ]], గోవిందరాజుల[[గోవిందరాజు సుబ్బారావు]] లాంటి ప్రఖ్యాత నటులను చూసిన రంగారావులోచూసి తాను కూడా ఎలాగైనా నటుడు కావాలనే కోరిక బలపడిందిఅవ్వాలనుకున్నాడు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవాడు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవాడు. వాటిని విశ్లేషించేవాడు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన [[లవకుశ (1934 సినిమా)|లవకుశ]]. మద్రాసులో ఎస్. ఎస్. ఎల్. సి వరకు చదివాడు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాలలోనూ, బి. ఎస్. సి కాకినాడలోని పి. ఆర్. కళాశాలలోనూ పూర్తి చేశాడు. మద్రాసులో చదువులో అంతంతమాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ, విశాఖపట్నంకు వచ్చేసరికి చదువులో ముందుండేవాడు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరయితే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం.
 
== నాటకరంగం ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు