కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
→‎వెలుగు తగ్గిన తార: అభిప్రాయాలు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
==వెలుగు తగ్గిన తార==
[[బొమ్మ:Gunasundari-katha-1.jpg | 250px | thumb | left | గుణ సుందరి కథ సినిమాలో [[శ్రీరంజని]]తో శివరావు]]
ప్రతి నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసం పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా సినీవినీలాకాశంలో వెలిగిన శివరావు కాంతి - రాను రాను తగ్గసాగింది. "హాస్యనటులకి ఎప్పుడూ వుండేదే ఇది. ఒక దశలో మాత్రం గొప్పగా వెలిగిపోతారు" అని తెలిసినవాళ్లు అంటారు. [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది. క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. ఐతే ఎవర్నీ వేషాలు ఇవ్వమని అడిగేవాడు కాదు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీ అనవలసిన అవసరం లేదు నాకు!" అని అతను మొండిపట్టుగా కూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు. దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాలల్లో అవకాశాలను దెబ్బ తీసింది. ఐనా తర్వాత నాటకాల్లో నటించడం ఆరంభించాడు.
 
శివరావుకి అంతకుముందున్న ప్రఖ్యాతిని నాటకరంగం బాగా ఉపయోగించుకుంది. తారాపథంలో ఉన్నప్పుడు శివరావుకి ‘బ్యూక్‌’ కారు వుండేది. అప్పటి పెద్ద స్టార్లందరూ బ్యూక్‌ కారునే వాడేవారు. [[మద్రాసు]] పాండీ బజార్లో ఆ బ్యూక్‌ కనిపిస్తే చాలు - అభిమానులు కారు వెంట పరిగెత్తేవారు. అలాంటి దశ రాను రాను తగ్గడంతో అతని ప్రభ కూడా తగ్గింది. "మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడ్నీ. తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో గబ్బిలాల కంపు" అని తన మీద తనే చమత్కారబాణం వేసుకునేవాడు. ఒకనాడు పెద్ద సైజు కారులోని వెనుక సీటులో దర్జాగా కూర్చుని తిరిగిన శివరావు - అదే రోడ్ల మీద డొక్కు సైకిలు తొక్కుకుంటూ తిరిగాడు. "తప్పులేదు, ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే ! అందుకే సినిమా నటీ నటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేనూ ఆత్మాభిమానం వున్నవాడ్నే. ఐతేనేం - జీవితం మిట్ట పల్లాలతో వున్నప్పుడు ఇలాంటివి సహజం" అని వేదాంతిలా మాట్లాడేవాడు ఆయన. చివరి రోజుల్లో ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు కల్పించని పరిస్థితిలో శివరావు గారి మీద అభిమానముతో [[ఎన్.టి.రామారావు]] గారు పలు సినిమాలల్లో అవకాశాలు కల్పించారు. సినిమా షూటింగులల్లో కూడా తాగి వస్తూండటంతో మరి అవకాశాలు రాలేదు
"https://te.wikipedia.org/wiki/కస్తూరి_శివరావు" నుండి వెలికితీశారు