కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 144:
శైవులు, వీర శైవులు పలు సందర్భాలలో దక్షయజ్ఞ దండకం చదివినట్లె ఇక్కడా చదువుతారు. ఇలా చదివేటప్పుడు ఖడ్గదారులు ప్రభ ముందు నిలబడి వెనకకూ ముందుకు నడుస్తూ ఎగిరెగిరి గంతులు వేస్తూ పరవళ్ళు త్రొక్కుతూ వుంటే పక్క నున్న వాళ్ళు బుంజ వాయిద్యాన్ని తప్పెట వాయిద్యాన్ని వాయిస్తూ, కొమ్ము బూరలనూ, కాహశాలనూ ఊది దండకం చదువరిని వుత్తేజ పరుస్తారు.
=='''పర్యాటక ఆకర్షణలు'''==
కోటప్పకొండ పర్యావరణ పర్యాటక క్షేత్రంగానూ అభివృద్ధి చెందుతోంది. సభాపతి డాక్టర్‌ [[కోడెల శివప్రసాదరావు]] పర్యాటక క్షేత్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే భక్తుల కోసం బోట్‌ షికారు, టాయ్‌ ట్రైన్‌, బోట్‌ షికారు కోసం కాళింది మడుగు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులతో ఏర్పాటు చేసిన పిల్లల రాజ్యం, అక్వేరియం ప్రత్యేకంగా ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. త్వరలో తీగమార్గం రాబోతోంది. కొండమీద ఒక చిన్న సరసును నిర్మించి దాని మద్యలో కాళీయమర్ధన శిల్పాన్ని నిరించి ప్రత్యేక కాంతి ప్రసారం చేస్తుంటారు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. వివిధ జలసేకరణ ప్రణాళికల ద్వారా ఈ సరసుకు నీటిని సరఫరా చేస్తుంటారు. కృత్రిమ జురాసిక్ పార్క్ మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇక్కడ పెద్ద జురాసిక్‌లను ఏర్పాటు చేసారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన నెమళ్ళు, పావురాళ్ళు, ఈమోలు మరియు చిలుకలు కూడా ఉన్నాయి. యాత్రీకుల సౌకర్యార్ధం 30 వసతి గదులు కూడా నిర్మించబడ్డాయి. యాత్రీక ఆకర్షణలలో మరొకటి ధ్యానమందిరం. ఇక్కడ హోమాలు నిర్వహించబడతాయి. ఇందులో విశాలమైన భోజనశాల కూడా ఉంది. వివిధ పర్యాటక కేంద్రాలను పర్యవేక్షించడానికి వీలుగా రోప్ వే త్రవ్వకాలలో లభించిన అవశేషాలను బధ్రపరచిన మ్యూజియం పర్యాటక ఆకర్షణగా ఉంది. కార్తీక మాసం అనగానే సహజంగానే వనభోజనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. అనేక పట్టణాల నుంచి, పిల్లల నుంచి పాఠశాలల విద్యార్థులను కార్తీక మాసంలో ఇక్కడ క్షేత్రానికి తీసుకువచ్చి అన్ని చూపించి భోజనాలు ఆయా పాఠశాలల యాజమాన్యాలే ఏర్పాటు చేస్తున్నాయి. ఇవికాకుండా కొండ కింద అన్ని సామాజిక వర్గాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సత్రాలకో ప్రత్యేకత ఉంది. గతంలో అయితే పండుగల సమయంలోనే ఉచిత భోజనం ఉంది. ఇప్పుడు భక్తులు ముందుగా వచ్చి చెబితే నిత్యం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
 
=='''వసతి సౌకర్యాలు'''==
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు