నందలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి 223.238.102.81 (చర్చ) చేసిన మార్పులను స్వరలాసిక చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
'''నందలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
కడప - [[తిరుపతి]] మార్గంలో కడప నుంచి 40 కి.మీ. దూరంలో నందలూరు [[చెయ్యేరు|చెయ్యేటి]] (బాహుదానది)కి ఎడమ గట్టున ఉంది. నందలూరులో [[సౌమ్యనాథస్వామి ఆలయం]] విశాలమైనది. సౌమ్యనాథుని [[నారదముని]] ప్రతిష్ఠించాడంటారు. 11వ శతాబ్దంలో [[కుళోత్తుంగచోళుడు]] ఆలయాన్ని నిర్మించాడు. 12వ శతాబ్దంలో [[కాకతీయ]] [[ప్రతాపరుద్రుడు]] ఈ ఆలయానికి గాలిగోపురం కట్టించాడు. ఇంకా ఈ ఆలయాన్ని [[పాండ్యులు]], [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]], [[పొత్తపి]] పాలకులు, [[మట్లి]] రాజులు అభివృద్ధి చేశారు. సౌమ్యనాథాలయం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి 108 స్తంభాలున్నాయి.
ఈ ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ, [[ఆంజనేయ స్వామి]], [[విఘ్నేశ్వరుడు]] ఉన్నారు. ఆలయం గోడల మీద మత్స్య, సింహ చిహ్నాలున్నాయి. గర్భగుడి ముందు ఆలయం కప్పు పై చేప బొమ్మ ఉంది. జలప్రళయం వచ్చి నీరు చేపను తాకినప్పుడు చేప సజీవమై నీటిలో కలిసిపోతుందట. ఆలయ నిర్మాణానికి ఎర్రరాతిని ఉపయోగించారు. ఈ సౌమ్యనాథుని చొక్కనాథుడు అంటారు. [[ఆదికవి]] [[నన్నయ్య|నన్నయ]] ఈ సౌమ్యనాథుని దర్శించి సేవించాడు. నందలూరుకు 5 కి.మీ. దూరాన [[తాళ్ళపాక]] ఉంది. తాళ్ళపాక [[అన్నమయ్య|అన్నమాచార్యులు]] కూడా చొక్కనాథుడిని సేవించాడు.
కాకతీయ [[ప్రతాపరుద్రుడు]] మన్నూరు, హస్తవరం, నందలూరు, అడపూరు, మందరం గ్రామాలను ఈ ఆలయానికి దానంగా ఇచ్చాడు. ఆ గ్రామాల రెవెన్యూ ఇప్పటికీ ఆలయానికే అందుతోంది. నందలూరును నిరందనూరు, నిరంతనూరు, నిరంతాపురం, నెలందలూరు అని కూడా పిలిచేవారు. ఈ గ్రామం ఒకప్పుడు [[బౌద్ధ మతము|బౌద్ధ]] క్షేత్రం. నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామముండేది. ఇప్పటికీ దీనిని బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట మీద సొరంగ మార్గముంది. నందలూరు దగ్గర చాలా గుహలున్నాయి. [[సిద్ధవటం]] కోటలోనుంచి నందలూరు గుహల్లోకి రహస్య మార్గముందంటారు. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో [[బౌద్ధ స్తూపాలు]], [[బౌద్ధ విహారం]], కొన్ని కట్టడాలు, 1600 పైగా సీసపు నాణేలు, మరికొన్ని బౌద్ధ చిహ్నాలు దొరికాయి.
"https://te.wikipedia.org/wiki/నందలూరు" నుండి వెలికితీశారు