నందలూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 63:
నందలూరు గురించి యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన కాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేశారు. 1830నాటికి ఈ గ్రామం పుణ్యక్షేత్రంగా పేరొందింది. వీరాస్వామయ్య ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ ఊరి వద్ద చెయ్యారనే నది గడియదూరం వెడల్పు కలిగుందన్నారు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నవని, పరశురాముని మాతృహత్య నివర్తించిన స్థలమని ఆయన పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
===1.సౌమ్యనాథ స్వామివారి ఆలయం===
11వ శతాబ్దంలో చోళవంశరాజులచే నిర్మించబడిన ఆలయం. సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. 11వ శతాబ్దపు పూర్వా ర్థంలో చోళరాజులు నిర్మించి స్వామివారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల్లో లిఖించబడి ఉంది. అప్పటి నుండి చోళపాండ్య కాకతీయ మట్లి మున్నగురాజులు 17వ శతాబ్దం వరకు దశలవారీగా ఆలయనిర్మాణం చేపట్టి పలు రాజుల పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి [[నందలూరు]], [[ఆడపూరు]], [[మందరం]], [[మన్నూరు]], హస్త వరం అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. అన్నమయ్య జన్మస్థానమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీ సౌమ్యనాథున్ని చొక్కానాథుడని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించారు. ఆలయ కుడ్యాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్య్స, సింహ, అర్థచంద్రాకారపు చిహ్నాలున్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా, [[తెలుగు]]శాసనాలు కొన్నిమాత్రమే. దేవస్థానంలో గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి [[విజయనగర]] పాలన వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి.
ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, [[తమిళనాడు]], [[కర్నాటక]] తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు.
బ్రహ్మోత్సవాలు:- ప్రతి సంవత్సరం [[ఆషాఢమాసం]]లో జరిగే బ్రహ్మోత్సవాలు, 2014 లో జూలై-5 నుండి 14 వరకు నిర్వహించెదరు. ఏడవ తేదీన ఉదయం పల్లకీసేవ, గ్రామోత్సవం, రాత్రికి హంసవాహనం, 8వ తేదీన గ్రామోత్సవం, రాత్రికి సింహవాహనం, 9వ తేదీన పల్లకీ సేవ, రాత్రికి హనుమంతసేవ, 10వ తేదీన ఉదయం శేషవాహనం, రాత్రికి గరుడసేవ, 11వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం, 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ సౌమ్యనాధస్వామివారి కల్యాణ మహోత్సవం, 13వ తేదీ ఉదయం రథోత్సవంం రాత్రికి అశ్వవాహన సేవ, 14వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]
"https://te.wikipedia.org/wiki/నందలూరు" నుండి వెలికితీశారు