రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
== ఆర్ధిక స్థితి గతులు ==
=== వ్యవసాయం, పంటలు ===
ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వలన, విరివీరి ప్రధాన వృతి వ్యవసాయం.జిల్లాలో పండించే ప్రధానపంట [[వరి]]. ఖరీఫ్ మరియు రబీలలో కలిపి 77వేల హెక్టార్లలో వరిపంట సాగవుతుంది. రెండోస్థానంలో ఉన్న జొన్న పంట రెండు కాలాలలో కలిపి 44వేల హెక్టార్లలో పండించబడుతుంది. కందులు ఖరీఫ్‌లో 28వేల హెక్టార్లలో సాగుచేయబడుతుంది. తాండూరు ప్రాంతం కందులకు రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందినది. వేరుశనగ రబీలో 7వేల హెక్టార్లలో పండుతుంది. మండలాల వారీగా చూస్తే వరిపంట హయత్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాలో అత్యధికంగా సాగుఅవుతుంది. జొన్న పంట ఉత్పత్తిలో బషీరాబాదు, మర్పల్లి, వికారాబాదు మండలాలు ముందంజలో ఉన్నాయి. కందిపంట తాండూరు, యాలాల, బషీరాబాదు మండలాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది. మొక్కజొన్న సాగులో చేవెళ్ళ, శంషాబాదు, మొయినాబాదు మండలాలు అగ్రస్థానంలో ఉన్నాయి. చెరుకు పంట బంటారం, పెద్దెముల్ మండలాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది. పండ్ల ఉత్పత్తిలో కందుకూరు మండలం, కూరగాయల ఉత్పత్తిలో చేవెళ్ళ, శంకర్‌పల్లి మండలాలు, పూలఉత్పత్తిలో శంకర్‌పల్లి మండలం ముందంజలో ఉన్నాయి.
 
=== నీటిపారుదల ===
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు