కె.వి.కె.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 46:
 
== యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం ==
[[దస్త్రం:KVK Ramarao-21.jpg|thumb|260x260px377x377px|నందమూరి తారక రామారావు నరసరావుపేట రంగస్థలిపట్టణం నాటకోత్సవాలవచ్చిన సందర్బంగా సినీనటిఈనాడు జయప్రదతోవిలేఖరిగా కెవికె రామారావు]]
ఇంటర్మీడియట్ [[నరసరావుపేట]] పట్టణంలోని యస్.యస్.యన్.కళాశాలలో చదివాడు.ఇంటర్మీడియట్ చదువుతూ ఆటల వైపు మొగ్గు చూపాడు.ఇంతలో ఇతని తండ్రి వెంకటరత్తయ్య ఉద్యోగరీత్యా చీరాల బదిలీ అయినందున, చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కళాశాలలో బి.ఎ. డిగ్రీ చదివిన సమయంలోను అదే ఆటలనందు ఆసక్తి కొనసాగించాడు.కళాశాలలో రెండు సంవత్సరాలు క్రికెట్ టీము కెప్టెన్ గా వ్యవరించాడు.మరో వైపు నాటకాల నందు ఆసక్తి పెంపొందించుకొని,డైరెక్షన్ పరంగా నడక సాగించాడు.ఆంధ్రా యూనివర్శిటీ నుండి లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందాడు.
 
== ఉద్యోగ ఆరంగేట్రం ==
[[దస్త్రం:KVK Ramarao-14.jpg|thumb|377x377px260x260px|నందమూరిఉత్తమ తారకవిలేఖరి రామారావుఅవార్డు నరసరావుపేట పట్టణం వచ్చినఅందుకున్న సందర్బంగా ఈనాడు విలేఖరిగాఅధినేత రామోజీరావుతో కెవికె రామారావు]]
లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తాను [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరాడు.ప్రధాన వృత్తిలోకి చేరినా ఇతనికి ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,[[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అంతంతమాత్రంగా జరిగేవి.ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు పనిచేసేవాడు. అతను కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవాడు.సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని అతనుకున్న నమ్మంకంతో ఒప్పు కునేవాడు కాదు.అతనికి ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు. అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి, అతనిలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటిక పోటీలను 12 సంవత్సరాలు వరుసగా రామారావు ఆధ్వర్యంలో జరిగాయి.[[కళాశాల]]<nowiki/>లోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు దాదావు ఇతని కృషితోనే జరిగాయి.గోవాలో జరిగిన ఆల్ ఇండియా గ్రంధాలయాధికారులు కాన్ఫెరెన్స్ సందర్బంగా గ్రంధాలయాల నిర్మాణానికి కేంధ్ర ప్రభుత్వ గ్రాంటును ఇస్తున్నట్టు తెలుసుకుని,డిల్లీ వెళ్ళి 4,65000/- తీసుకువచ్చి 1979లో గ్రంధాలయ నిర్మాణం చేసిన ఘనత రామారావుదే.
 
== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
<nowiki/>[[దస్త్రం:KVK Ramarao-42.jpg|thumb|260x260px|ఉత్తమనరసరావుపేట విలేఖరిరంగస్థలి అవార్డు అందుకున్ననాటకోత్సవాల సందర్బంగా ఈనాడు అధినేతసినీనటి రామోజీరావుతోజయప్రదతో కెవికె రామారావు]]
ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు 1979 లో ఈనాడు విలేకరిగా చేరి 1998 వరకు పనిచేసాడు.ఆ రకంగా పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు చాలా దగ్గరయ్యాడు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలు,గ్రామాల వార్తలు ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి. వార్తలు నిష్పక్షపాతంగా ఉండేవి. జరిగింది జరిగినట్లుగా రాయటంలో ఆయనకు సరిలేరు అనే భావన ప్రజలలో ఉండేది. ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు (విలేఖరి) గా ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు.అలాగే రామారావు ఈనాడు దిన పత్రిక అధినేత రామోజిరావు గుర్తింపుకూడా పొందాడు.
 
== సేఫ్ మేనేజింగ్ డైరెక్టరుగా పదవీ నిర్వహణ ==
 
[[దస్త్రం:KVK Ramarao-2.jpg|thumb|260x260px|నరసరావుపేట రంగస్థలి నాటకోత్సవాల సందర్బంగా సినీనటి జయప్రదతో కెవికె రామారావు]]
నరసరావుపేట - సత్తెనపల్లి రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీ,దాని మూడు అనుబంధ కంపెనీలు నష్టాల బాటలో పయనించే సమయంలో మేనేజింగ్ డైరెక్టరుగా 2000 సంవత్సరంలో పదవీ భాధ్యతలు స్వీకరించి, 2008 వరకు పనిచేసాడు.కంపెనీని సమర్థవంతంగా నిర్వహించి లాభాలవైపు మరలించి మొదటిసారిగా షేర్ హోల్డర్సుకు డివిడెంట్లు పంచిన మొదటి మేనేజింగ్ డైరెక్టరుగా పేరు పొందాడు.కంపెనీ పరిసర ప్రాంతంలో మొక్కలు నాటించి,కంపెనీ నుండి వెలువడే వ్యర్ధ పదార్థాలు ప్రజలకు హాని కలిగించని రీతిలో పర్యావరణం కాపాడాడు.ఇతను పని చేసిన సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగులుగా ఉన్న అనేకమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించాడు.ప్రభుత్వం నుండి మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ఉత్తమ కంపెనీ అవార్టును స్వీకరించాడు.
 
"https://te.wikipedia.org/wiki/కె.వి.కె.రామారావు" నుండి వెలికితీశారు