కడప: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవి కూడా చూడండి: -మండలాల మూస
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
 
==చరిత్ర==
11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప [[చోళ సామ్రాజ్యము]] లోని భాగము. 14వ శతాబ్దపు ద్వితీయార్థములో ఇది [[విజయనగర సామ్రాజ్యము]]లో భాగమైనది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉండినది. 1422 లో [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని నాయకుడైన]] పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో [[బ్రిటీష్ సామ్రాజ్యం]]లో భాగమైనది. కడప నగరం పురాతనమైనది అయిననూ [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]]పాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనమవగా 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది [[నేక్నాం ఖాన్]] కడప నవాబు అని తేలినది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే [[మయానా నవాబులు|మయాన నవాబు]]లకి ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లినది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు [[కలెక్టరేట్]] లలో ఇది కూడా ఒకటైనది. 1830 లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఆనాటి కడప స్థితిగతులను తన [[కాశీయాత్ర చరిత్ర]]లో రికార్డు చేశారు. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణంగా చెప్పవచ్చు. అందరు పనివాళ్ళూ ఉన్నారని, జిల్లా కోర్టూ, కలక్టరు కచ్చేరీ కలదని వ్రాశారు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళుకట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో [[నది]], ఊరినడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించారు. ఊరివద్ద ఒక [[రెజిమెంటు]] ఉండేది, అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందినది.
[[File:Kadapa tower clock.jpg|right|175px|thumb|<center>వన్ టౌన్ పోలీస్ స్టేషను వద్ద నున్న రహ్మతుల్లా క్లాక్ టవర్ </center>]]
 
"https://te.wikipedia.org/wiki/కడప" నుండి వెలికితీశారు