కడప: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
 
==చరిత్ర==
11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప [[చోళ సామ్రాజ్యము]] లోని భాగము. 14వ శతాబ్దపు ద్వితీయార్థములో ఇది [[విజయనగర సామ్రాజ్యము]]లో భాగమైనది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉండినది. 1422 లో [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని నాయకుడైన]] పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో [[బ్రిటీష్ సామ్రాజ్యం]]లో భాగమైనది. కడప నగరం పురాతనమైనది అయిననూ [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]]పాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనమవగా 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలినది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే [[మయానా నవాబులు|మయాన నవాబు]]లకినవాబులకి ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లినది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైనది. 1830 లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఆనాటి కడప స్థితిగతులను తన [[కాశీయాత్ర చరిత్ర]]లో రికార్డు చేశారు. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణంగా చెప్పవచ్చు. అందరు పనివాళ్ళూ ఉన్నారని, జిల్లా కోర్టూ, కలక్టరు కచ్చేరీ కలదని వ్రాశారు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళుకట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో [[నది]], ఊరినడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించారు. ఊరివద్ద ఒక [[రెజిమెంటు]] ఉండేది, అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందినది.
[[File:Kadapa tower clock.jpg|right|175px|thumb|<center>వన్ టౌన్ పోలీస్ స్టేషను వద్ద నున్న రహ్మతుల్లా క్లాక్ టవర్ </center>]]
 
"https://te.wikipedia.org/wiki/కడప" నుండి వెలికితీశారు