"నాస్తికత్వం" కూర్పుల మధ్య తేడాలు

2,212 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
(కమ్యూనిజం పేజీ కి లింక్ చేశాను)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* ఆస్తికుల దృక్పథం విశ్వంనుంచి ప్రారంభమై మనిషి వరకూ వస్తుంది. నాస్తికుల దృక్పథం మనిషినుంచి ప్రారంభమై విశ్వంవైపు వెళ్తుంది.
* ఆస్తికులు కష్టనష్టాలకు దేవుడిని, సంఘాన్ని, ప్రభుత్వాన్ని కారకులుగా భావిస్తారు. ఆస్తికులు తాము సంఘంలో ఒక భాగం అనుకొంటారు. అయితే నాస్తికులు [[సంఘం]], ప్రభుత్వం... వంటివన్నీ తమలో ఒక భాగంగా భావిస్తారు. అందువల్ల నాస్తికులకు జీవితం పట్ల స్తబ్దత పోయి శ్రద్ధ కలుగుతుంది! తామ చేసే ప గురించి ఆలోచిస్తారు. వాస్తవిక విజ్ఞాన దృష్టి పెరుగుతుంది. సొంత వ్యక్తిత్వం అలవడుతుంది. సామాజిక దృష్టి ఎక్కువవుతుంది. నాస్తికులకు [[యుద్ధాలు]], దౌర్జన్యాలు పట్ల ఆసక్తి ఉండదు. సాటి మనుషులపట్ల ద్వేషం ఉండదు. మత కలహాలుండవు. నియంతృత్వ భావనలుండవు. సమానత్వం, స్వేచ్ఛ, వాస్తవిక విజ్ఞానం, నీతివర్తనం అలవడతాయి.
 
* ఆస్తికులు బానిస విధానానికి అలవాటుపడ్డారు. కాబట్టి వారికి సమానత్వం చేతకాదు. ఎక్కువ తక్కువలనేవి వారికి ఎప్పుడూ ఉంటాయి. నాస్తిక [[చైతన్యం]]వల్ల [[మతాలు]], జాతులు, వర్గాలు అనే భేదాలుండవు.
* ఆస్తికులు బానిసలు కాబట్టి తమకు స్వేచ్ఛ అక్కర్లేదని యజమానుల పాదాలకు మొక్కుతుంటారు. ఈ యజమానులు ఎవరైనా కావచ్చు. మతపెద్దలు కావచ్చు. మత ప్రవక్తలు, నీతిబోధకులు, అవతార పురుషులు ప్రభుత్వ నాయకులు ఇలా ఎవరైనా కావచ్చు. అయితే నాస్తికులు స్వతంత్య్ర జీవనం కోరుకుంటారు కాబట్టి వారు ఎవరికీ లొంగి ఉండరు. వాస్తవాలను నిర్భయంగా ఎదుర్కొంటారు.
* [[బానిస]]లకు సహకారం, పరస్పర గౌరవం చేతకాదు. ప్రజాస్వామిక జీవనం నాస్తికులకే సాధ్యం.
* ప్రభుత్వం ఏదైనా ప్రజలందరికీ సమానమే. వారు ధనికులైనా, పేదలైనా ఏ కులం, మతం, జాతికి చెందినవారైనా వృద్ధులు, పురుషులు, స్త్రీలు... ఎవరైనా అందరికీ సమానంగా చెందుతుంది. అయితే ఆస్తికులు తమ బానిస ప్రవృత్తివల్ల అలా ఆలోచించక అది కొందరికే చెందిందనుకుంటారు. నాస్తికులు అందుకు భిన్నంగా ఆస్తికులు [[ప్రభుత్వం]] ద్వారా సాధించలేని ఫలితాలను సాధించగలుగుతారు.
 
* ధనికులు నాస్తికులవడానికి ఇష్టపడరు. పైగా నాస్తికత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారికి దేవుడిమీద నమ్మకమున్నా లేకున్నా ప్రజల్లో మత విశ్వాసాలను మాత్రం పోషిస్తారు. అసమానతలు తొలగిపోకూడదన్నదే వారి లక్ష్యం. దేవుడు, మతం ఇవన్నీ వారికి కుంటి సాకులే.
* నాస్తికత్వం ఎంత త్వరగా వ్యాపిస్తే అంత వేగంగా వ్యవస్థలోంచి నియంతృత్వాలు తొలగిపోతాయి.
 
* ఎవర్నీ దేవుడు సృష్టించలేదు. అసలుంటే కదా ఆయన సృష్టించడానికి మానవుల కష్టాలకీ - దేవుడికీ ఏవిధమైన సంబంధం లేదు. ఎంతో కాలంనుంచీ దేవుళ్లని ప్రార్థిస్తున్నవారు తమ కష్టాల్ని [[దేవుడు]] తీర్చాడని నిరూపించగలరా? ఎక్కడాలేని దేవుడు కష్టాలు ఎలా తీరుస్తాడు?
* మత నమ్మకాలే ప్రజల్ని పాలిస్తున్నాయి. కర్మ అనుకునే మనస్తత్వమే నూటికి తొంభైమంది ప్రజల్ని నిరుపేదలుగా ఉంచుతోంది. ఈ మతాలు కలిగించే భావదాస్యమే ఆర్థిక దాస్యానికి కారణం. ప్రజల్లో మూఢనమ్మకాలు, మతభావాలు లేకుండా చెయ్యగలిగితే దోపిడీ దానంతట అదే పోతుంది.
* ప్రకృతిలో నియమాలంటూ లేవు. మానవుడు ప్రకృతిని చూసి తన బుద్ధి కుశలత వలన దాన్ని అర్థంచేసుకుంటున్నాడు. అప్పుడు కొన్ని నియమాలు ప్రకృతికి ఉన్నాయని ఊహించి, వాటిని ప్రకృతికి ఆరోపించి వాటి ద్వారా ప్రకృతిని అర్థం చేసుకొంటున్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2531407" నుండి వెలికితీశారు